ఉన్నావో రేప్ కేసు: దోషి కుల్దీప్ సెంగార్‌కు ఢిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు
Unnao rape case: ఉన్నావో రేప్ కేసులో దోషిగా తేలిన కుల్దీప్ సెంగార్‌కు ఢిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తన కూతురి పెళ్లికి హాజరయ్యేందుకు ప్రభుత్వం అతనికి బెయిల్ మంజూరు చేసింది. 2017లో ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న బహిష్కరణకు గురైన బీజేపీ నాయకుడు కుల్దీప్ సింగ్ సెంగార్‌కు జైలు శిక్షను అనుభవిస్తున్నారు.
Delhi High Court: 2017లో ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న బహిష్కరణకు గురైన బీజేపీ నాయకుడు కుల్దీప్ సింగ్ సెంగార్‌కు ఢిల్లీ హైకోర్టు సోమవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. న్యాయమూర్తులు ముక్తా గుప్తా, పూనమ్ ఎ బాంబాతో కూడిన ధర్మాసనం జనవరి 27 నుండి ఫిబ్రవరి 10 వరకు శిక్షను సస్పెండ్ చేసింది. సెంగార్‌ను విడుదల చేసే సమయంలో ప్రతిరోజూ సంబంధిత SHOకి నివేదించాలనీ, ఒక్కొక్కరికి రూ. 1 లక్ష చొప్పున రెండు పూచీకత్తులను అందించాలని ఆదేశించింది. ఫిబ్రవరి 8, 2023న జరగాల్సిన తన కుమార్తె వివాహం కోసం రెండు నెలల పాటు మధ్యంతర బెయిల్ కోసం అతను డిసెంబర్ 2022లో కోర్టును ఆశ్రయించాడు.
గోరఖ్‌పూర్, లక్నోలో వివాహ ఆచారాలు- వేడుకలు జరుగుతాయనీ, కుటుంబ సభ్యుడు మాత్రమే అయినందున అతను ఏర్పాట్లు చేయాలని సీనియర్ న్యాయవాదులు ఎన్ హరిహరన్, పీకే. దూబేలు కోర్టులో వాదనలు వినిపించారు. ఫిబ్రవరి 8న వివాహం జరుగుతుందని సెంగార్ గతంలో కోర్టుకు తెలియజేశారు. సీబీఐ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. ఏజెన్సీ స్టేటస్ రిపోర్ట్‌ను దాఖలు చేసిందనీ, వివాహ వేడుకల కోసం రెండు హాళ్లు బుక్ చేసినట్లు తేలిందని సీబీఐ తరఫు న్యాయవాది తెలిపారు. ఉన్నావో అత్యాచారం కేసులో ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సెంగార్ దాఖలు చేసిన అప్పీలు ఇప్పటికే హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. తనను దోషిగా నిర్ధారించిన ట్రయల్ కోర్టు 2019 డిసెంబర్ 16న ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని ఆయన కోరారు. తనకు జీవితాంతం జైలు శిక్ష విధిస్తూ డిసెంబర్ 20, 2019 నాటి ఉత్తర్వులను పక్కన పెట్టాలని సెంగార్ కోరాడు.
ట్రయల్ కోర్టు సెంగార్‌ను వివిధ నిబంధనల ప్రకారం దోషిగా నిర్ధారించింది. ఇందులో IPCలోని సెక్షన్ 376 (2) "తన అధికారిక పదవిని సద్వినియోగం చేసుకొని అతని కస్టడీలో ఉన్న ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఒక ప్రభుత్వ ఉద్యోగి చేసిన అత్యాచారానికి సంబంధించిన నేరానికి సంబంధించింది. పబ్లిక్ సర్వెంట్ లేదా అతనికి అధీనంలో ఉన్న ప్రభుత్వ సేవకుడి అదుపులో వుంచుకోవడానికి సంబంధించింది. ఈ క్రమంలోనే అతనికి కోర్టు జీవిత ఖైదు విధించింది. అలాగే, రూ. 25 లక్షల జరిమానా కూడా విధించింది. బాలిక మైనర్‌గా ఉన్నప్పుడు 2017లో సెంగార్ ఆమెను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉన్నావ్ నుంచి ఢిల్లీకి బదిలీ అయిన తర్వాత ఆగస్టు 5, 2019న ప్రారంభమైన విచారణ రోజువారీ ప్రాతిపదికన జరిగింది.
అత్యాచార బాధితురాలు అప్పటి ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌కు రాసిన లేఖను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, ఉన్నావో అత్యాచార ఘటనకు సంబంధించి నమోదైన మొత్తం ఐదు కేసులను లక్నో కోర్టు నుండి ఢిల్లీలోని కోర్టుకు 2019 ఆగస్టు 1న బదిలీ చేసింది. రోజువారీగా విచారణ జరిపి 45 రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే అతనికి జీవితఖైదు విధించడంతో పాటు రూ.25 లక్షల జరిమానా విధించగా, అందులో రూ.10 లక్షలు బాధితురాలికి, రూ.15 లక్షలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి విచారించగా అయ్యే ఖర్చుల కోసం ఇవ్వాలని ఆదేశించింది.