వాకింగ్ ఆరోగ్య ప్రయోజనాలు
శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాకుండా బరువును నియంత్రణలో ఉంచుకోవడానికి కూడా వాకింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ కొన్ని నిమిషాలు వాకింగ్ చేస్తే మీ మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. హృదయం కూడా బలపడుతుంది. ఒక వ్యక్తి ప్రతిరోజూ వాకింగ్ చేసే అలవాటు ఉన్న వారిలో వ్యాధుల బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుందని పలు అధ్యయనాల్లో సైతం వెల్లడైంది.
వాకింగ్, మెదడు ఆరోగ్యానికి మధ్య సంబంధం..
అధిక రక్తపోటు ఉన్నవారు, మధుమేహంతో బాధపడేవారు, గుండె సమస్య ఉన్నవారు.. ఇలా అందరికీ వాకింగ్ ఉత్తమ వ్యాయామం. ఇక వాకింగ్ మంచి నిద్ర కూడా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
మెదడు ఆరోగ్యానికి వాకింగ్ ప్రయోజనాలు
మెదడు ఆరోగ్యం:
ప్రతిరోజూ కొంత సమయం నడవడం మెదడును బాగా పనిచేయడానికి ప్రేరేపిస్తుందని స్టాన్‌ఫోర్డ్ పరిశోధన చెబుతోంది. మానసిక స్థితిని మెరుగుపరచడంతో పాటు ఒత్తిడిని తగ్గించడంలో వాకింగ్ సహాయపడుతుందని అధ్యయనంలో తేలింది. ప్రతిరోజూ నడిచే వారి సృజనాత్మకత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మీరు నడుస్తున్నప్పుడు మీ మెదడు చురుగ్గా ఉండటమే కాకుండా సృజనాత్మకంగా కూడా ఆలోచిస్తుంది. అలా అని గంటల తరబడి నడవాల్సిన పనికూడా లేదు రోజుకు 10 నుంచి 15 నిమిషాలు నడిచినా సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
వాకింగ్ తో చిత్తవైకల్యానికి చెక్..
బరువు తగ్గడానికి!
మీరు బరువును నియంత్రణలో ఉంచుకోవాలనుకుంటే ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వాకింగ్ చేయాలి. మీరు ఎంత వేగంగా నడుస్తారో, దానికి అనుగుణంగా కేలరీలు కరిగిపోతాయి. వేగంగా నడిచినప్పుడు ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. మీ జీర్ణక్రియ వేగవంతమవుతుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రాకుండా ఉండటానికి వాకింగ్ సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి: 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండానే, పూర్తి వివరాలు
వాకింగ్ వల్ల మెదడుకు కలిగే ప్రయోజనాలు
తిన్న తర్వాత చిన్న నడక:
మీరు ప్రతిరోజూ తిన్న తర్వాత కనీసం 15 నిమిషాలు నడిస్తే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలోకి వస్తుంది. భోజనం తర్వాత 15 నిమిషాలు మితమైన వేగంతో నడవడం వలన మీ కండరాలు గ్లూకోజ్‌ను గ్రహించడంలో సహాయపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ పద్ధతిని పాటిస్తే వారి ఆరోగ్యానికి మంచి ఫలితం ఉంటుంది. చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుకోవడానికి మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజూ తిన్న తర్వాత నడవడం అలవాటు చేసుకోవాలి. వాకింగ్ చేయడం వలన మీ జీవక్రియ పెరిగి బరువు తగ్గడమే కాకుండా, శక్తిని కూడా పెంచుతుంది.