గత రాత్రి తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల జీతాల్లో భారీగా కోతలను విధిస్తు నిర్ణయం తీసుకుంది. దీన్ని ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో ఇలా జీతాల్లో కోతలు విధించడం ద్వారా కలిగే లాభాలను నష్టాలను, భవిష్యత్ పరిణామాలను ఒకసారి చూద్దాం.
గత రాత్రి తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్ వల్ల తన ఆర్ధిక భారాన్ని కొంతలో కొంతైనా తగ్గించుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోతలను విధించింది. ఇందుకు సంబంధించి నిన్న రాత్రి నిర్ణయం తీసుకున్నారు.
ఉద్యోగుల స్థాయినిబట్టి వారి వారి జీతాల్లో కోతను విధించింది. ఐఏఎస్, ఐపిఎస్ స్థాయి ఉద్యోగుల జీతాల్లో 60 శాతం విధించింది. ఇక ఎమ్మెల్యేలు, మంత్రులు(సీఎం తో సహా), ఎమ్మెల్సీల జీతాల్లో 75 శాతం కోతను విధించింది.
పెన్షన్ లలో కూడా 50 శాతం కోతను విధించింది. సన్నకారు ఉద్యోగులైన నాలుగవ తరగతి ఉద్యోగులకు 10 శాతం కొత్త విధించింది. మిగిలిన అన్ని ఉద్యోగుల జీతాల్లో 50 శాతం కోతను విధించింది.
Also read:నిజాముద్దీన్ మర్కజ్‌లో ప్రార్థనలు: ఎఫ్ఐఆర్‌కు ఢిల్లీ సర్కార్ ఆదేశం
ఇక ఇలా నిర్ణయం తీసుకోవడంతో సహజంగానే ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఉద్యోగ సంఘాల మాటను అటుంచినా కూడా కొన్ని ఆలోచించక తప్పదు. ఈ విషయాలను ఆలోచన చేసినప్పుడు అనేక ప్రశ్నలు ఉద్భవించడం సహజం.
తొలుతగా మనం ఆలోచించాల్సిన విషయం ఏమైనా ఉందంటే... తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలలో కోతలు విధించడం ద్వారా ఎంత మిగిల్చారనేది ఇక్కడ తొలుత అందరం తెలుసుకోవాల్సిన విషయం.
ఇలా ఉద్యోగులకు జీతాలు కట్ చేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు దఢపుగా 1700 నుంచి 1800 కోట్లు మిగలొచ్చు. (ఇది సుమారు లెక్క మాత్రమే! 4,50,000 ఉద్యోగులకు సరాసరిన నెలకు 40,000 రూపాయలు తగ్గిస్తారు అనుకుంటేనే) ఈ సమయంలో ఈ డబ్బులు అత్యవసరం కూడా. కానీ ధనిక రాష్ట్రం తెలంగాణ ఇలా చేయడం ఇక్కడ విమర్శలకు తావు ఇస్తోంది.
ఉద్యోగులు ఏం చెబుతున్నారు...?
మిగులు బడ్జెట్ ఉన్న మన రాష్ట్రానికి ఇట్టి మొత్తం చాలా చిన్నది. దీన్ని సర్దుబాటు చేయడం పెద్ద సమస్య కానే కాదు. ఈమాత్రం డబ్బును ప్రభుత్వం కావాలనుకుంటే సర్దుబాటు చేసుకోలేదా అనేది వారి వాదన.
ఉద్యోగ సంఘాలను దెబ్బకొట్టడానికి కేసీఆర్ ఈ పని చేసాడనేది వారి వాదన. ఇప్పటికే ప్రజల్లోకి ఉద్యోగుల జీతాలు చాలా ఎక్కువ అనే భావనను బలంగా కేసీఆర్ తీసుకెళ్లారని, కాబట్టి ఇప్పుడు తమకు జీతాలు కట్ చేస్తే తాము ఇప్పుడు నోరెత్తి కూడా అడగలేమనేది వారి వాదన.
వాస్తవ పరిస్థితి ఏమిటి...?
ఇప్పుడు ఉద్యోగులు గనుక జీతాలకోసమని బయటకొచ్చిస్తో మాట్లాడితే... ప్రజలెవ్వరూ దానిని స్వాగతించరు. ఒక పక్క దేశం కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తుంటే... మీకు జీతాలు కట్ చేసారని బాధ పడుతూ రోడ్లెక్కుతారా అని వారి మీద తిరగబడటం ఖాయం.
వారు పోనీ ఇప్పడు ఉద్యమాలకు దేనికో దిగితే ప్రయోజనం శూన్యం. కారణం ప్రజా మద్దతు లేని ఉద్యమాలు నిలబడవు. తెలంగాణ సమాజం ప్రస్తుత పరిస్థితుల్లో హర్షించదు. ఉద్యోగులు వారిపట్ల ప్రజలకున్న కాస్తో కూస్తో గౌరవాన్ని కూడా కోల్పోతారు.
మరి ప్రభుత్వం ఏం చేసుంటే బాగుండేది...?
తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతమున్న విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఆర్ధిక వెసులుబాటు కల్పించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకోవడంలో ఎంత మాత్రము తప్పు లేదు.
