మహిళా భద్రత కోసం నిర్భయ చట్టం వుండగా దిశ చట్టాన్ని తీసుకురావడానికి గల కారణాలను ఏపి డిజిపి గౌతమ్ సవాంగ్ వివరించారు.
అమరావతి: మహిళల భద్రత కోసం దిశ బిల్లుతో పాటు అనేక ప్రత్యేక చట్టాలున్నా వాటి అమలులో తేడాలున్నాయని డిజిపి గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. 2012 లో నిర్భయ ఆక్ట్ వచ్చింది కానీ దానిలో పరిపూర్ణత లేదన్నారు. నిర్భయ చట్టం అమలులో అనేక సవాళ్లున్నాయని...లోపాలు, సవరణలు కూడా ఉన్నాయన్నారు. అన్నింటినీ అధిగమించేలా దిశ ఆక్ట్ ను ప్రభుత్వం తీసుకువచ్చిందని తెలిపారు.
రాష్ట్రంలో ఇప్పటికే అనేక మహిళా పోలీస్ స్టేషన్లను దిశ స్టేషన్ లుగా మార్చామన్నారు. ఇప్పటివరకు 6 దిశ పోలీస్ స్టేషన్లు ప్రారంభమయ్యాయని... ఈ నెలలో (8వ తేదీన) మరో 12 దిశ స్టేషన్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
క్రైమ్ సీన్ మేనేజ్మెంట్ కోసం ప్రత్యేకంగా బస్ లను కేటాయించామని తెలిపారు. ఈ బస్సుల్లో అన్ని సాంకేతికతలతో కూడిన కిట్లు ఉంటాయన్నారు. డిఎన్ఏ టెస్టులను కేవలం 24 గంటల్లో పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఇలా ఫోరెన్సిక్ రిపోర్టులను వేగవంతంగా అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో 13 ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేసినట్లు డిజిపి తెలిపారు. కేవలం వారం రోజుల్లోనే 51 దిశ కేసులలో ఛార్జ్ షీట్ లు దాఖలు చేయడం జరిగిందని వెల్లడించారు.
read more జగన్ సర్కార్ కీలక నిర్ణయం... భారీగా ఐపిఎస్ ల బదిలీలు
ప్రమాదంలో వున్న మహిళలను కాపాడేందుకు రూపొందించిన దిశ యాప్ ను ఇప్పటివరకు 2 లక్షల మంది డౌన్ లోడ్ లు చేసుకున్నారని తెలిపారు. సైబర్ మిత్ర, మహిళా మిత్ర, మహిళా సంరక్షణ వంటి పోలీస్ కార్యక్రమాల ద్వారా కూడా మహిళలకు రక్షణ కల్పించడం జరుగుతోందన్నారు.
రాష్ట్రంలో ప్రతి పోలీస్ స్టేషన్ ను వుమెన్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ గా సిఎం జగన్ ప్రకటించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 206 జీరో ఎఫ్‌ఐఆర్ లు నమదయ్యాయని తెలిపారు. ఏపీ మహిళా భద్రత, రక్షణ విషయంలో రోల్ మోడల్ గా మారిందని డిజిపి పేర్కొన్నారు.
దిశ యాక్ట్ స్పెషల్ ఆఫీసర్ దీపిక మాట్లాడుతూ... దిశ చట్టం అమలులో భాగంగా పనిచేసే సిబ్బందికి 30 శాతం అధిక అలవెన్సులు అంధించనున్నట్లు తెలిపారు. అన్ని మౌలిక వసతులు, సరిపడా సిబ్బంది ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
read more యువతిపై అత్యాచారం... దిశా ఘటన తరహాలో ఎన్కౌంటర్: హర్షకుమార్ డిమాండ్
దిశ కాల్ సెంటర్ కోసం కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేయడం జరిగిందన్నారు.దీని ద్వారా చట్టం అమలుపై మహిళల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నట్లు తెలిపారు. దిశ చట్టం అమలుకోసం రూ.87 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. దిశ పోలీస్ స్టేషన్లలో కౌన్సెలింగ్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. క్రైమ్ సీన్ మేనేజ్మెంట్ బస్ ప్రతి స్టేషన్ కు ఉంటుందన్నారు.
స్పందనలో 52 శాతం ఫిర్యాదులు మహిళలకు సంబంధించినవే వస్తున్నాయని తెలిపారు. 22 శాతం ఫిర్యాదులపై ఎఫ్ఐఆర్ లు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఫిర్యాదులు చేయడానికి మహిళలు ధైర్యంగాముందుకొస్తున్నారని అన్నారు. ఇప్పటివరకు 16,291 కేస్ లు రాగా 11 వేలు మహిళలకు సంబంధించేనవేనని... అందులో 3500 ఫిర్యాదులపై ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయని తెలిపారు.
మహిళలకు నమ్మకం కల్గిస్తే ఇంకా మరింత మంది ముందుకొస్తారు పేర్కొన్నారు. లెక్కలు ఎక్కువ గా కన్పిస్తాయి... ఈ డేటా చూసి భయాందోళనలకు గురికావద్దని అన్నారు.