‘‘ఆక్సిజన్, వ్యాక్సిన్లు, బెడ్లు, రెమ్‌డిసివర్’’.. అన్నింటికీ కొరత, ముంచుకొస్తున్న ముప్పు

By Siva Kodati  |  First Published Apr 14, 2021, 7:47 PM IST

కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. దేశంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ జనం పెద్ద మొత్తంలో కరోనా బారినపడుతున్నారు. దీంతో మళ్లీ ఆసుపత్రుల్లో బెడ్స్ కొరత నెలకొంది.


కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. దేశంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ జనం పెద్ద మొత్తంలో కరోనా బారినపడుతున్నారు. దీంతో మళ్లీ ఆసుపత్రుల్లో బెడ్స్ కొరత నెలకొంది.

హైదరాబాద్‌లో పరిస్ధితి మరీ దారుణంగా వుంది. ఓ నెలక్రితం వరకు కార్పోరేట్ ఆసుపత్రులు.. పరిస్ధితులను దృష్టిలో వుంచుకుని మూడు నుంచి ఐదు రోజుల్లో బెడ్స్ కేటాయిస్తూ వచ్చాయి. రెండు వారాలుగా తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో పరిస్ధితి పూర్తిగా మారిపోయింది.

Latest Videos

undefined

ముఖ్యంగా ఆక్సిజన్, ఐసీయూ బెడ్స్‌కు తీవ్ర కొరత నెలకొంది. దీంతో ఆసుపత్రులకు వచ్చే కరోనా రోగులకు బెడ్స్ లేవని చెప్పి పంపేస్తున్నాయి ఆసుపత్రులు. ఆరేడు కార్పోరేట్ ఆసుపత్రుల చుట్టూ తిరిగి గత్యంతరం లేని పరిస్ధితుల్లో రోగుల్ని గవర్నమెంట్ ఆసుపత్రులకు తీసుకెళ్తున్నారు బంధువులు.

ఆసుపత్రులకు వెళితే.. బెడ్ దొరకడం లేదు కనుక ఇంటి వద్దే తమ వారికి చికిత్స అందించాలని భావిస్తున్నా.. ఇబ్బందులు తప్పడం లేదు. కరోనా బాధితుల్లో చాలా మందికి శ్వాస సంబంధమైన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

దీంతో వారికి వెంటనే ఆక్సిజన్ అందించాల్సి వుంటుంది. దీంతో కొంత మంది ఇంట్లో ఆక్సిజన్ సిలిండర్ కొని పెట్టుకుంటున్నారు. అయితే ఆక్సిజన్ కొరత వల్ల ఇబ్బందులు తప్పడం లేదు. ఆక్సిజన్‌కు ఒక్కసారిగా డిమాండ్ పెరగడం వల్ల ఒక్కసారిగా సిలిండర్ల రీఫిల్లింగ్‌కు కూడా ఒకట్రెండు రోజులు పడుతోంది.

Also Read:వైద్యం అందక ఆసుపత్రి గేటు వద్దే కరోనా రోగి మృతి: మంత్రిని నిలదీసిన యువతి

దీంతో ఇంటి వద్దే ఆక్సిజన్ సిలిండర్ వుంచుకున్న వారికి కూడా టెన్షన్ తప్పడం లేదు. కరోనాకు మందు లేదు.. కానీ కరోనా రోగుల చికిత్సలో రెమ్‌డెసివర్ ఇంజెక్షన్ వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. దీంతో రెమ్‌డెసివర్‌కు డిమాండ్ నెలకొంది.

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దమొత్తంలో రెమ్‌డెసివర్ ఇంజెక్షన్ కొనుగోలు చేస్తున్నాయి. ఫలితంగా ఆ ఇంజెక్షన్ కొరత నెలకొంది. మరోవైపు డిమాండ్‌ను క్యాష్ చేసుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. రెమ్‌డెసివర్‌ను బ్లాక్ మార్కెట్‌కు తరలించి వేలకు వేలు దోచుకుంటున్నారు.

మరోవైపు కరోనా చికిత్సలో వుపయోగిస్తున్న ఫెవిపిరావిర్ ‌ట్యాబ్లెట్లు కూడా మార్కెట్‌లో పూర్తిగా కనుమరుగైపోయాయి. కరోనాకు మందు లేకపోయినా వైరస్ ప్రభావాన్ని అడ్డుకోవడంలో టీకాలు ఉపయోగపడుతున్నాయి. ఈ క్రమంలోనే వ్యాక్సినేషన్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  ప్రాధాన్యతను ఇస్తున్నాయి.

టీకా ఉత్సవ్ లక్ష్యం కూడా ఇదే. కానీ వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం, ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రాలు కోరుతున్న దానిలో పావు వంతు కూడా ఇవ్వలేకపోతోంది కేంద్రం. మనదేశంలో ప్రస్తుతం కోవిషీల్డ్, కొవాగ్జిన్‌లకు తోడు స్పుత్నిక్ వి అందుబాటులోకి వచ్చాయి.

అయితే స్పుత్నిక్ వి వ్యాక్సినేషన్  ఇంకా ప్రారంభం కాలేదు. ఇక కోవిషీల్డ్ వల్ల దుష్ప్రభావాలు ఎక్కువగా వున్నాయంటూ ఆరంభంలో దానిని తీసుకోవడానికి జనం భయపడ్డారు. ఇక కొవాగ్జిన్‌ విషయానికి వస్తే మొదటి నుంచి కొరత వుంది.

అయితే ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతుండటంతో కోవిషీల్డ్ అయినా ఇవ్వాలని జనం అడుగుతున్నారు. కానీ స్టాక్ లేదంటూ వ్యాక్సిన్ కోసం వచ్చిన వారిని పొమ్మంటున్నారు వైద్య సిబ్బంది.  

click me!