Jal Jeevan Mission: ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు తాగునీటి కోసం కిలో మీటర్ల దూరం బిందెలతో వెళ్లాల్సిన పనిలేదు. "జల్ జీవన్ మిషన్ : హర్ ఘర్ జల్" కింద దేశవ్యాప్తంగా 75 శాతం గ్రామీణ కుటుంబాలు కుళాయి నీటిని పొందుతున్నాయి.
Jal Jeevan Mission: Har Ghar Jal: తలపై కుండలు, బిందెలు పెట్టుకుని తాగునీటి కోసం గ్రామీణ ప్రాంతాల్లో కిలో మీర్ల దూరం నడవాల్సిన పనిలేదు. తాగు నీటి కోసం మహిళలు సంవత్సరాలుగా పడుతున్న కష్టాలను దూరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం దీని కోసం జల్ జీవన్ మిషన్: హర్ ఘర్ జల్ మిషన్ ను తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా గ్రామీణ గృహాలకు స్వచ్ఛమైన, తగినంత తాగునీరును కుళాయిల ద్వార అందించడంలో మంచి ఫలితాలను సాధిస్తోంది. దీని కోసం ప్రభుత్వం 15 ఆగస్టు 2019న "జల్ జీవన్ మిషన్: హర్ ఘర్ జల్"ను ప్రారంభించింది.
మార్చి 7, 2024న, ఈ మిషన్ ఒక చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. "హర్ ఘర్ జల్" మిషన్ కింద, భారతదేశంలోని 75 శాతం కుటుంబాలకు పంపు నీటిని విజయవంతంగా అందిస్తోంది. జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ఇళ్లకు కుళాయి నీటిని అందిస్తున్నారు. 2019 వరకు 3 కోట్ల 23 లక్షల గ్రామీణ ఇళ్లకు మాత్రమే కుళాయి నీరు చేరుతోంది. 4 సంవత్సరాలలో, ఇప్పుడు 14 కోట్ల 50 లక్షలకు పైగా గ్రామీణ గృహాలకు కుళాయి నీరు చేరుతోంది.
undefined
ముఖ్యమంత్రిని వెనుక నుంచి తోసారు.. మమతా బెనర్జీ తలకు తీవ్రగాయం
జల్ జీవన్ మిషన్ ప్రధాన విజయాలు :
LPG Cylinder Prices : గుడ్‌న్యూస్.. అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి !