నేపాల్ లో అద్భుతం.. 11వేల అడుగుల విస్తీర్ణంలో సీతారాముల కల్యాణ వేడుక చిత్రం..

By SumaBala Bukka  |  First Published Dec 23, 2023, 2:16 PM IST

త్రేతా యుగం నాటి సీతారాముల కల్యాణవేడుకను గుర్తుచేసేలా 11,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అతిపెద్ద కళాకృతిని రూపొందించారు కళాకారులు. దీనికోసం మొత్తం101 క్వింటాళ్ల 11 రకాల ధాన్యాలను వాడారు.


నేపాల్‌ : నేపాల్, భారతదేశాలకు చెందిన పది మంది నైపుణ్యం కలిగిన కళాకారుల బృందం నేపాల్‌లో అద్భుతాన్ని ఆవిష్కరించింది. నేపాల్ లోని జనక్‌పూర్‌లో భగవాన్ సీతారాముల వివాహావేడుకను అద్భుతైన చిత్ర కళాఖండంగా రూపొందించారు. దీని ద్వారా ప్రపంచ రికార్డును నెలకొల్పారు. త్రేతా యుగంలో జరిగిన సీతారాముల దివ్య వివాహ వేడుకను గుర్తుచేసే ఈ గొప్ప కళాఖండం ఇప్పుడు రంగభూమి మైదానంలో 11,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.

వివిధ రకాల చిరు ధాన్యాలను ఉపయోగించి120 అడుగుల పొడవు. 91.5 అడుగుల వెడల్పుతో ఈ భారీ పోర్ట్రెయిట్ ను తయారు చేశారు. ఈ అపురూపమైన, అత్యద్భుతమైన పోర్ట్రైట్ రూపొందించానికి 101 క్వింటాళ్ల 11 విభిన్న రకాల ధాన్యాలను ఉపయోగించారు. సీతారామ కల్యాణ వేడుకను ఓ వైపు నుంచి జనకమహారాజు వీక్షిస్తుండగా, మరోవైపు విశ్వామిత్రుడు ఉండేటా రూపొందించడం ఈ కళాకారుల నిబద్ధతను చాటి చెబుతోంది. 

Latest Videos

ఆపరేషన్ చేస్తుంటే కదిలిందని రోగిని పదే పదే కొట్టిన డాక్టర్.. వీడియో వైరల్

భారతదేశానికి చెందిన ప్రముఖ కళాకారుడు సతీష్ గుజార్, ఈ కళాత్మక వెంచర్ ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు, 'బిబా పంచమి సందర్భంగా ఈ పోట్రేయిట్ ను సృష్టించాం. సీతారాముల వివాహవేదికగా ఇది ప్రసిద్ధి అని తెలిపారు. ఈ పోర్ట్రెయిట్ ప్రపంచ రికార్డు సాధించింది. 

సతీష్ గుజార్ ఇలా ధాన్యాలతో అతిపెద్ద చిత్రాలను రూపొందించడం ఇది మొదటిసారి కాదు. గత సంవత్సరం, అయోధ్యలో 10,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో సీతారాముల ఇలాంటి చిత్రపటాన్ని రూపొందించాడు. ముఖ్యంగా, ఆర్ట్‌వర్క్‌లో ఎలాంటి కృత్రిమ రంగులు ఉపయోగించలేదు. ఇది కళాకారుని ప్రామాణికత, సాంప్రదాయ నైపుణ్యానికి సంబంధించిన నిబద్ధతను నొక్కి చెబుతుంది.

అనేక వారాల పాటు శ్రమించి పోర్ట్రెయిట్‌ను పూర్తి చేశారు. ఈ విశిష్టమైన కళాఖండాన్ని చూడడానికి ఇప్పుడు సందర్శకులకు అనుమతించారు. నేపాల్, భారత్ ల భాగస్వామ్య సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనంగా నిలిచే చిత్రపటాన్ని చూసి ఆశ్చర్యపోవడానికి వేలాది మంది రంగభూమి మైదానానికి తరలివచ్చారు.

బిర్‌గంజ్‌లోని భారత కాన్సులేట్‌ కాన్సుల్ జనరల్ దేవి సహాయ్ మీనా, కళాత్మక సహకారాన్ని మెచ్చుకుంటూ, "సంస్కృతి విషయానికి వస్తే, నేపాల్, భారత్ లకు అనేక సారూప్యతలు ఉంటాయి. ఈ తరహా కళాత్మక ప్రయత్నాలు రెండు దేశాల మధ్య సాంస్కృతిక, మతపరమైన సంబంధాలను బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయి" అన్నారు.

బిబా పంచమి పండుగలో అత్యంత వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. దీనికోసం దాదాపు 5,000 సంవత్సరాల క్రితం జరిగిన సీతా దేవి, భగవాన్ రామ్ వివాహ వార్షికోత్సవాన్ని గుర్తు చేస్తుంది. హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మార్గ శుక్ల పంచమి రోజున, జనక్‌పూర్ ధామ్‌లోని జానకి మందిర్‌లో ఏడు రోజుల పాటు జరిగే ఈ వేడుక నేపాల్, భారత్ ల నుండి భక్తులను ఆకర్షిస్తుంది.

 

In a groundbreaking artistic feat, ten skilled artists from Nepal and India have unveiled a world-record-breaking portrait of Bhagwan Ram and Sita in Janakpur, Nepal.

Spanning 11,000 square feet and crafted from 101 quintals of 11 grain varieties, this monumental masterpiece… pic.twitter.com/RZ1cjNXMyd

— Megh Updates 🚨™ (@MeghUpdates)
click me!