సంప్రదాయ దుస్తుల్లో అందాల గ్లోరీ.. మతులు పోగొట్టే ఫోజులిస్తూ మైమరిపిస్తున్న ‘బిగ్ బాస్’ అరియానా..

First Published | Oct 4, 2023, 5:32 PM IST

బిగ్ బాస్ ఫేమ్ అరియానా గ్లోరీ సంప్రదాయ దుస్తుల్లో వెలిగిపోతోంది. హాఫ్ శారీలో తన బ్యూటీఫుల్ తో మంత్రముగ్ధులను చేస్తోంది. మత్తెక్కించే ఫోజులతోనూ మైమరిపిస్తోంది. 
 

యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన అరియానా గ్లోరీ (Ariyana Glory)  సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఆర్జీవీ చేసిన కామెంట్ ఈ ముద్దుగుమ్మ కెరీర్ కు బూస్ట్ నిచ్చింది. దాంతో బిగ్ బాస్ లో అవకాశం  దక్కించుకుంది.
 

పాపులర్ రియాలిటీ షో Bigg Boss Telugu కు కింగ్, అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ రియాలిటీ షోలో సీజన్ 4, 5లో అరియానా పార్టిసీపేట్ చేసింది. రెండు సీజన్లతో అలరించినా.. టైటిల్ ను మాత్రం సాధించలేకపోయింది. కానీ ఆమె ఆటతీరుతో ఆకట్టుకుంది. 
 


బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకి వచ్చాక మరింత క్రేజ్ దక్కించుకుంది. పలు షోల్లో మెరుస్తూ వస్తోంది. ఇక సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా కనిపిస్తోంది. ఫొటోషూట్లు, రీల్స్ తో ఆకట్టుకుంటోంది. ఇటీవల కాస్తా బరువు పెరిగిన అరియానా మరింతగా అట్రాక్ట్ చేస్తోంది. బొద్దుగా మారి మైమరిపిస్తోంది.
 

తాజాగా అరియానా బ్యూటీఫుల్ లుక్ లో మెరిసింది. పింక్ హాఫ్ శారీలో దర్శనమిచ్చింది. పట్టుపరికిణీలో ఆకర్షణీయమైన బంగారు నగలు ధరించి మరింత అందాన్ని సొంతం చేసుకుంది. బ్యూటీఫుల్ లుక్ తో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను కట్టిపడేసింది. రీసెంట్ ఫెస్టివల్ కోసం ఇంత అందంగా రెడీ అయ్యింది.
 

ఇలా వరుస ఫొటోషూట్లతో అరియానా నెట్టింట దర్శనమిస్తూనే వస్తోంది. ట్రెండీ వేర్ అయినా.. ట్రెడిషనల్ వేర్ అయినా ఈ ముద్దుగుమ్మ అందాల ధాటితోనూ అదరగొడుతోంది. తాజాగా పంచుకున్న పిక్స్ లో నడుము అందాలు, మత్తెక్కించేలా ఫోజులిచ్చి కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేసింది. 

ఇదిలా ఉంటే.. అరియానా బుల్లితెరపై వరుస షోలతో ఆడియెన్స్ ను అలరిస్తోంది. ఇప్పటికే ‘బీబీకెఫే’, ‘బీబీ జోడీ’ వంటి షోలతో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం జీతెలుగులో ప్రసారం కానున్న Telugu Medium  Ischool రియాలిటీ షోతో రాబోతోంది. రీసెంట్ గానే సన్నీ లియోన్ ఈ షోను గ్రాండ్ గా లాంచ్ చేశారు. త్వరలో షో డిటేయిల్స్ అందనున్నాయి. 

Latest Videos

click me!