దారుణం.. ఉన్నావ్‌లో బర్త్‌డే పార్టీకి పిలిచి.. డ్యాన్సర్ పై సామూహిక అత్యాచారం..

By SumaBala Bukka  |  First Published Feb 17, 2023, 9:06 AM IST

ఉన్నావ్ లో గ్యాంగ్ రేప్ బాధితురాలు ప్రాణాలతో బయటపడిన తరువాత ఆమె మొదట జజ్మౌ పోలీసులను ఆశ్రయించిందని, అయితే వారు దీనిమీద ఎటువంటి చర్య తీసుకోలేదని ఆరోపించారు.


ఉన్నావో: ప్రాపర్టీ డీలర్ పుట్టినరోజు వేడుకకు పిలిచిన ఓ డ్యాన్సర్ మీద ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో జరిగింది. నిందితులందరూ పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించామని ఓ అధికారి తెలిపారు. ప్రాణాలతో బయటపడిన వ్యక్తి దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ప్రకారం, దీపక్ నగర్‌లో జరిగిన పార్టీలో తన ముగ్గురు డ్యాన్సర్ల బృందాన్ని రూ. 6,000కు మాట్లాడుకున్నారు.

ఆ పార్టీ అయిపోయిన తరువాత ఈవెంట్ నుండి బయలుదేరుతుండగా, మత్తులో ఉన్న ఆరుగురు వ్యక్తులు ఆమెను కారులో కిడ్నాప్ చేసి సమీపంలోని అడవిలోకి లాక్కెళ్లారు. అక్కడ ఆమెపై అత్యాచారం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. అయితే, వీరి బారినుంచి ప్రాణాలతో బయటపడిన ఆమె మొదట జాజ్మావు పోలీసులను ఆశ్రయించింది. వారికి ఫిర్యాదు చేసింది. కానీ, వారు దీనిమీద ఎటువంటి చర్య తీసుకోలేదని ఆరోపించారు.

Latest Videos

తర్వాత, ఆమె ఉన్నావ్ సదర్‌లోని కొత్వాలి పోలీసులను ఆశ్రయించింది. అక్కడ వారిమీద ఫిర్యాదు చేయడంతో ఆ తర్వాత నిందితులపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 376 (రేప్) కింద కేసు నమోదు చేశారు. పోలీసు సూపరింటెండెంట్ (ఉన్నావ్), సిద్ధార్థ్ మీనా మాట్లాడుతూ, బాధితురాలి మీద అత్యాచారం జరిగిందన్న ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకుంటున్నామని.. ఆమెకు వైద్య పరీక్షలు చేయించినట్లు తెలిపారు. నిందితుడిని పట్టుకోవడానికి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించామని తెలిపారు. 

ఉన్నావో రేప్ కేసు: దోషి కుల్దీప్ సెంగార్‌కు ఢిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు

ఇదిలా ఉండగా, తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ లో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. వరంగల్ జిల్లా మిల్స్ కాలనీలో  మైనర్ బాలికపై తండ్రి అత్యాచారానికి ఒడిగట్టాడు. 16 ఏళ్ల కుమార్తె మీద అత్యాచారానికి పాల్పడి, ఆమెను గర్భవతిని చేశాడో కామాంధుడైన తండ్రి. ఆ కీచక తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. మైనర్‌ బాలికకు కడుపునొప్పి రావడంతో తల్లి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యలు గర్బవతి అని చెప్పడంతో..  ఘటన వెలుగులోకి వచ్చింది.

మిల్స్ కాలనీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు గత నెల రోజులుగా మైనర్‌ అయిన కూతురు మీద పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకున్న తల్లి తన బిడ్డను గట్టిగా ప్రశ్నించగా ఆమ అసలు విషయం తెలిపింది.తన తండ్రి మత్తులో ఉన్నప్పుడు  తనను చాలాసార్లు లైంగికంగా వేధించాడని వెల్లడించింది.

జమ్మూ కాశ్మీర్‌లోని కత్రాలో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 3.6 తీవ్రత నమోదు..

ఈ లైంగిక దాడి గురించి ఎవరికైనా చెబితే.. మీ అమ్మను చంపేస్తానని బెదిరించాడని, భయపడి ఎవ్వరికీ చెప్పలేదని ఆమె పేర్కొంది. దీంతో వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అతని మీద  ఐపీసీ సెక్షన్ 376 (రేప్), పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఆ కీచకతండ్రిని అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

click me!