కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తుంది. అయితే ఈ వేరియంట్‌ను దక్షిణాఫ్రికాలో బయటపడినప్పటికీ.. ఎలా పుట్టుకోచ్చిందనేది ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. కరోనా వైరస్ (Coronavirus).. ఒమిక్రాన్‌గా ఎలా రూపాంతరం చెందిందనే ప్రశ్నలు పరిశోధకులను వెంటాడుతున్నాయి.
కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తుంది. దక్షిణాఫ్రికాలో (South Africa) వెలుగుచూసిన ఈ వేరియంట్ యూరప్ దేశాలతో పాటు అమెరికాపైన భారీగానే ప్రభావం చూపుతోంది. అయితే ఈ వేరియంట్‌ను దక్షిణాఫ్రికాలో బయటపడినప్పటికీ.. ఎలా పుట్టుకోచ్చిందనేది ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. కరోనా వైరస్ (Coronavirus).. ఒమిక్రాన్‌గా ఎలా రూపాంతరం చెందిందనే ప్రశ్నలు పరిశోధకులను వెంటాడుతున్నాయి. దక్షిణాఫ్రికాలో సేకరించిన నమూనాల నుంచి పరిశోధకులు దీనిని మొదట గుర్తించారు. ఈ వేరియంట్ పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవడానికి, మూలాలను అర్థం చేసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పరిశోధకులు పనిచేస్తున్నారు.
అయితే ఒమిక్రాన్ మూలాల్లో హెచ్‌ఐవీ (Human Immunodeficiency Virus) ఉంది అని కొందరు పరిశోధకులు నిర్దారణకు వచ్చినట్టుగా తెలుస్తోంది. దక్షిణాఫ్రికా పరిశోధకులు ఓమిక్రాన్, హెచ్ఐవి మూలాల మధ్య సంబంధాన్ని అధ్యయనం చేస్తున్నారు. అయితే వారి పరిశోధనలను ఉటంకిస్తూ.. ఒమిక్రాన్‌ను హెచ్‌వీఐతో ముడిపెట్టే పరికల్పన అత్యంత సహేతుకమైనదని బీబీసీ నివేదిక పేర్కొంది.
undefined
మనుషులలో రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడిన వారిలో వైరస్ ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో శరీరంలో వైరస్ ఉత్పరివర్తనాలు చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇదే విధంగా ఒమిక్రాన్ హెచ్‌ఐవీ పెషేంట్‌లో అవతరించి ఉండే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. హెచ్‌వీఐ సోకిన ఎలాంటి మందులు వాడకపోవడం, చికిత్సను మధ్యలోనే వదిలేసిన ఓ మహిళ కరోనా బారిన పడిందని, ఆమె శరీరంలోని హెచ్‌ఐవీ వైరస్ కారణంగా కరోనా ఉత్పరివర్తనాలకు గురై ఒమిక్రాన్‌గా అవతరించి ఉంటుందని పరిశోధకులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
Also read: కొవిషీల్డ్ రక్షణ మూడు నెలల తర్వాత సన్నగిల్లుతుంది... లాన్సెట్ అధ్యయనం
దక్షిణాఫ్రికాలో భారీగా హెచ్‌ఐవీ కేసులు ఉన్న సంగతి తెలిసిందే. 18-45 ఏళ్ల మధ్య ఉన్న ప్రతి ఐదుగురు దక్షిణాఫ్రికా వాసుల్లో ఒకరు HIV బారిన పడ్డారని 2020లో UNAIDS నివేదిక పేర్కొంది. హెచ్‌ఐవి సోకిన వ్యక్తుల్లో 30 శాతం కంటే ఎక్కువ మంది యాంటీరెట్రోవైరల్ థెరపీ చేయించుకోకపోవడం లేదని తెలిపియింది. ఈ ఔధం హెచ్‌ఐవీ సోకిన రోగిలో రోగనిరోధక వ్యవస్థ పనితీరున పునరుద్దరిస్తుంది. అయితే యాంటీరెట్రోవైరల్ థెరపీని తీసుకోకపోవడం వల్ల HIV సోకిన వ్యక్తి రోగనిరోధక వ్యవస్థను బలహీనపడుతుంది. ఇలాంటి వ్యక్తులకు కోవిడ్, ఇతర వైరస్‌లు సోకితే అవి వారి శరీరాల్లో ఎక్కువ కాలం ఉండటమే కాకుండా.. ఉత్పరివర్తనాలు చెందుతాయి.
ఇక, కొద్ది రోజుల కిందట కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ కెంప్ బృందం కూడా హెచ్‌వీఐ సోకిన వ్యక్తుల్లో ఒమిక్రాన్ అవతరించి ఉండవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ‘సాధారణ ఆరోగ్యకరమైన వ్యక్తి రోగనిరోధక వ్యవస్థ కొన్ని రోజుల నుంచి రెండు వారాల వరకు వైరస్‌ను బయటకు పంపిస్తోంది. HIV ఉన్న వ్యక్తితో ఇది జరగదు. దక్షిణాఫ్రికాలో HIV యొక్క అధిక ప్రాబల్యం ఓమిక్రాన్ రూపాంతరం యొక్క పరిణామానికి దోహదపడి ఉండవచ్చు. ఇది ఒక కేవలం హెచ్‌వీఐకి మాత్రమే పరిమితం కాదు.. ఏదైనా ఆరోగ్య పరిస్థితుల వల్ల రోగనిరోధక శక్తి బలహీన పడిన వారిలో కూడా ఇలాంటి పరిణామాలకు అవకాశం ఉటుంది’ అని తెలిపింది.