లైంగిక శక్తి మూలం టెస్టోస్టిరాన్ హార్మోన్. ఈ హార్మోన్ ఉత్పత్తి అయినప్పుడే.. మనకు సెక్సువల్ ఫీలింగ్స్ కలుగుతాయి.
సరైన పోషకాలు, విటమిన్స్ తీసుకోకుంటే లైంగిక ఆరోగ్యం కుంటుపడుతుంది. లైంగిక జీవితం ఆనందంగా గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకు తగిన ప్రణాళిక ఉంటేనే అది సాధ్యమనేది నిపుణుల వాదన. వయసు పెరిగినా కూడా..లైంగికంగా చురుకుగా ఉండాలంటే.. కొన్నిరకాల విటమిన్లు చాలా అవసరమంటున్నారు నిపుణులు మరి అవేంటో మనమూ చూద్దామా...
లైంగిక శక్తి మూలం టెస్టోస్టిరాన్ హార్మోన్. ఈ హార్మోన్ ఉత్పత్తి అయినప్పుడే.. మనకు సెక్సువల్ ఫీలింగ్స్ కలుగుతాయి. ఇవి కలగాలంటే శరీరానికి తగిన జింక్ అవసరం. ఇది కోరికను పెంచడంతోపాటు.. స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ లైంగిక శక్తినీ, చైతన్యాన్ని పెంచుతుంది. పాలకూర, సెనగలు, గుమ్మడి, సన్ ఫ్లవర్ ఆయిల్, ఓస్టర్ చేపలను తరచూ తీసుకుంటే.. జింక్ సమృద్ధిగా లభిస్తుంది.
ఒమేగా-3 ఇది వయసును తగ్గిస్తుంది. గుండె, మెదడు ఆరోగ్యానికి ఇది చాలా అవసరం. లైంగిక ప్రక్రియలో గుండె, మెదడు చాలా కీలకమన్న విషయం తెలిసిందే. మనసు చైతన్యంగా ఉండటానికి ఒమెగా-3 ఉపయోగపడుతుంది. అవిసె గింజెలు, అవిసె నూనె, సోయాబీన్, ఆలివ్ ఆయిల్, చేపలు ఆహారంలో భాగం చేసుకోవాలి.
జననాంగాలను ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్ -బి కీలకపాత్ర పోషిస్తుంది. శరీరంలో విడుదలయ్యే సెక్స్ హార్మోన్లను ఇవి అనుసంధానం చేస్తాయి. మెదడు పనితనాన్ని, గ్రహణ శక్తిని పెంచంలో కూడా బి విటమిన్ కీలకంగా వ్యవహరిస్తుంది. నీరసం రాకుండా ఉత్తేజంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. అరటి పండు, గుడ్లు, జున్ను, మాంసం వంటి వాటిల్లో ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుంది.
asianet news special
షార్ట్ ఫిలిమ్స్ చేసి కష్టపడి పైకొచ్చిన తెలుగు యువ దర్శకులు!