ఇక్కడ రెండు ప్రశ్నలు ఇప్పుడు ఉద్భవిస్తున్నాయి. ఒకవేళ ప్రైవేట్ కప్[అన్యులు కూడా ఇలానే జీతాలు కట్ చేస్తాము అంటే... పరిస్థితి ఏమిటి? పోనీ ప్రభుత్వం చెప్పొచ్చు మేము చూసుకుంటాము ఏమి కాదు అని. కానీ, ఆ కంపెనీలు కూడా మ్మోసివేసే ఉన్నాయి. వారు కూడా ఉత్పత్తి లేకపోవడం వల్ల నష్టపోతూనే ఉన్నారు.
వారు బయటకు అనకపోయినా మాకో న్యాయం ప్రభుత్వానికో న్యాయమా అని వారు ఖచ్చితంగా అనుకొంటారు. కనీసం మనస్సులో అయినా అనుకోని తీరుతారు.
ఇక మరో అంశం ఏమిటంటే... ఈ కొరోనాపై యుద్ధంలో ముందుండి పోరాడుతుంది ప్రభుత్వ ఉద్యోగులే! పోలీసుల నుండి మొదలు డాక్టర్లు, మునిసిపల్ సిబ్బంది, రెవిన్యూ సిబ్బంది అందరూ ముందుండి ఈ సంగ్రామంలో సైనికులై కదం తొక్కుతున్నారు.
వారు ఇలా పని చేసినందుకు వారికి ఎక్కువ ఇవ్వకున్నా అవసరం లేదు. కానీ కనీసం వారి జీతాలైనా వారికి పూర్తిగా ఇస్తే బాగుండేది. ఇప్పుడు ఈ యుద్ధంలో వారు పాల్గొంటున్నప్పుడు, తమ కుటుంబాలను ఇంట్లో వదిలి మిగిలిన ప్రజల సుఖ సంతోషాల కోసం వారు వారి ప్రాణాలను పణంగాపెట్టి మరి పోరాడుతున్నారు.
ఇప్పుడు మిగిలిన రాష్ట్రాలు కూడా ఈ పద్దతిని పాటించాయి కదా అని అనిపించొచ్చు. కరెక్టే... కానీ వారు తెలంగాణలో మాదిరిగా కట్ చేయలేదు. ఐఏఎస్ స్థాయి అధికారులకు కట్ చేసిన, ఎమ్మెల్యేలకు కట్ చేసిన పెద్ద తేడా ఏమి ఉండదు. ఎందుకో వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు.
కేసీఆర్ బాటలో జగన్: ప్రభుత్వోద్యోగులకు రెండు విడతలుగా వేతనం
వారు కావాలనుకుంటే... సర్దుబాటు చేసుకోవడం పెద్ద విషయం కాదు. వారే గనుక అవసరం అనుకుంటే... బ్యాంకులు లోన్లివ్వడానికి క్యూలు కూడా కడతాయి. మహారాష్ట్రలో క్లాస్ 1, 2 ఉద్యోగులకు 50 శాతం కొత్త విధించారు. క్లాస్ 3 వారికి 25 శాతం కొత్త విధించారు. క్లాస్ 4 కి అసలు ఏవిధమైన కొత్త కూడా లేదు.
ఇలా గనుక ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారికి కోతలు విధిస్తే బాగుండేది. మిగిలిన రాష్ట్రాల్లో కూడా కోతలను విధించారు. కానీ ఇంత భారీ స్థాయిలో మాత్రం కాదు. ధనిక రాష్ట్రంలో ఇంత భారీ స్థాయిలో విధించడం గమనార్హం.
మహారాష్ట్ర మోడల్ తో పాటు ఆంధ్రప్రదేశ్ లోని జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం కూడా బాగుంది. జీతాన్ని రెండు విడతలుగా చెల్లిస్తామని, ఇప్పుడు ఒక విడతను ఇస్తామని చెప్పింది. ఉద్యోగులు కనీసం ఇలా అయినా ఉంటె బాగుండు అని కోరుకుంటున్నారు.
ఇప్పటికే ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు కొన్ని కంపెనీలు జీతాలు చెల్లించడం ఆలస్యమయింది. ఈ కరోనా వల్ల తాము కూడా నష్టపోయామని అని, వారు సైతం జీతాలను చెల్లించలేము, లేదా తక్కువ చెల్లిస్తాము అంటే... ఆర్థికంగా వారిపై అది పెద్ద భారమే అవుతుంది.
ఆర్థికమాంద్యం ప్రపంచాన్ని కబళించి వేస్తున్నవేళ ప్రైవేట్ కంపెనీలు ఇప్పటికే ఉద్యోగులను తొలిగిస్తున్నవేళ ఈ కరోనా బూచిని సాకుగా చూపెట్టి మరిన్ని ఉద్యోగాలను తొలిగించినా, ఉద్యోగుల జీతాలను కట్ చేసినా... అప్పుడు పరిస్థితి ఏమిటనేది ఇప్పుడు అందరి మెదళ్లలోనూ మెదులుతున్న ఒక ప్రశ్న.