కరోనా శృంగారపురుషుల జీవితాలను తలకిందులుగా చేసేసింది. లాక్ డౌన్ వల్ల పార్టీలంటూ, డేటింగ్ లంటూ తిరిగే వారందరూ ఇంటికే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో అన్ లాక్ ప్రక్రియ వీరి పాలిట వరంగా మారింది.
ముఖ్యంగా డేటింగ్, వన్ నైట్ స్టాండ్ లాంటి వాటికి అలవాటు పడిన యూత్ బెంబేలెత్తిపోతున్నారు. సో ఇప్పుడిక వీరికి స్వేచ్ఛ దొరికినట్టే.. అయితే శృంగారానికి కొన్ని నియమ నిబంధనలను కచ్చితంగా ఫాలో అవ్వాల్సిందేనని లేకపోతే చిక్కులు పడతారని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
మీ పార్ట్ నర్ గురించి ముందుగా బాగా తెలుసుకోమని చెబుతున్నారు. తనకు వైరస్ సమస్యల మీద ఎంత వరకు అవగాహన ఉంది. తను ఎవరెవరితో చురుగ్గా కలుస్తుంది. ఎవరెవరితో సంబంధాలున్నాయన్న విషయాలు తెలిసి ఉంటే మంచిది.
అప్పుడే ఆ స్త్రీ లేదా పురుషుడితో శృంగారం అంత సేఫ్ గా ఉంటుందట.
అయితే ఎంత తెలిసిన వ్యక్తులైనా కిస్సులు, హగ్గులను కాస్త తగ్గించుకోవడమే బెటర్. ఇక ఎక్కువమందితో డేటింగ్ చేయడం లాంటి వైల్డ్ కోరికలకు గుడ్ బై చెప్పడం చాలా చాలా ముఖ్యం.
బాగా తెలిసిన వ్యక్తులతో తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త వారితో సంబంధాలు పెట్టుకోకపోవడం, ముఖ్యంగా శృంగారం విషయంలో చాలా ముఖ్యం అంటున్నారు.
కొత్త వ్యక్తికి అసిప్టమాటిక్ అయి ఉంటే వారితో పాటూ మీరూ ప్రమాదంలో పడతారన్న విషయం గుర్తు పెట్టుకోవాలి.
మీ భాగస్వామి మాస్క్ తప్పనిసరిగా వాడుతున్నారా, వైరస్ టెస్ట్ చేయించుకున్నారా? ఏమైనా లక్షణాలున్నాయా? శానిటైజర్ రెగ్యులర్ గా వాడతారా? అనే విషయాలు తప్పనిసరి తెలుసుకోవాలి.
మీ భాగస్వామి శుభ్రత విషయంలో ఎంత వరకు జాగ్రత్తగా ఉంటారో తెలుసుకోండి.
ఇక చివరగా శృంగారంలో పాల్గొనే ముందు ముద్దులకు వీలైనంత దూరంగా ఉండడం అన్నింటికంటే బెటర్ అని చెబుతున్నారు. సో ఈ జాగ్రత్తలు పాటిస్తే డేటింగ్ అయినా మేటింగ్ అయినా నో డేంజర్ అట..