యూనివర్శిటీ ఆఫ్ ఫార్మింగ్టన్... సిబ్బంది లేరు, అధ్యాపకులు లేరు, క్లాస్ రూమ్స్ లేవు. కేవలం చిన్న గదిలో వర్సిటీ నేమ్ బోర్డ్ పెట్టి కార్యకలాపాలు సాగిస్తోంది. ఇదంతా చదువుల కోసం కాదు..విదేశాల నుంచి వచ్చి వారికి ఇచ్చిన వీసా గడువు ముగిసినా నిబంధనలకు విరుద్దంగా తమ దేశంలో ఉంటున్న వారి పనిబట్టడానికి అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు పన్నిన వ్యూహం.
యూనివర్శిటీ ఆఫ్ ఫార్మింగ్టన్... సిబ్బంది లేరు, అధ్యాపకులు లేరు, క్లాస్ రూమ్స్ లేవు. కేవలం చిన్న గదిలో వర్సిటీ నేమ్ బోర్డ్ పెట్టి కార్యకలాపాలు సాగిస్తోంది. ఇదంతా చదువుల కోసం కాదు..విదేశాల నుంచి వచ్చి వారికి ఇచ్చిన వీసా గడువు ముగిసినా నిబంధనలకు విరుద్దంగా తమ దేశంలో ఉంటున్న వారి పనిబట్టడానికి అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు పన్నిన వ్యూహం.
చాలా దేశాల్లోని యువతకు అమెరికా అంటే ఒక కల.. డాలర్లలో వేతనాలు అందుకుని బాగా సంపాదించి జీవితంలో స్థిరత్వం సాధించాలన్నది కోరిక. వెంటనే ఏదో ఒక వీసా మీద అగ్రరాజ్యంలో కాలుమోపడం అక్కడి ఇమ్మిగ్రేషన్ నిబంధనలు తెలియక కటకటాల పాలవ్వడం తెలిసిందే.
undefined
అయితే కొందరు కేటుగాళ్లు.. ఇలాంటి వారిని టార్గెట్‌గా చేసుకుని రెండు చేతుల సంపాదిస్తున్నారు. వీసా స్టేటస్ మెయింటెన్ చేయడానికి వీలుగా ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ విద్యార్థులుగా నమ్మించడానికి నకిలీ ధ్రువపత్రాలు సృష్టిస్తున్నారు.
తద్వారా వీరు వీసా కాలపరిమితి ముగిసినా ఎడ్యుకేషన్ వీసాపై ఉన్నట్లు ప్రభుత్వాన్ని నమ్మిస్తారు. వీటిపై ఎప్పటి నుంచో నిఘా పెట్టిన హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు వ్యూహాత్మకంగా వేసిన పథకమే ‘‘యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్’’. 2015లో ప్రారంభించిన ఈ ఆపరేషన్‌కు అధికారులు పెట్టిన పేరు ‘‘పేపర్ చేజ్’’.
ఫిబ్రవరి 2017లో హోంల్యాండ్ సెక్యూరిటీ ఏజెంట్లు విశ్వవిద్యాలయ అధికారులలాగా నటిస్తున్నారు. ఈ వర్సిటీకి ఒక వెబ్‌సైట్, జ్ఞానం, పని అని అర్ధం వచ్చేలా లాటిన్ భాషలో ఒక స్లోగన్ ఇచ్చారు. ఫార్మింగ్టన్ హిల్స్‌లోని ఉత్తర వాయువ్య ప్రాంతంలోని ఒక వాణిజ్య భవనంలో ఫార్మింగ్టన్ యూనివర్సిటీ కార్యాలయాన్ని నెలకొల్పారు.
విదేశీ విద్యార్ధులను ఆకర్షించేందుకు వీలుగా ‘‘పే టూ స్టే’’ అన్న ప్రణాళికను అధికారులు ఉపయోగించారు. దీని కింద విదేశీ విద్యార్థులు అమెరికాలో ఉండేందుకు వీలుగా రెగ్యులర్ విధానంలో విద్యను అభ్యసిస్తున్నట్లుగా నకిలీ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చారు.
ఇది నిజమేనని నమ్మిన కొందరు ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లు విద్యార్థులకు నకిలీ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడానికి సాయపడ్డారు. ఫెడరల్ ఉద్యోగులు యజమానులుగా ఉండటంతో రిక్రూటర్లు సైతం ఇది నకిలీ విశ్వ విద్యాలయంగా పోల్చుకోలేకపోయారు.
నాలుగేళ్ల కాలంలో చదువు పేరుతో ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్న వారిని గుర్తించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు సుమారు 600 మంది విదేశీ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఎక్కువశాతం భారతీయులే.. అందులోనూ తెలుగువారే అధికం.
ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ నకిలీ ధ్రువపత్రాల వ్యవహారంలో ఎనిమిది తెలుగువారు కీలక నిందితులని హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు నిర్థారించారు. మరోవైపు నకిలీ పత్రాలతో సుమారు 5 వేల మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా నివసిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.
ప్రధానంగా హ్యూస్టన్, చార్లెట్, నార్త్ కరోలినా, అట్లాంటా, జార్జియా, టంపా, ఫ్లోరిడా, సెయింట్ లూయిస్, మిస్సోరిలలోనే విదేశీ విద్యార్థులు ఎక్కువగా నివసిస్తున్నారు. ఈ సమాచారంతో రాబోయే రోజుల్లో మరింత మందిని అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
చట్ట ప్రకారం నియమ నిబంధనలు అనుసరించే వారికి అమెరికాలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని, కానీ ఒకవైపు ఉద్యోగం చేస్తూ హెచ్1బీకి దరఖాస్తు చేసి స్టేటస్ మెయిన్‌టైన్ చేయడానికి విద్యార్థులుగా చెప్పుకుంటున్న వారంతా సమస్యలు ఎదుర్కోక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.
అమెరికా ఫేక్ వర్సిటీ వలలో తెలుగు విద్యార్థులు: మోసగాళ్లలో 8 మంది తెలుగువాళ్లు వీరే
ఫేక్ యూనివర్సిటీ కలకలం: తెలుగువారి కోసం రంగంలోకి తానా