ప్రెగ్నెన్సీ టైంలో సెక్స్ పూర్తిగా సురక్షితమే.. కానీ వీళ్లకు మాత్రం సేఫ్ కాదు ..!

First Published | Sep 29, 2023, 10:48 AM IST

ప్రెగ్నెన్సీ టైంలో సెక్స్ లో పాల్గొనడం బిడ్డ, తల్లి ఆరోగ్యానికి మంచిది కాదని చాలా మంది భావిస్తుంటారు. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు. 
 

ప్రెగ్నెన్సీ సమయంలో.. ఆడవారి శరీరంలో ఎన్నో మార్పులు కనిపిస్తాయి. శారీరక మార్పులే కాదు మానసిక మార్పులు కూడా వస్తాయి. ఇది ఆడవారిలో సెక్స్ కోరికలను ప్రభావితం చేస్తుంది. అందుకే ఈ సమయంలో ఆడవారికి సెక్స్ పట్ల భయంఉంటుంది. కాగా ప్రెగ్నెన్సీ టైంలో సెక్స్ సురక్షితమా? కాదా? అన్న అపోహలు చాలా మందికి ఉంటాయి. మరి దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. 

Pills before sex

ఎన్సీబీఐ ప్రకారం..  ప్రెగ్నెన్సీ సమయంలో శృంగారంలో పాల్గొనడం వల్ల ప్రెగ్నెన్సీపై ఎలాంటి ప్రభావం పడదు. నిజానికి సెక్స్ వల్ల బిడ్డ ఎదుగుదలపై ఎలాంటి ప్రభావం ఉండదని నిపుణులు చెబుతున్నారు. నిజానికి సెక్స్ కూడా సులువైన ప్రసవానికి సహాయపడుతుంది.
 


కెనడియన్ మెడికల్ జర్నల్ అసోసియేషన్ పరిశోధన ప్రకారం.. చాలా మంది జంటలు గర్భధారణ సమయంలో సెక్స్ లో పాల్గొంటారు. వీరిలో కొంతమంది మొదటి త్రైమాసికంలో సెక్స్ లో పాల్గొనడానికి ఇష్టపడతారు. మరికొంతమంది జంటలు మూడో త్రైమాసికంలో సెక్స్ లో పాల్గొంటుంటారు. పలు పరిశోధనల ప్రకారం.. యోని సెక్స్ కంటే ఆనల్ సెక్స్ పూర్తిగా సురక్షితం.
 

గర్భధారణ సమయంలో సెక్స్ చేయడం సురక్షితమేనా?

ప్రెగ్నెన్సీలో ఎలాంటి సమస్యలు లేకపోతే సెక్స్ పూర్తిగా సేఫ్ అంటున్నారు నిపుణులు. మొదటి త్రైమాసికంలో..  మహిళల శరీరంలో ఎన్నో హార్మోన్ల మార్పులు సంభవిస్తాయి. దీంతో సెక్స్ వల్ల రొమ్ములో నొప్పి పెడుతుంది. ఒత్తిడి సమస్య పెరుగుతుంది. దీనికితోడు కండరాల నొప్పుల సమస్య కూడా ఉంటుంది. మీకు ఇంతకు ముందు గర్భస్రావం అయినట్టైతే గర్భధారణ సమయంలో వైద్య సలహా తర్వాత మాత్రమే సెక్స్ లో పాల్గొనండి. 


ఏ మహిళలు శృంగారానికి దూరంగా ఉండాలి?

గర్భస్రావ చరిత్ర ఉన్న ఆడవారు ప్రెగ్నెన్సీ సమయంలో రక్తస్రావంతో ఇబ్బంది పడుతుంటే శృంగారానికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.సెక్స్ సమయంలో నొప్పి కలిగే ఆడవారు కూడా ఈ సమయంలో సెక్స్ లో పాల్గొనకూడదు. 
 


