పదమూడేళ్లుగా అదేపని, మహిళలే టార్గెట్: 150 మందికి పోర్న్ వీడియోలు

By Siva Kodati  |  First Published Feb 12, 2020, 8:32 PM IST

సైబర్ నిందితుడు కందగట్ల భాస్కర్ కేసులో కొత్త ములుపులు చోటు చేసుకున్నాయి. మహిళల అశ్లీల చిత్రాల వీడియోలు పంపిస్తూ సుమారు 150 మంది మహిళలను భాస్కర్ వేధిస్తున్నట్లుగా తెలుస్తోంది


సైబర్ నిందితుడు కందగట్ల భాస్కర్ కేసులో కొత్త ములుపులు చోటు చేసుకున్నాయి. మహిళల అశ్లీల చిత్రాల వీడియోలు పంపిస్తూ సుమారు 150 మంది మహిళలను భాస్కర్ వేధిస్తున్నట్లుగా తెలుస్తోంది. అతని సెల్‌‌ఫోన్‌లో వందల సంఖ్యలో అశ్లీల చిత్రాల వీడియోలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అతనిని మరోసారి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు.

Also Read:అంగట్లో ఇండియన్స్ పర్సనల్ డేటా.. గుర్తించిన సింగపూర్ సంస్థ ఐబీ

Latest Videos

undefined

రుణాల కోసం దరఖాస్తు చేసుకునే మహిళలను టార్గెట్ చేస్తున్న ఇతను ఎన్‌జీవో సంస్థలో పనిచేస్తున్నట్లు నమ్మించి వేధింపులకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. జనగామ జిల్లా లింగాల ఘనపురం గ్రామానికి చెందిన కందగట్ల భాస్కర్‌ అవివాహితుడు. ఈ క్రమంలో అతను యూట్యూబ్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ దానికి బానిస అయ్యాడు.

మహిళలు, విద్యార్ధినులు, యువతుల ఫోటోలు, ఫోన్ నెంబర్లు సేకరించి వారికి వందల సంఖ్యలో అశ్లీల వీడియోలు పంపేవాడు. ఈ క్రమంలో ఐదు నెలల క్రితం హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్‌కు వందల సంఖ్యలో అశ్లీల వీడియోలు పంపేవాడు.

Also Read:బాస్ మెయిల్‌కి అశ్లీల మెసేజ్‌లు, ఫోటోలు: కట్ చేస్తే.. ఉద్యోగే బ్లాక్ మెయిలర్

అక్కడితో ఆగకుండా ప్రతీరోజూ ఫోన్ చేసి వేధించడంతో సదరు మహిళా కానిస్టేబుల్‌తో ఫోన్లు చేస్తుండేవాడు. దీంతో సహనం నశించిన ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అయితే భాస్కర్ తెలివిగా తన ఫోన్‌లోని సిమ్ కార్డును తీసేయడంతో దర్యాప్తు ముందుకు సాగలేదు. కానీ సాంకేతిక పరిజ్ఞానంతో భాస్కర్‌ను గుర్తించి బషీర్‌బాగ్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

click me!