బ్రెజిల్ టూరిస్టుపై గ్యాంగ్ రేప్ ఘటనను సుమోటుగా స్వీకరించిన జార్ఖండ్ హైకోర్టు

By Mahesh K  |  First Published Mar 4, 2024, 8:12 PM IST

బ్రెజిల్ టూరిస్టుపై జార్ఖండ్‌లో ఏడుగురు దుండగులు గ్యాంగ్ రేప్‌నకు పాల్పడినట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ఆధారం చేసుకుని జార్ఖండ్ హైకోర్టు సుమోటుగా స్వీకరించి విచారణ ప్రారంభించింది.
 


Jharkhand: ఓ బ్రెజిలియన్ టూరిస్టుపై జార్ఖండ్‌లో గ్యాంగ్ రేప్ జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ఆధారం చేసుకుని జార్ఖండ్ హైకోర్టు సుమోటుగా విచారణ చేపట్టింది. ఏడుగురు దుండగులు బ్రెజిలియన్ టూరిస్టుపై దుంకా జిల్లాలో సామూహిలక లైంగిక దాడికి పాల్పడినట్టు వార్తలు వచ్చాయి.

చీఫ్ జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, న్యాయమూర్తి నవనీత్ కుమార్‌ల ధర్మాసనం ఈ ఘటనను విచారించింది. ఈ ఘటనపై సమాధానం ఇవ్వాలని డీజీపీ, ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది.

Latest Videos

Also Read: KA Paul: బాబు మోహన్ సంచలన నిర్ణయం.. కేఏ పాల్ పార్టీలో చేరిక

ఈ ఘటనకు సంబంధించిన పలు వార్తా నివేదికలను జార్ఖండ్ హైకోర్టు అడ్వకేట్ల అసోషియేషన్ అధ్యక్షుడు రీతు కుమార్ సోమవారం ఉదయం కోర్టు ముందు ఉంచారు. ఈ వార్తలను పరిశీలించిన తర్వాత ఘటనను సుమోటుగా స్వీకరించి విచారించాలని కోర్టు నిర్ణయానికి వచ్చింది. విదేశీ మహిళలపై నేరాలు అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను దిగజార్చుతాయని కోర్టు పేర్కొంది. అది పర్యాటకంపైనా ప్రభావం చూపుతుందని వివరంచింది.

ఈ ఘటన మార్చి 1వ తేదీన చోటుచేసుకుంది. బ్రెజిలియన్ మహిళ, తన భర్తతో కలిసి మోటర్ బైక్ టూర్‌లో ఉన్నారు.ఆ రోజు రాత్రి కోసం దుంకా జిల్లాలో ఆగారు. ఆ తర్వాత ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్టు చేసింది. తాను ఎదుర్కొన్న దారుణాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో వివరించింది. ఏడుగురు దుండగులు తనను రేప్ చేశారని పేర్కొంది. తన భర్తపై దాడి చేశారని వివరించింది. ఈ ఘటన అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఈ ఏడుగురిలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన ముగ్గురి కోసం గాలింపు జరుగుతున్నది.

click me!