టీనేజ్ పిల్లల్లో పీరియడ్స్.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాల్సిందే...

By AN Telugu  |  First Published Oct 21, 2021, 1:07 PM IST

రుతుస్రావం, పీరియడ్స్, నెలసరి.. ఇలా ఏ పేరుతో పిలుచుకున్నా.. ప్రతీ అమ్మాయి జీవితంలోనూ ఇది చాలా ముఖ్యమైన విషయం. Menstruation అనేది మీ శరీరం ఇకపై అవసరం లేని కణజాలాలను విడుదల చేసే నెలవారీ ప్రక్రియ. అంతే కాకుండా, మీ శరీరం పునరుత్పత్తికి సిద్ధమవుతోందని మీకు చెప్పే సంకేతం. 


ఆడపిల్లలు ఇంటికి అందం. అమ్మాయి ఉంటే ఆ ఇల్లు కళకళలాడుతుంది. అదే సమయంలో వయసుకు తగ్గట్టుగా అమ్మాయిలను చూసుకోవడం, వారి సమస్యలు అర్థం చేసుకుని పరిష్కరించడం కత్తిమీద సాము లాంటిది. ఇక టీనేజ్ లోకి వచ్చిన అమ్మాయిల విషయంలో ఇది మరింతగా ఉంటుంది. 

ఆ సమయంలో వారి మూడ్ స్వింగ్స్.. తెలియని కొత్త అనుభవం.. తమలో కలుగుతున్న మార్పులు ఎందుకో, ఏంజరుగుతుందో తెలియక ఇబ్బంది. ఇవ్వన్నీ వారిని అప్పటివరకున్న దానికంటే భిన్నంగా మార్చేస్తుంటాయి. 

Latest Videos

రుతుస్రావం, పీరియడ్స్, నెలసరి.. ఇలా ఏ పేరుతో పిలుచుకున్నా.. ప్రతీ అమ్మాయి జీవితంలోనూ ఇది చాలా ముఖ్యమైన విషయం. Menstruation అనేది మీ శరీరం ఇకపై అవసరం లేని కణజాలాలను విడుదల చేసే నెలవారీ ప్రక్రియ. అంతే కాకుండా, మీ శరీరం పునరుత్పత్తికి సిద్ధమవుతోందని మీకు చెప్పే సంకేతం. 

రుతుక్రమంలో లోపాలు టీనేజ్‌లో సర్వసాధారణమైన విషయం. రుతు చక్రంలో స్వల్ప మార్పులు ఆందోళన కలిగించకపోయినప్పటికీ, కొన్ని తీవ్రమైనవిగా పరిగణించబడతాయి. వీటిని అంత తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదని చెబుతాయి.

దీనిమీద  parentsకు అవగాహన ఉండాలి. అప్పుడే సమస్యేంటో కనిపెట్టడం వల్ల తమ చిన్నారికి చక్కటి ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించగలుతారు. అవేంటో.. చూడండి....

పదహారేళ్లు వచ్చినా...
సాధారణంగా, 10 నుండి 15 సంవత్సరాల మధ్య కాలంలో పీరియడ్స్ మొదలవుతాయి. మీ బిడ్డ 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు వచ్చిన తర్వాత కూడా అది periods మొదలు కాకపోతే.. ఆమె primary amenorrheaతో బాధపడుతుండవచ్చు. 

15 యేళ్ల వరకు ఫస్ట్ పీరియడ్ రాకపోతే ఈ పరిస్థితి వస్తుంది. ఇది జీవితకాలం ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిల్లో జన్యుపరమైన వాటినుంచి శరీర నిర్మాణ సంబంధమైన అసాధారణత వరకు ఉంటాయి. అయితే, ఈ విషయాన్ని మీరే నిర్థారించుకోవడం కాకుండా వైద్యుడ్ని సంప్రదించి.. నిర్థారణకు రావాలి. 

రక్తస్రావం లేనప్పుడు.. తీవ్రమైన నొప్పి..
menstruation సమయంలో period cramps మామూలే. అయితే రక్తస్రావం లేకుండా కేవలం నొప్పి మాత్రమే ఉంటే.. దీనికి వేరే అర్థం ఉండొచ్చు. ఇది ovulation, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీస్, ఎండోమెట్రియోసిస్, ruptured ovarian cyst, irritable bowel syndrome వంటి ఇతర పరిస్థితుల లక్షణాలు కావచ్చు.

7 రోజులకు పైగా బ్లీడింగ్ అవుతుంటే...

మామూలుగా periods మూడు నుంచి ఐదు రోజుల వరకు ఉంటాయి. ఆయా రోజుల్లో శరీరతత్వాన్ని బట్టి ఎక్కువ, తక్కువ bleeding అవుతుంటుంది. అయితే ఇదే పీరియడ్స్ 7 రోజుల కంటే ఎక్కువ రోజులు అవ్వడం అంటే మామూలు  విషయం కాదు. ఈ పరిస్థితిని మెనోరాజియా అంటారు. అలాంటి సందర్భాలలో, వైద్యుడిని వెంటనే కలవాలి.

ఇక ఈ సమయంలో, కూడా ఆందోళనకరంగా ఉంటుంది. నిరంతరం రక్తస్రావం కాకుండా, menorrhagia అనేది తీవ్రమైన రక్తస్రావాన్ని కూడా సూచిస్తుంది, బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం అంటే.. ప్రతీ గంటకోసారి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్యాడ్ లు మార్చుకోవాల్సి రావడం ఈ పరిస్థితికి నిదర్శనం. 

 

ప్రతి 21 రోజులకు...

మామూలుగా మహిళలకు.. ప్రతి 28 రోజులకు పీరియడ్స్  వస్తాయి. అంతేకాదు రుతుచక్రం 21 రోజుల నుండి 35 రోజుల వరకు ఉంటుంది. మీ టీనేజ్ కుమార్తె ప్రతి 21 రోజుల కంటే ఎక్కువ సార్లు లేదా ప్రతి 45 రోజుల కంటే తక్కువగా తరచుగా పీరియడ్స్ వస్తుంటే.. ఇది irregular periods కు సంకేతం. దీనిని వీలైనంత త్వరగా పరిష్కరించాలి. 

90 రోజుల కంటే ఎక్కువ ఆలస్యమైతే.. 

సాధారణ రుతు చక్రం 21 నుండి 35 రోజుల మధ్య ఉండవచ్చు, అయితే, మీ కుమార్తె 90 రోజుల కంటే ఎక్కువ కాలం పీరియడ్స్ రాకుండా స్కిప్ చేస్తే, అది కూడా గుర్తించదగిన లక్షణమే.

బుట్ట బొమ్మ పూజా... చర్మ నిగారింపు కోసం ఎలాంటి ఫేస్ ప్యాక్ వాడుతుందో తెలుసా?

click me!