మనిషి ఆరోగ్యానికి శృంగారం ఎంతో అవసరం. ఒక వయసు వచ్చిన తరువాత మొదలయ్యే శృంగార కోరికలు పురుషుల్లో వయస్సుతోపాటే మారుతుంటాయట. వయసును బట్టి లైంగిక కోరికలు, లైంగిక సామర్థ్యాల్లో మార్పు వస్తుందని తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో తేలింది.
ముఖ్యంగా పురుషుల శృంగార సామర్థ్యాన్ని పట్టిచ్చే అంగస్తంభనల విషయంలో ఈ మార్పు ఎక్కువగా ఉంటుందని తేలింది. ఎక్కువ సేపు సెక్స్ చేసే పురుషులనే భాగస్వామి ఎక్కువ ఇష్టపడతారు. ఇంకా చెప్పాలంటే నేటి తరంతో పోల్చితే మన పూర్వీకులే ఎక్కువ సేపు సెక్సులో పాల్గొనేవారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
దీన్ని బట్టి మారుతున్న కాలం అన్ని విషయాలతో పాటు శృంగారం మీద కూడా దాని ప్రభావాన్ని చూపినట్టుగా తెలుస్తుంది. రకరకాల కారణాల వల్ల పురుషుల మానసిక స్థితి మారిపోతోంది.
దీనికి అందుబాటులో ఉంటున్న పోర్న్ వీడియోలు కూడా ఓ కారణమే. వీటి కారణంగా అంగస్తంభన సమస్యలు పెరుగుతున్నాయని కూడా తేలింది.
ఇక వీటిని వదిలేస్తే అసలు పురుషుల జీవితంలో శృంగారం వయస్సును బట్టి మారుతుందా? ఏ వయస్సులో ఎలా ఉంటుంది? దీనిపై నిపుణులు ఏమంటున్నారు? అధ్యయనంలో ఏం తేలింది అనే విషయాలమీద ఓ లుక్కేద్దాం.
20 ఏళ్ల వయస్సులో పురుషులు మాంచి ఉత్సాహంతో ఉంటారు. ఏదో చేయాలనే తపన.. నిలవనివ్వని కోరికలతో వీరిలో శృంగార వాంఛలు తీవ్రంగా ఉంటాయి.
అంతేకాదు ఎలాంటి ప్రమేయం లేకుండానే ఈ వయస్సులో అంగస్తంభన కలగడం వల్ల శృంగార ఆలోచనలు ఎక్కువ అవుతాయి. అంగం పదే పదే స్తంభిస్తూ ఇబ్బంది పెడుతుంది. దీనివల్ల శీఘ్ర స్కలన సమస్యలు పెద్దగా వేదించవు. అందుకే మంచి సెక్స్‌ను ఎంజాయ్ చేయాలంటే.. ఈ వయస్సే కరెక్ట్.
ఇక 30 ఏళ్ల వయస్సులో శృంగారం మీద ఒక అవగాహన ఉంటుంది. ఎలా పడితే అలా కాకుండా కోరికలను కంట్రోల్ చేసుకోగలుగుతారు.
శృంగార కోరికలు ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంటాయి. ముందులా కాకుండా ఈ వయస్సులో తరచుగా అంగస్తంభనలు జరగవవు. అవసరమైనప్పుడు మాత్రమే అంగం స్తంభిస్తుంది. ఈ వయస్సులో కూడా చక్కటి లైంగిక జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు.
40 ఏళ్ల వయస్సులో శరీరంలో జరిగే మార్పులతోనే శృంగారం కోరికల్లోనూ మార్పులు వస్తాయి. 20, 30 లతో పోల్చితే.. ఈ దశలో అంగస్తంభన సాధారణంగా ఉంటుంది. కొంతమందిలో చిన్నపాటి అంగస్తంభన సమస్యలు కూడా ఈ వయసులో మొదలవుతాయి. ఈ వయస్సులో కూడా రెచ్చిపోయి మంచి శృంగారం చేయాలంటే.. తప్పకుండా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా మీ శృంగార సామర్థ్యం మీద డౌట్ పడాల్సి ఉంటుంది.
50 ఏళ్ల వయస్సులో కూడా శృంగారం చేయగలుగుతారు. కాకపోతే, శృంగార కోరికలు తగ్గుతాయి. పిల్లలున్నవాళ్లు బాధ్యతల వల్ల శృంగారం గురించి పెద్దగా పట్టించుకోరు. ఈ వయస్సులో అంగస్తంభన సమస్యలు మామూలే. కానీ, అవసరమైన సమయంలో తప్పకుండా అంగస్తంభన జరుగుతుంది. కాకపోతే దీనికి కూడా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం.
60 ఏళ్ల వయస్సులో లైంగిక కోరికలే కాదు, సెక్స్ సామర్థ్యం కూడా తగ్గుతుంది. అంగం స్తంభన సమస్యలు సాధారణం కంటే ఎక్కువ అవుతాయి. కానీ, ఈ సమస్య కొందరిలో మాత్రమే ఉంటుంది. ఈ వయస్సులో ఆరోగ్య సమస్యలు కూడా శృంగార సామర్థ్యంపై ప్రభావం చూపుతాయి. అంగస్తంభనకు కోసం కాస్త ఎక్కువ ప్రయత్నిస్తే శృంగారంలో పాల్గోవచ్చు.
70 ఏళ్ల వయస్సులో శృంగార కోరికలు దాదాపు కనుమరుగు అవుతాయి. అంగ స్తంభనలు చాలా అరుదు. మాంచి ఆరోగ్యంతో ఉండే వ్యక్తులు ఈ వయస్సులోనూ శృంగారం చేయగలగుతారు. అంగం దానంతట అదే స్తంభించడం ఈ వయస్సులో కష్టం.
వీరిని భాగస్వామి ప్రేరేపించాల్సి ఉంటుంది. అయితే, మీ జీవనశైలి ఆరోగ్యకరంగా ఉన్నట్లయితే.. 80లో కూడా 40 ఏళ్ల వ్యక్తిలా శృంగారాన్ని ఆస్వాదించవచ్చు. కాబట్టి.. మంచి అలవాట్లు, చక్కని వ్యాయమంతో మీ శృంగార జీవితాన్ని కూడా కాపాడుకోండి. శృంగారమనేది కోరిక కాదు.. ఎన్నో మానిసిక శరీరక సమస్యలను దూరం చేసే చక్కని ఔషధం.