పోర్న్ చిత్రాలు ఎక్కువగా చూస్తున్నారా..? పురుషుల్లో ఆ సమస్య

By ramya neerukonda  |  First Published Aug 30, 2018, 2:55 PM IST

నిజ జీవితంలో శృంగారానుభూతిపై విపరీత ప్రభావం చూపుతుండటం గమనార్హం. నిజంగా శృంగారంలో పాల్గొన్నప్పుడు కూడా ‘అలాంటి దృశ్యాలే’ మనసులో కదలాడుతుండటం, సహజ శృంగారానికీ వాటికీ పోలిక లేకపోవటం మూలంగా చాలామంది అసంతృప్తికి, ఆందోళనలకు లోనవుతున్నారని పరిశోధకులు వివరిస్తున్నారు. 


ప్రస్తుతకాలంలో పోర్న్ చిత్రాలు చూసేవారు ఎక్కువమందే ఉన్నారు. అయితే.. వాటికి బానిసలు మారితే మాత్రం చాలా ఇబ్బంది ఎదుర్కోవాలసి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పోర్న్ చిత్రాలు చూడటం.. డ్రగ్స్ తీసుకోవడం ఒకటేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

డ్రగ్స్ తీసుకున్న వ్యక్తి కి మొదట్లో చాలా హాయిగా అనిపిస్తూ ఉంటుంది.  అది అలవాటుగా మారితే అవి లేకపోతే ఉండలేనట్టు, పిచ్చిపట్టినట్లు బిహేవ్ చేస్తుంటారు. ఒకసారి వీటికి అలవాటుపడితే క్రమంగా వాటి ప్రభావాన్ని ‘తట్టుకునే’ సామర్థ్యమూ పెరుగుతూ వస్తుండటం. మొదట్లో మాదిరిగా హాయి కలగదు. అందువల్ల తరచుగా.. మరింత ఎక్కువ మోతాదులో డ్రగ్స్ తీసుకోవటమూ మొదలవుతుంది. 

Latest Videos

పోర్న్ చిత్రాలను తరచుగా చూసేవారిలోనూ ఇలాగే జరుగుతున్నట్టు తాజా అధ్యయనం ఒకటి పేర్కొంటోంది. అశ్లీల చిత్రాలను చూసినప్పుడు కూడా మాదక ద్రవ్యాలను తీసుకున్నప్పుడు మెదడులో ప్రేరేపితమయ్యే భాగాలే ప్రేరేపితమవుతాయి. వీటిని తరచుగా చూసేవారిలో క్రమంగా వాటి ప్రభావాన్ని ‘తట్టుకోవటం’ సంభవిస్తోందని.. దీంతో శృంగార స్పందనలు, శృంగారంపై ఆసక్తి తగ్గుతూ వస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. 

ఇది నిజ జీవితంలో శృంగారానుభూతిపై విపరీత ప్రభావం చూపుతుండటం గమనార్హం. నిజంగా శృంగారంలో పాల్గొన్నప్పుడు కూడా ‘అలాంటి దృశ్యాలే’ మనసులో కదలాడుతుండటం, సహజ శృంగారానికీ వాటికీ పోలిక లేకపోవటం మూలంగా చాలామంది అసంతృప్తికి, ఆందోళనలకు లోనవుతున్నారని పరిశోధకులు వివరిస్తున్నారు. కాబట్టి అశ్లీల చిత్రాలకు దూరంగా ఉండటమే మంచిదని సూచిస్తున్నారు.
 

read more news...

తొలి కలయిక.. నొప్పి తప్పదా..?

‘ డాగీ స్టైల్’ కే ఓటు అంటున్న మహిళలు

హస్త ప్రయోగానికి బానిసలయ్యారా..? ఇదిగో చిట్కాలు

click me!