భారత ప్రధాన ఎన్నికల కమిషనర్, రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లను నియామించే కొత్త చట్టంపై (new law on appointment of CEC, ECs) స్టే విధించేందుకు సుప్రీంకోర్టు (supreme court) నిరాకరించింది. కానీ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి (central government) నోటీసులు జారీ చేసింది.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్లను (ఈసీ) ఎంపిక చేసే ప్యానెల్ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించిన కొత్త చట్టంపై మధ్యంతర స్టే విధించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ చట్టంపై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించినప్పటికీ.. ఈ పిటిషన్లను పరిశీలించేందుకు అంగీకరించింది.కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.
కాంగ్రెస్ పార్టీ అయోధ్య ప్రారంభోత్సవాన్ని తిరస్కరించడానికి కారణం ఏంటి?
undefined
ఈ చట్టాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ నేత జయ ఠాకూర్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరపు న్యాయవాది వికాస్ సింగ్ స్టే కోసం పట్టుబట్టడంతో 'దయచేసి ఇలాంటి చట్టంపై స్టే ఇవ్వలేం' అని ధర్మాసనం తెలిపింది. కొత్త చట్టం అధికారాల విభజన భావనకు వ్యతిరేకమని జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనానికి ఆయన తెలిపారు. ప్రధాని, లోక్ సభలో ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ సలహా మేరకు సీఈసీ, ఈసీలను నియమించాలని 2023 మార్చి 2న రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఆయన ప్రస్తావించారు.
అయోధ్యలో యాత్రికుల కోసం.. 22 దేశీయ, 6 విదేశీ భాషల్లో సైన్ బోర్డులు..
అయితే అవతలి పక్షం వాదనలు వినకుండా తాము చేయలేమని వికాస్ సింగ్ కు కోర్టు తెలిపింది. దాని కోసం కేంద్రానికి నోటీసులు జారీ చేస్తామని తెలిపింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్లను (ఈసీ) ఎన్నుకునే అధికారం ఉన్న ప్యానెల్ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)ని తొలగించడంపై రాజకీయ దుమారం రేగుతున్న నేపథ్యంలో ఠాకూర్ సహా పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి.
ఎన్నికల సంఘంలో నియామకాలు చేపట్టే అధికారం కేంద్ర ప్రభుత్వానికి కల్పించే కొత్త చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది గోపాల్ సింగ్ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీఈసీ, ఈసీ నియామకం కోసం తటస్థ, స్వతంత్ర సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేస్తూ స్వతంత్ర, పారదర్శక ఎంపిక విధానాన్ని అమలు చేసేలా సుప్రీంకోర్టును ఆదేశించాలని సింగ్ పిటిషన్ లో కోరారు.
ఇది ఆర్టిసి వారి పాట ..! పందెంకోడిని వేలం వేస్తున్న టీఎస్ ఆర్టిసి
కాగా.. కొత్త చట్టం ప్రకారం.. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్లను ప్రధాన మంత్రి చైర్మన్ గా ఉన్న సెలక్షన్ కమిటీ సిఫార్సు ఆధారంగా రాష్ట్రపతి నియమిస్తారు ఈ సెలక్షన్ కమిటీలో ప్రధాన మంత్రి చైర్మన్ గా ప్రధాన మంత్రి నామినేట్ చేసిన కేంద్ర కేబినేట్ మంత్రి తో పాటు లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు సభ్యులుగా ఉంటారు. అయితే సీజేఐని ఈ సెలక్షన్ కమిటీ నుంచి తప్పించడం ద్వారా మోడీ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.