తోటి విద్యార్థిని మీద గ్యాంగ్ రేప్.. ముగ్గురు పదో తరగతి విద్యార్తులు అరెస్ట్...

By SumaBala Bukka  |  First Published Jul 9, 2022, 9:39 AM IST

పోలీసులు ముగ్గురు విద్యార్థులపై లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (పోక్సో) కింద కేసు నమోదు చేసి అబ్జర్వేషన్ హోమ్‌కు తరలించారు.
 


చెన్నై : తమిళనాడులో దారుణం వెలుగు చూసింది. తమతో పాటు చదువుకుంటున్న విద్యార్థిని మీద ముగ్గురు అబ్బాయిలు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.  సహవిద్యార్థి అయిన పదిహేనేళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఈ ముగ్గురు 10వ తరగతి విద్యార్థినులను తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు.

గ్యాంగ్ రేప్ చేయడమే కాకుండా ఈ లైంగిక వేధింపుల సమయంలో వీడియో తీసి.. మిగతా వారికి షేర్ చేశారు ఈ ముగ్గురు. మరో అబ్బాయిని .. ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడి, వేధిస్తున్నందుకు అరెస్టు చేశారు. తిట్టకుడిలోని ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీమతి కిరుబా మాట్లాడుతూ, "కడలూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన దారుణమైనది. ఈ నేరం ఆరోపించిన లో మైనర్‌లందరూ నేరస్థులే. ఆమెను వారు మొదట.. విద్యార్థిని తన ప్రియుడితో ఉన్న ఫోటోతో బ్లాక్‌మెయిల్ చేసారు. అమ్మాయి మీద సామూహిక అత్యాచారానికి పాల్పడిని ఓ అబ్బాయి ఇంటికి రావాలని బెదిరించారు. అక్కడికి వచ్చాక అఘాయిత్యానికి పాల్పడ్డారు’. అని చెప్పారు. 

Latest Videos

బాలిక ఇటీవల తన బాయ్ ఫ్రెండ్, మాజీ సీనియర్ విద్యార్థి  పుట్టినరోజు వేడుకల కోసం అతడి ఇంటికి వెళ్లిందని పోలీసులు తెలిపారు. ముగ్గురు నిందితుల్లో ఒకరు.. ఆ సమయంలో అబ్బాయి, అమ్మాయి కలుసున్న ఫొటోను సంపాదించాడు. దాన్ని చూపిస్తూ ఆమె మీద బ్లాక్ మెయిల్ కు దిగాడు. దానిని ఆమె తల్లిదండ్రులకు చూపిస్తానని చెప్పి బెదిరించాడు. స్కూల్ వెనుక ఉన్న తన ఇంటికి రమ్మని కోరాడు. ఈ నెల మొదటి తేదీన ఆమె లంచ్ బ్రేక్ టైంలో అక్కడికి వెళ్లింది. అప్పటికే అక్కడ కాపు కాసిన ముగ్గురు అబ్బాయిలు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ సమయంలో ఇందులో ఒకరు దీన్ని మొత్తం వీడియో తీశారు. ఆ తర్వాత ఈ వీడియోను మిగతా విద్యార్థులతో పంచుకున్నారు.

పదమూడేళ్ల బాలికపై కన్నేసిన సవతి తండ్రి.. ఇంట్లో ఎవరూ లేనప్పుడు అఘాయిత్యం..

వీడియో షేర్ చేసిన విషయం తెలిసిన తరువాత బాలిక నోరు విప్పింది. తన తల్లికి జరిగినదంతా చెప్పింది. దీంతో ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింద.  పోలీసులు రంగంలోకి దిగారు. అత్యాచారానికి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోక్సో చట్టం (లైంగిక నేరాల నుండి పిల్లలకు రక్షణ) కూడా వీరి మీద మోపారు. నిందితులు మైనర్లు కావడంతో వీరిని అబ్జర్వేషన్ హోమ్‌కు పంపారు.

కడలూర్ పోలీసు సూపరింటెండెంట్, ఎస్ శక్తి గణేశన్ మాట్లాడుతూ, "ముగ్గురు అబ్బాయిలు మాత్రమే ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. అయితే మరో అబ్బాయి ఆమెను వెంబడించినందుకు కేసు నమోదు చేశారు. అతను ఆమెతో ఇంతకు ముందు రిలేషన్ లో ఉన్నాడు" అని తెలిపారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం పంపించామని అన్నారు. 

click me!