గర్భధారణ సమయంలో సురక్షితమైన సెక్స్ కోసం చిట్కాలను 

ముందుగా వైద్యుడిని సంప్రదించండి

సాధారణంగా ఆడవారు మొదటి ప్రెగ్నెన్సీలో ఎక్కువ సేపు సెక్స్ లో పాల్గొంటుంటారు. కొంతమందికి ఆరు నుంచి ఎనిమిది వారాల వరకు తాము ప్రెగ్నెంట్ అన్న సంగతి కూడా తెలియదు. కానీ మీరు గర్భం దాల్చారని తెలిసిన వెంటనే హాస్పటల్ కు వెళ్లాలి. డాక్టర్ మీ పరిస్థితిని పరిశీలిస్తారు. అలాగే మీరు ఎంతకాలం సెక్స్ లో పాల్గొనడం సురక్షితమో చెప్తారు. 
 

కండోమ్లను ఉపయోగించండి

ప్రెగ్నెన్సీ సమయంలో కండోమ్ ఎందుకు అవసరమని చాలా మంది అనుకుంటారు. కానీ ఈ సమయంలో మీరు కండోమ్ లను వాడటం చాలా అవసరం. ఇవి మిమ్మల్ని రక్షించడమే కాకుండా.. లైంగిక అంటువ్యాధులు, ఇతర ప్రమాదాల నుండి కూడా మిమ్మల్ని రక్షిస్తాయి. అందుకే గర్భధారణ సమయంలో సెక్స్ లో పాల్గొనేటప్పుడు కూడా కండోమ్ లను వాడాలి. లైంగిక సంక్రమణ వ్యాధులను నివారించడానికి గర్భధారణ సమయంలో కండోమ్లను ఖచ్చితంగా ఉపయోగించండి. ఇది శరీరంలో ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. సెక్స్ సమయంలో నొప్పి లేదా అసౌకర్యం అనిపిస్తే సెక్స్ లో పాల్గొనడం ఆపేయండి. 

సరైన సెక్స్ భంగిమ

సెక్స్ సమయంలో మీకు సౌకర్యవంతంగా అనిపించే పొజీషన్ నే ఎంచుకోండి. నిజానికి చాలా మంది ఆడవారు ప్రెగ్నెన్సీ సమయంలో వెన్నునొప్పి తో బాధపడుతుంటారు. దీంతోపాటుగా పొట్టపై ఎక్కువ ఒత్తిడికి కూడా దూరంగా ఉండాలి. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సెక్స్ లో పాల్గొనడానికి సరైన పొజీషన్ ను ఎంచుకోండి. ఇది మీకు సౌకర్యవంతంగా ఉంటుంది. నొప్పిని కూడా నివారించొచ్చు.
 

ఓరల్ లేదా యోని సెక్స్

యోని సెక్స్ లో మీకు అసౌకర్యంగా అనిపిస్తే.. ఓరల్ సెక్స్ లో పాల్గొనండి. ఇలా చేయడం వల్ల బిడ్డకు హాని జరిగే ప్రమాదం తగ్గుతుంది. మీకు వెన్నునొప్పి ఉంటే ఈ రకమైన సెక్స్ లో పాల్గొనండి. 
 

అలసిపోకండి

ప్రెగ్నెన్సీలో సెక్స్ లో పాల్గొనేటప్పుడు మీరు ఎంత సేపు సౌకర్యవంతంగా ఉంటారో ముందుగా గుర్తుంచుకోవాలి. భాగస్వామిని సంతోషపెట్టడానికి మీకు అసౌకర్యంగా అనిపించే లైంగిక భంగిమలో పాల్గొనకండి. అలాగే ఎక్కువసేపు సెక్స్ లో పాల్గొనడం మానుకోండి.  గర్భధారణలో ఏ రకమైన అలసట అయినా మీకు ప్రమాదమే. 

Latest Videos

click me!