నాగార్జున స్థానంలో రానా?.. బిగ్‌బాస్‌ 5 హోస్ట్ మారుతున్నాడా?.. షాకిస్తున్న లేటెస్ట్ న్యూస్‌?

First Published | Jun 29, 2021, 2:09 PM IST

`బిగ్‌బాస్‌` ఐదో సీజన్‌ కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా ఫైనల్‌ అవుతున్నట్టు సమాచారం. ఇంతలో ఓ షాకింగ్‌ న్యూస్‌ బయటకు వచ్చింది. హోస్ట్ గా నాగార్జున స్థానంలో రానా రాబోతున్నారనే వార్త వైరల్‌ అవుతుంది. 

బిగ్‌బాస్‌ టీవీ షోస్‌లో అత్యంత పాపులర్‌ షో. `మీలో ఎవరు కోటీశ్వరుడు` కంటే బాగా పాపులర్‌ అయ్యింది. దాదాపు వంద రోజులపాటు మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చే ప్రోగ్రామ్‌గా నిలిచింది. కరోనా నేపథ్యంలో మరింత క్రేజ్‌ని సొంతం చేసుకుంది.
బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌కి ఎన్టీఆర్‌ హోస్ట్ గా చేశారు. ఇది బాగా ఆదరణ పొందింది. ఎన్టీఆర్‌ తనదైన ఎనర్జీతో షోని రక్తికట్టించాడు. మొదటి సీజన్‌లో శివ బాలాజీ విన్నర్‌గా నిలిచాడు.

రెండో సీజన్‌లో నాని హోస్ట్ గా చేశాడు. ఎన్టీఆర్‌ స్థానంలో నానిని తీసుకున్నారు. ఎన్టీఆర్‌ నో చెప్పడంతో నానితో చేయించారు. ఆ షో కూడా బాగానే ఆదరణ పొందింది. అందులో కౌశల్‌ విన్నర్‌గా నిలిచాడు.
బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లో మళ్లీ హోస్ట్‌ని మార్చాడు. నాగార్జునని తీసుకున్నారు. నాగ్‌ చేసిన `మీలో ఎవరు కోటీశ్వరుడు` బాగా పాపులర్‌ అవ్వడమేకాదు, మంచిరేటింగ్‌తో దూసుకుపోతుంది. దీంతో నాగ్‌ అయితే పర్‌ఫెక్ట్ సూట్‌ అవుతారని భావించారు. నిజంగానే బిగ్‌బాస్‌3ని అదరగొట్టాడు నాగ్‌.
దాన్నే కంటిన్యూ చేస్తూ బిగ్‌బాస్‌4ని పూర్తి చేశారు. అయితే హోస్ట్ విషయంలో సమంత వంటి పలువురు పేర్లు వినిపించినా నాగార్జునే షోని పూర్తి చేశారు. ఇందులో అభిజిత్‌ విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
అయితే బిగ్‌బాస్‌5 సీజన్‌లో హోస్ట్ మారుతున్నారనే వార్త ఇప్పుడు షాక్‌ ఇస్తుంది. నాగార్జున స్థానంలో రానాని తీసుకోబోతున్నారట. నాగార్జున వరుసగా సినిమాల కమిట్‌మెంట్స్ ఉన్నాయి. పైగా ఇటీవల ఆయన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. దీంతో పూర్తిగా సినిమాలపై ఫోకస్‌ పెట్టారట. అందులో భాగంగా బిగ్‌బాస్‌ని వదులుకుంటున్నట్టు ఓ వార్త సోషల్‌ మీడియాలో వినిపిస్తుంది.
దీంతో ఆ స్థానంలో రానాని తీసుకోవాలనుకుంటున్నారట. రానా హోస్ట్ గా సక్సెస్‌ అయ్యారు. `నెంబర్ 1 యారీ రానా` షో బాగా ఆదరణ పొందింది. దీంతో బిగ్‌బాస్‌ 5 సీజన్‌కి ఆయన్ని హోస్ట్ గా తీసుకోవాలని స్టార్‌ మా భావిస్తుందట. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాలి.
అయితే తన స్టూడియోలో, తన సమక్షంలో జరిగే `బిగ్‌బాస్‌`ని నాగ్‌ ఎందుకు వదులుకుంటాడనేది ఇప్పుడు ప్రశ్న. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే. బిగ్‌బాస్‌ 5ని జులైలోగానీ, ఆగస్టులోగాని ప్రారంభించే అవకాశాలున్నాయట. దీనికి సర్వం సిద్ధమైందని టాక్‌.
ఇదిలా ఉంటే `బిగ్‌బాస్‌5` సీజన్‌లో కంటెస్టెంట్‌గా క్రేజీ ఆర్టిస్టుల పేర్లు వినిపిస్తున్నాయి. మంగ్లీ, యూట్యూబ్‌ స్టార్‌ శణ్ముఖ్‌, టిక్‌టాక్‌ దుర్గారావు, యాంకర్‌ రవి, శేఖర్‌ మాస్టర్‌, యాంకర్‌ వర్షిణి, సురేఖ వాణి వంటి పేర్లు వినిపిస్తున్నాయి.

Latest Videos

click me!