Asianet News TeluguAsianet News Telugu

హస్త ప్రయోగానికి బానిసలయ్యారా..? ఇదిగో చిట్కాలు

చాలా మంది హస్త ప్రయోగం చేసుకోనిదే నిద్రకూడా పోని పరిస్థితుల్లోకి వచ్చేస్తున్నారు. మరి దీనికి పరిష్కారమే లేదా అంటే.. కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే చాలు అంటున్నారు నిపుణులు.

What should I do to overcome weakness due to masturbating?

పెళ్లికానివారు, పెళ్లి అయినా సెక్స్ జీవితం ఆనందంగా లేనివారు, పోర్న్ చిత్రాలకు ఎక్కువగా అలవాటు పడినవారు ఇలా చాలా మంది హస్త ప్రయోగాన్ని అలవాటు చేసుకుంటుంటారు. హస్త ప్రయోగం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు. కానీ.. దానికి  బానిసలైతే మాత్రం తర్వాత చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు నిపుణులు. దీనికి బానిసలైన చాలా మంది హస్త ప్రయోగం చేసుకోనిదే నిద్రకూడా పోని పరిస్థితుల్లోకి వచ్చేస్తున్నారు. మరి దీనికి పరిష్కారమే లేదా అంటే.. కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే చాలు అంటున్నారు నిపుణులు.

రోజూ హస్త ప్రయోగం అలవాటు ఉంటే, రోజు విడిచి రోజు చేయడానికి ప్రయత్నించండి. క్రమేనా వారానికి ఒకటి లేదా రెండు సార్లుకు తగ్గించండి.కొంతమంది ఒత్తిడి వల్ల కూడా హస్త ప్రయోగం చేసుకుంటారు. హస్త ప్రయోగంతోనే కాకుండా వ్యాయామం చేయడం ద్వారా కూడా ఒత్తిడి తగ్గించుకోవచ్చు.

పడుకునే ముందు మూత్రం పోసుకోనట్లయితే.. అది హస్త ప్రయోగానికి ప్రేరేపిస్తుంది. కాబట్టి మూత్రం పోసుకుని నిద్రకు ఉపక్రమించండి.మీరు ఒంటరిగా పడుకుంటున్నప్పుడు హస్త ప్రయోగం చేయాలనే ఆలోచన వస్తుంది. ఈ అలవాటు తప్పించుకునేందుకు వీలైతే తల్లిదండ్రులు, సోదరులు లేదా స్నేహితులతో కలిసి నిద్రపోడానికి ప్రయత్నించండి.

హస్త ప్రయోగం చేసుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడు.. మరేదైనా పనిలో నిమగ్నమవ్వండి. పోర్న్ సినిమాలకు బదులు పాటలు వినడం, మీకు నచ్చిన సినిమాలు చూడటం, స్నేహితులతో చాటింగ్ లేదా సోషల్ మీడియా స్టాటస్‌లు చెక్ చేసుకుంటూ నిద్రలోకి జారకునే ప్రయత్నం చేయండి.

కొన్ని వారాలు, నెలలపాటు వీటిని ఫాలో అయితే.. క్రమేనా హస్త ప్రయోగం చేయాలనే ఆలోచన నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఎక్కువగా హస్త ప్రయోగానికి అలవాటు పడిన వారు రియల్ సెక్స్ ని అంత బాగా ఎంజాయ్ చేయలేరట. ఈ ప్రమాదం కూడా ఉంది కాబట్టి దీని నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది.
 

Follow Us:
Download App:
  • android
  • ios