Pro kabaddi League 8: ఏడాది విరామం తర్వాత మళ్లీ అతి త్వరలోనే మొదలుకాబోతున్న కబడ్డీ సీజన్ కు ముహుర్తం ఖరారైంది. డిసెంబర్ 22 నుంచి మొదలయ్యే 8 వ సీజన్ కు సంబంధించిన మ్యాచ్ లన్నీ ఒకే వేదికలో నిర్వహించనున్నారు.
భారత్ లో IPL తర్వాత జనాలను అంతగా అలరించే మరో ఆట PRO KABADDI LEAGUE. అయితే గతేడాది కరోనా మహమ్మారి కారణంగా ఈ లీగ్ రద్దైంది. ఇక ఈ ఏడాది జులైలోనే జరగాల్సి ఉన్న ఈ లీగ్.. కరోనా రెండో దశ వ్యాప్తితో డిసెంబర్ కు వాయిదా పడింది. ఇటీవలే లీగ్ ప్రారంభతేదిని ప్రకటించిన నిర్వాహకులు.. తాజాగా వేదికను కూడా ఖరారుచేశారు.
కబడ్డీ మ్యాచ్ లన్నీ కర్నాటక రాజధాని Bengaluru వేదికగా జరుగనున్నాయి. ఇందుకు కంఠీరవ ఇండోర్ స్టేడియంతో పాటు మరికొన్నింటిని సిద్ధం చేస్తున్నారు. బెంగళూరుతో పాటు అహ్మదాబాద్, జైపూర్ నగరాల్లో నిర్వహించాలని భావించినా కొవిడ్ నిబంధనలు, వైరస్ వ్యాప్తి కారణంగా కేవలం బెంగళూరులోనే టోర్నీ నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు.
undefined
🚨 Mark Your Calendars 🚨 🔥 pic.twitter.com/c9CBzfzg1h
— ProKabaddi (@ProKabaddi)కాగా, కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. మొత్తం పర్యటననుు తమ రాష్ట్రంలో నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇది కూడా చదవండి :PKL 2021: కూత మొదలవ్వబోతోంది..! దుమ్ము రేగాల్సిందే.. దమ్ము చూపాల్సిందే.. 8వ కబడ్డీ సీజన్ కు ముహుర్తం ఖరారు
ఇదే విషయమై మాషల్ స్పోర్ట్స్ సీఈవో, లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి స్పందిస్తూ.. kabaddi season 8 ను బెంగళూరులో విజయవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశామని వివరించారు. కాగా, Covid protocals మేరకు నిర్వహించనున్న ఈ టోర్నీలో ఆటగాళ్లందరూ బయో బబుల్ లోనే ఉంటారు. అంతేగాక టోర్నీ సమయానికి ప్లేయర్లంతా రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ మ్యాచ్ లు ప్రేక్షకులు లేకుండానే నిర్వహించనున్నారు.