షో నుండి బయటకు వచ్చాక ఆమెకు ఆఫర్స్ పెరిగాయి. డిజిటల్ సిరీస్లు, చిత్రాల్లో ప్రధాన రోల్స్ చేస్తుంది. అలాగే స్టార్ హీరోల చిత్రాల్లో కీలక రోల్స్ చేస్తుంది. కెరీర్ బిగినింగ్ లో దివి స్మాల్ బడ్జెట్ చిత్రాల్లో హీరోయిన్ గా చేసింది. వాటి గురించి ప్రేక్షకులకు తెలిసింది తక్కువే. మహర్షి చిత్రంలో కాలేజ్ స్టూడెంట్ పాత్రలో తళుక్కున మెరిసింది. ఆ చిత్రంలో దివికి చెప్పుకోదగ్గ స్క్రీన్ స్పేస్ ఉంది. అయినప్పటికీ మహర్షి మూవీ ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు.