జూకర్ బర్గ్ దంపతుల దాతృత్వం.. రెండున్నర లక్షల కోట్ల విరాళాలు.. మొదటి విడతగా రూ. 25 వేల కోట్లు దానం..

By SumaBala BukkaFirst Published Dec 9, 2021, 10:40 AM IST
Highlights

రానున్న పదేళ్లలో వైద్య రంగంలో నూతన పరిశోధనలు, కృత్రిమ మేథ మీద పనిచేసేందుకు హార్వర్డ్ యూనివర్సిటీలో నెలకొల్పుతున్న విద్యాసంస్థ కోసం మొదట రూ. 3,770 కోట్లు అంటే 500 మిలియన్ డాలర్లు.. అందజేస్తామని మరో 15 ఏళ్ళపాటు సంస్థకు నిధులు అందుతాయని సీజెడ్ఐ ప్రతినిధి జెఫ్ మెక్ గ్రెగర్ తెలిపారు. 

వాషింగ్టన్ : మెటా సీఈవో Mark Zuckerberg, అతని భార్య Priscilla Chan మరోసారి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. వివిధ వ్యాధులకు సంబంధించి లోతైన శాస్త్రీయ పరిశోధనల కోసం తమ స్వచ్ఛంద సంస్థ Chan Zuckerberg Initiative(సీజెడ్‌ఐ) ద్వారా రెండున్నర లక్షల కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో మొదట రూ.25 వేల కోట్ల విరాళాలు ఇస్తామని పేర్కొన్నారు.

రానున్న పదేళ్లలో వైద్య రంగంలో నూతన పరిశోధనలు, కృత్రిమ మేథ మీద పనిచేసేందుకు Harvard Universityలో నెలకొల్పుతున్న విద్యాసంస్థ కోసం మొదట రూ. 3,770 కోట్లు అంటే 500 మిలియన్ డాలర్లు.. అందజేస్తామని మరో 15 ఏళ్ళపాటు సంస్థకు నిధులు అందుతాయని సీజెడ్ఐ ప్రతినిధి జెఫ్ మెక్ గ్రెగర్ తెలిపారు.  ఆ సంస్థకు జూకర్బర్గ్ తల్లి Karen Kempner Zuckerberg పేరు పెట్టనున్నారు. 

ఫేస్ బుక్ కొత్త సేఫ్టీ ఫీచర్లు: భారతదేశ మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా.. ఇక వాటికి చెక్..

ఇక 4,500 కోట్ల నుంచి 6.7 వేల కోట్ల వరకు సీజెడ్ఐలోని బయో మెడికల్ ఇమేజింగ్ ఇనిస్టిట్యూట్కు అందజేయనున్నట్లు తెలిపారు. ఇక మరో వంద కోట్ల రూపాయలను చాన్ జుకర్ బర్గ్ బయోహబ్ నెట్ వర్క్ కు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. 

ఇదిలా ఉండగా, అక్టోబర్ 29న ‘ఫేస్ బుక్’ కంపెనీ పేరు మార్చుకుంది. ఇకపై దాన్ని ‘మెటా’గా పిలవనున్నారు. ఈ మేరకు పేరు మార్పు విషయాన్ని ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ అక్టోబర్ 28, గురువారంనాడు వెల్లడించారు. భవిష్యత్తులో వర్చువల్ రియాలిటీ సాంకేతిక (మెటావర్స్)కు పెరగనున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 

ఫేస్ బుక్ కంపెనీ అధీనంలోని social media platforms అయిన face book, instagram, watsapp ల పేర్లలో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదు. వీటి మాతృసంస్థ పేరును మాత్రమే మార్చారు. ప్రజలు వర్చువల్ విధానంలో కలుసుకుని, పనిచేసి, ఉత్పత్తులను తయారు చేసే సరికొత్త వేదికగా మెటావర్స్ ను Mark Zugerberg చెబుతున్నారు. 

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్ యాప్‌లలో కొత్త బ్రాండింగ్.. అసలు మెటావర్స్ అంటే ఏంటి ?

రానున్న దశాబ్దంలో వంద కోట్లమందికి ఈ వేదిక అందుబాటులోకి వస్తుందని, లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆయన తాజాగా పేర్కొన్నారు. ప్రస్తుతం తమ సామాజిక మాధ్యమంలో ఇన్ స్టా గ్రాం, మెసెంజర్, క్వెస్ట్ వీఆర్ హెడ్ సెట్, హొరైజన్ వీఆర్ వంటివ భాగంగా ఉన్నాయని.. వాటన్నింటినీ ‘ఫేస్ బుక్’ అనే పేరు దర్పణం పట్టడం లేదని చెప్పారు. 

తమను ప్రస్తుతం కేవలం సామాజిక మాధ్యమ సంస్థగానే పరిగణిస్తున్నారని తెలిపారు. కానీ వాస్తవానికి తమది ప్రజల మధ్య అనుసంధానతను పెంచేందుకు అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేసే కంపెనీ అని వ్యాఖ్యానించారు.

‘Meta’ అనేది గ్రీకు పదమని చెప్పారు. ఫేస్ బుక్ పేపర్ల పేరిట ఇటీవల బయటపడ్డ పత్రాలతో సంస్థ తీవ్ర విమర్శల పాలైందని.. దాన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సంస్థ పేరు మార్చారని విశ్లేషకులు చెబుతుండటం గమనార్హం. 

click me!