13,000 nude photos : ప్రియుడి ఫోన్ లో 13 వేల మంది మహిళల నగ్న ఫొటోలు.. షాక్ అయిన ప్రియురాలు..

By Asianet News  |  First Published Nov 29, 2023, 5:04 PM IST

13,000 nude photos in gallery : ఓ యువకుడు తన ప్రియురాలు, సహోద్యోగి అయిన ఓ యువతికి సంబంధించిన అభ్యంతరకర ఫొటోలను ఫోన్ లో తీశాడు. అయితే వాటిని డిలీట్ చేయాలని ఆ యువతి భావించింది. అందుకే అతడికి తెలియకుండా ఫోన్ తీసుకొని, గ్యాలరీ ఓపెన్ చేసింది. అందులో ఉన్న ఫొటోలను చూసి దిగ్భ్రాంతికి గురయ్యింది.


ఓ యువతి, యువకుడు ఒకే ఆఫీసులో కలిసి పని చేస్తున్నారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య సన్నిహిత్యం పెరిగింది. అది కొన్నాళ్లకు ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఆ యువతిని అభ్యంతరకర రీతిలో ఆమె ప్రియుడు ఫొటోలు తీశాడు. అయితే వాటిని డిలీట్ చేసేందుకు అతడి ఫోన్ గ్యాలరీ చూసిన ఆ ప్రియురాలు షాక్ కు గురయ్యింది. అందులో దాదాపు 13 వేల మంది మహిళ నగ్న ఫొటోలు చూసి నివ్వెర బోయింది.

digital payment frauds: డిజిటల్ లావాదేవీల మోసాలపై కేంద్రం ఉక్కుపాదం.. 70 లక్షల మొబైల్ నెంబర్లు సస్పెండ్..

Latest Videos

టైమ్స్ ఆఫ్ ఇండియా, పలు మీడియా కథనాల వివరాల ప్రకారం.. కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఓ బీపీవో కంపెనీలో 25 ఏళ్ల ఆదిత్య సంతోష్ పని చేస్తున్నారు. ఆ కంపెనీలో అతడు ఐదు నెలలుగా కస్టమర్ సర్వీస్ ఏజెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అదే కంపెనీలో 22 ఏళ్ల యువతి కూడా పని చేస్తోంది. ఈ క్రమంలో నాలుగు నెలల కిందట వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ల తరువాత వారిద్దరూ ప్రేమికులుగా మారిపోయారు. 

ఈ క్రమంలో వారిద్దరూ ఓ సందర్భంలో సన్నిహితంగా మెలిగారు. ఆ క్షణాలను సంతోష్ తన సెల్ ఫోన్ లో బంధించాడు. అయితే వాటిని ఆ యువతి తొలగించాలని నిర్ణయించుకుంది. దీంతో అతడికి తెలియకుండా ఫోన్ ను తీసుకొని, గ్యాలరీని ఓపెన్ చేసింది. అందులో ఉన్న ఫొటోలను చూసి ఒక్క సారిగా ఖంగుతింది. ఆ ఫోన్ గ్యాలరీలో 13 వేల మంది మహిళల నగ్న ఫొటోలు ఉన్నాయి. అందులో ఆమె ఫొటోలు కూడా ఉన్నాయి.

మరి దేవాలయాల్లో హారతి సంగతేంటి ? : మసీదులో లౌడ్ స్పీకర్లపై నిషేధం విధించాలన్న పిటిషన్ పై హైకోర్టు వ్యాఖ్యలు..

అతడి నీచ ప్రవర్తన చూసి ఆ యువతి వారి మధ్య ఉన్న బంధాన్ని తెంచుకుంది. ఈ విషయంలో నవంబర్ 20వ తేదీన ఆఫీసులోని సీనియర్లకు సమాచారం ఇచ్చింది. భవిష్యత్తులో తన ఆఫీసులోని ఇతర అమ్మాయిలు ఇబ్బందులు పడకుండా రక్షించాలని కోరింది. దీంతో బెల్లందూర్‌కు చెందిన బీపీవో లీగల్ హెడ్.. నిందితుడైన సంతోష్ పై నవంబర్ 23న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అయ్యో.. క్లాత్ షోరూంలో గ్లాస్ డోర్ పడి మూడేళ్ల చిన్నారి మృతి.. వీడియో వైరల్.. పేరెంట్స్ పై నెటిజన్ల ఆగ్రహం

కాగా.. ఈ ఘటనపై ఆ కంపెనీ కూడా స్పందించింది. కంపెనీలో పనిచేస్తున్న ఇతర మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని వెంటనే అతడిపై ఫిర్యాదు చేశామని పేర్కొంది. ఈ చర్యకు పాల్పడిన సంతోష్ ఉద్దేశం ఏంటో తెలియరాలేదని తెలిపింది. మహిళల ఫొటోలు మార్ఫింగ్ చేసేందుకు తమ కంపెనీ టూల్స్ ఏవీ సంతోష్ ఉపయోగించలేదని ఆ సంస్థ స్పష్టం చేసింది. 

click me!