కొన్ని బాధ్యతలు ఉన్నాయి.. వాటిని పూర్తి చేసుకుని జైలు అధికారుల ముందు లొంగిపోయేందుకు 6 నెలల సమయం కోరుతూ బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో దోషులు ( Bilkis Bano gang rape case convicts) దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు (supreme court) తోసిపుచ్చింది. ఆదివారంలోగా దోషులందరూ జైలు అధికారులకు లొంగిపోవాల్సిందే అని స్పష్టం చేసింది.
Bilkis Bano gang rape case : బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో దోషులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. జైలు అధికారుల ముందు లొంగిపోవడానికి అదనపు సమయం కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. గతంలో విధించిన గడువు ప్రకారమే జనవరి 21లోగా 11 మంది దోషులు జైలు అధికారుల ముందు లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని ‘లైవ్ లా’ పేర్కొంది.
సర్పంచ్ లకు చెల్లించాల్సిన బిల్లులను బీఆర్ఎస్ పక్కదారి పట్టించింది - మంత్రి సీతక్క
లొంగిపోవడానికి గడువు పెంచాలని దోషులు చెప్పిన కారణాల్లో వాస్తవికత కనిపించడం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. లొంగిపోవాలని, తిరిగి జైలుకు వెళ్లాలని కోరుతూ దరఖాస్తుదారులు చెబుతున్న కారణాల్లో వాస్తవం లేదని, ఆ కారణాలు తమ ఆదేశాలను పాటించకుండా అడ్డుకోలేవని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
BREAKING: Supreme Court REFUSES to grant any additional time to any of the convicts in the Bilkis Bano case to surrender. Supreme Court says that there is no merit in the applications filed. All applications dismissed. All 11 convicts will have to surrender by January 21. pic.twitter.com/AVILDZmisC
— Law Today (@LawTodayLive)జైలు అధికారుల ముందు లొంగిపోవడానికి గడువును పొడిగించాలని కోరుతూ ముగ్గురు దోషులు వివిధ కారణాలను పేర్కొంటూ దరఖాస్తులు దాఖలు చేశారు. దీనిని విచారించిన ధర్మాసనం.. ఈ ఆదేశాలు జారీ చేసింది. దోషుల్లో ఒకరైన గోవింద్ భాయ్ నాయి తన పిటిషన్ లో 88 ఏళ్ల తన తండ్రిని, 75 ఏళ్ల తల్లిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తనపైనే ఉందని పేర్కొన్నారు. తన తండ్రి వృద్ధుడు అని, ఆయన ఆస్తమాతో బాధపడుతున్నారని, ఇటీవల యాంజియోగ్రఫీతో సహా శస్త్రచికిత్స చేయించుకున్నారని తెలిపారు. అలాగే హేమోరాయిడ్స్ చికిత్స కోసం మరో ఆపరేషన్ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. తన సత్ప్రవర్తనను తెలియజేస్తూ.. విడుదల సమయంలో తాను చట్టాన్ని ఏ విధంగానూ ఉల్లంఘించలేదని, ఉపశమన క్రమాన్ని అక్షరాలా పాటించాను అని నాయి తన దరఖాస్తులో పేర్కొన్నారు.
అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట: మోడీ పాటిస్తున్న కఠిన నియమాలు...
మరో దోషి రమేష్ రూపాభాయ్ చందనా.. తన కుమారుడి పెళ్లి ఉందని, కాబట్టి లొంగి పోయేందుకు మరో ఆరు వారాల గడువు కోవాలని కోరారు. మూడో దోషి మితేష్ చిమన్లాల్ భట్ కూడా ఆరు వారాల పొడిగింపును అభ్యర్థించాడు. తన పంట శీతాకాల కోతకు సిద్ధంగా ఉందని, లొంగిపోయే ముందు ఆ పనిని పూర్తి చేయాలనుకుంటున్నానని పేర్కొన్నారు.
వైసిపిలో సీట్ల లొల్లి ... టికెట్ ఇవ్వకున్నా పోటీ చేస్తానంటున్న సిట్టింగ్ ఎమ్మెల్యే
అయితే వారి అభ్యర్థనను కోర్టు నిరాకరించిన నేపథ్యంలో దోషులందరూ ఆదివారం జైలు అధికారుల ఎదుట లొంగిపోవాల్సి ఉంది. కాగా.. దోషులంతా ఆదివారం లొంగిపోయినప్పటికీ.. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో విచారణ జరిగినందున వీరంతా మహారాష్ట్ర ప్రభుత్వం ఎదుట మళ్లీ ఉపశమనం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.