పీరియడ్ సెక్స్ సురక్షితమే.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం..

First Published | Jul 18, 2023, 9:43 AM IST

పీరియడ్ సెక్స్ పూర్తిగా సురక్షితం. ఇది పీరియడ్ తిమ్మిరిని తగ్గిస్తుంది. నొప్పి నుంచి కాస్త ఉపశమనం కలిగిస్తుంది. అయితే ఈ సమయంలో సెక్స్ చేసేటప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఎన్నో  సమస్యలు వస్తాయి.
 

నెలకోసారి ఖచ్చితంగా పీరియడ్స్ వస్తుంటాయి. ఇది సర్వసాధారణం. అయితే ఈ సమయంలో కొంతమంది జంటలు సెక్స్ కు దూరంగా ఉంటారు. కానీ మరికొందరు మహిళలు పీరియడ్ సెక్స్ ను బాగా ఇష్టపడతారు. పీరియడ్స్ సమయంలో సెక్స్ చేయడం సురక్షితమేనా అన్ని డౌట్ చాలా మందికి వస్తుంటుంది. నిపుణుల ప్రకారం..  పీరియడ్ సెక్స్ పూర్తిగా సురక్షితం. అయితే ఈ సమయంలో సెక్స్ చేసేటప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పీరియడ్స్ సమయంలో కొన్ని సందర్భాల్లో శృంగారానికి దూరంగా ఉండాలని కూడా ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. పీరియడ్ సెక్స్ ను సురక్షితంగా చేయడానికి ఎలాంటి చిట్కాలను ఫాలో కావాలో  ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

సంభాషణ చాలా అవసరం

పీరియడ్స్ కు ముందు, ఆ సమయంలో భాగస్వామితో మాట్లాడటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ సమయంలో మీరు సెక్స్ చేయడానికి ఎలా సౌకర్యవంతంగా ఉన్నారో మీ భాగస్వామికి చెప్పండి. పీరియడ్స్ లో స్త్రీలు కొన్ని సెక్స్ భంగిమలకు దూరంగా ఉంటారు. అలాగే కొంత నెమ్మదిగా సెక్స్ ను కోరుకుంటారు. మీకు కూడా ఇలాంటివి అనిపిస్తే ఈ విషయాన్ని మీ భాగస్వామితో మొహమాటం లేకుండా చెప్పండి. 
 

Latest Videos



రక్షణ చాలా ముఖ్యం

పీరియడ్స్ సమయంలో సెక్స్ లో పాల్గొంటే గర్భందాల్చే అవకాశం లేదని చాలా మంది అనుకుంటారు. అందుకే ఈ సమయంలో కండోమ్ ను వాడరు. కానీ ఇందులో నిజం లేదంటున్నారు నిపుణులు. నిపుణుల ప్రకారం.. ఇది అస్సలు సురక్షితం కాదు. చాలా సార్లు మహిళలు పీరియడ్స్ లో గర్భం దాల్చారు. కానీ కొన్ని కొన్ని సార్లు గర్భందాల్చే అవకాశం లేకపోలేదు. అంతేకాకుండా రక్షణ లేకుండా సెక్స్ చేయడం వల్ల అనేక సన్నిహిత, లైంగిక ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది. పీరియడ్స్ సమయంలో కండోమ్ ను వాడటం మానేయకూడదు. ఇది మీ ప్రైవేట్ భాగాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. 
 

షవర్ పీరియడ్ సెక్స్ 

పీరియడ్స్ బ్లడ్ బెడ్ షీట్ మీద పడకుండా ఉండేందుకు చాలా మంది  పీరియడ్ సెక్స్ కు కూడా దూరంగా ఉంటారు. అయితే మీరు బెడ్ షీట్ పై టవల్ వేసినా దానికి బ్లడ్ అంటుకునే అవకాశం ఉంది. ఇది చాలా చికాకు కలిగిస్తుంది. అపరిశుభ్రంగా కూడా ఉంటుంది. అందుకే ఈ సమయంలో షవర్ సెక్స్ మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. దీనివల్ల మీకు ఏ అంటుతుందోనన్న భయం కూడా ఉండదు. మీరు స్వేచ్ఛగా శృంగారాన్ని ఆస్వాదించవచ్చు. ఇది మరింత పరిశుభ్రంగా కూడా ఉంటుంది.
 

స్త్రీ ఉత్పత్తులను తొలగించడం మర్చిపోవద్దు

పీరియడ్స్ సమయంలో శృంగారంలో పాల్గొంటే శృంగారానికి ముందు మీ శానిటరీ ప్యాడ్ ను తొలగించడం చాలా ముఖ్యం. పీరియడ్స్ సమయంలో కొంతమంది మహిళలు టాంపోన్లు, కొన్ని ప్యాడ్లు,  మెన్స్ట్రువల్ కప్పులను ఉపయోగిస్తారు. కాబట్టి ఫోర్ ప్లే, సెక్స్ కు ముందు ఈ ఉత్పత్తులను తీసేయాలి. ఇలా చేయకపోవడం లేదా వాటిని తీసేయడం మర్చిపోతే మీకు పెద్ద సమస్య అవుతుంది. 
 

పీరియడ్ సెక్స్ ను ఆస్వాదించండి

పీరియడ్ సెక్స్ నిషిద్ధం కాదు. ఇది పూర్తిగా సాధారణం, సురక్షితం కూడా. పీరియడ్ సెక్స్ చేయాలనుకుంటే కొన్ని పరిశుభ్రత చిట్కాలను మాత్రం తప్పక పాటించాలి. పీరియడ్స్ సమయంలో హార్మోన్ల హెచ్చుతగ్గుల కారణంగా మీరు ఎక్కువ లైంగిక ఆనందాన్ని పొందుతారు. ఈ సమయంలో మీకు సెక్స్ పట్ల ఎక్కువ కోరిక ఉంటుంది. అంతే కాదు ఈ సమయంలో యోని చాలా మృదువుగా ఉంటుంది. అంటే ఇది సహజమైన కందెనలను విడుదల చేస్తుంది. ఇది మీ సెక్స్ ను మరింత మృదువుగా, ఆహ్లాదకరంగా చేస్తుంది.
 

పీరియడ్ సెక్స్ లో ఏం చేయకూడదు?

ఒకవేళ కండోమ్ అందుబాటులో లేకపోతే పీరియడ్ సెక్స్ ను చేయకపోవడమే మంచిది. ఎందుకంటే ఇది భాగస్వాములిద్దరికీ సంక్రమణను కలిగిస్తుంది. అంతే కాక ఇది ఎస్టీఐల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. 

దీనితో పాటుగా ఇద్దరు భాగస్వాములలో ఒకరికి ఏ రకమైన లైంగిక ఇన్ఫెక్షన్ ఉంటే పీరియడ్ సెక్స్ ను పూర్తిగా నివారించండి. లేదంటే మీ సంక్రమణ మరింత ఎక్కువవుతుంది. అలాగే ఇది మీ భాగస్వామికి కూడా సోకుతుంది. 

పీరియడ్స్ సమయంలో ఎక్కువ నొప్పి ఉంటే నొప్పి తగ్గుతుందనుకుని సెక్స్ లో పాల్గొనకండి. ఇలాంటి పరిస్థితిలో మీకు విశ్రాంతి అవసరం. ఇలాంటి సందర్భంలో శృంగారంలో పాల్గొనడం వల్ల నొప్పి తగ్గడానికి బదులు పెరుగుతుంది.
 

click me!