103 మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. దేశ వ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాల గురించి ఆయన ప్రస్తావించారు.
న్యూఢిల్లీ: విపత్తుల వల్ల కొంతకాలంగా ఆందోళన నెలకొందని మన్ కీ బాత్ లో నరేంద్ర మోడీ చెప్పారు. మన్‌కీ బాత్ బా 103 ప్రోగ్రాంలో ఆదివారంనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. యమునా వరదల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు.దేశంలోని ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాల గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు. పలు కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడ్డాయన్నారు.
ఉత్తర్‌ప్రదేశ్ లో రికార్డు స్థాయిలో మొక్కలు నాటిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.యూపీలో ఒకే రోజు 30 కోట్లకుపైగా మొక్కలు నాటారన్నారు.శ్రావణ మాసం పండుగల సీజన్ కొనసాగుతుందన్నారు. శ్రావణ మాసంలో పచ్చదనం, ఉల్లాసవంతంగా ఉంటుందని చెప్పారు.
పర్యాటక స్థలాలకు ప్రపంచం నలుమూలల నుండి వస్తున్నారని ప్రధాని మోడీ వివరించారు .కాలిఫోర్నియా నుండి అమర్ నాథ్ కు ఇద్దరు యాత్రికులు వచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ఇటీవల ఫ్రాన్స్ లో వందేళ్ల మహిళా యోగా గురువును కలిసినట్టుగా ప్రధాని మోడీ చెప్పారు. ఆమె 40 ఏళ్లుగా యోగా చేస్తున్నారని మోడీ గుర్తు చేశారు.
ఆమె ఆరోగ్యం, దీర్ఘాయువుకు యోగా ఉపకరించిందని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు.
అతి పురాతన కళా ఖండాలను అమెరికా భారత్ కు తిరిగి ఇచ్చిందన్నారు. అమెరికా వందకు పైగా కళాఖండాలు భారత్ కు తిరిగి ఇచ్చిందని ఆయన వివరించారు.దాదాపు 250 నుండి 2500 ఏళ్లనాటి కళాఖండాలు తిరిగి ఇచ్చిన విషయాన్ని ఆయన తెలిపారు.దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాఖండాలు తిరిగి ఇచ్చారన్నారు.
2016, 2021 లో తాను అమెరికా సందర్శించినప్పుడు కూడ కళాఖండాలు ఇచ్చారని మోడీ తెలిపారు.కళాఖండాలు ఇచ్చిన
అమెరికా ప్రభుత్వానికి మోడీ ధన్యవాదాలు చెప్పారు.12 వేల కోట్లకు పైగా విలువైన 10 లక్షల కిలోల డ్రగ్స్ ను నాశనం చేసినట్టుగా మోడీ చెప్పారు. మాదక ద్రవ్యాల వినియోగానికి జరుగుతున్న ప్రచారంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడం ప్రోత్సాహకరంగా ఉందని మోడీ తెలిపారు.