ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న అనుష్క శర్మ విరాట్ కొహ్లీని మూడేళ్ళ క్రితం పెళ్ళి చేసుకుంది. కొన్నాళ్ళు ప్రేమించుకుని పెళ్ళి చేసుకుందీ క్రేజ్ కపుల్. ప్రస్తుతం అనుష్క శర్మ ప్రెగ్నెంట్‌తో ఉంది. జనవరిలో వీరి జీవితంలోకి మరో వ్యక్తి రాబోతున్నారు.
బాలీవుడ్ అనుష్క శర్మ అంటే నటనకు, అందానికి మారుపేరు. అత్యంత తెలివైన, మంచి నటనా కౌశలం కలిగిన నటి. ఎప్పుడూ నవ్వు ఫేస్‌తో ఆకట్టుకుంటుంది. అంతే చలాకీగా, చురుకుగా ఉంటూ అలరిస్తుంటుంది. మరి ఈ సెక్సీ బ్యూటీ విరాట్‌తో మ్యారేజ్‌కి ముందు అనుష్క శర్మ నలుగురు హీరోలతో డేట్‌కి వెళ్ళిందనే వార్తలు గుప్పుమన్నాయి.
మొదటగా ఈ భామ ర్యాంప్ మోడల్ జోహెబ్ యూసుఫ్‌తో ప్రేమాయణం సాగించినట్టు వార్తలొచ్చాయి. తాను మోడలింగ్ చేసే టైమ్‌లో జోహెబ్ బెంగుళూరులో పరిచయం అయ్యారట. రెండేళ్ళపాటు వీరిద్దరు కలిసి తిరిగారు. అనుష్కకి హీరోయిన్‌గా స్టార్ స్టేటస్ రావడంతో జోహెబ్‌ని పక్కన పెట్టినట్టు వార్తలొచ్చాయి.
ఆ తర్వాత అనుష్క.. క్రికెటర్ సురేన్ రైనాతో చనువుగా మెలిగింది. అనుష్క సోదరుడు క్రికెట్ ప్లేయర్. అతనితో కలిసి వెళ్ళినప్పుడు సురేష్ రైనాతో పరిచయం ఏర్పడిందట. అలా ఈ ఇద్దరు కలిసి తిరిగినట్టు సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొట్టాయి. అయితే అనుష్క విషయంపై సురేష్ రైనా స్పందించి అనుష్క అంటే ఇష్టమని తెలిపారు. దీంతో పుకార్లకి బలం చేకూరినట్టయ్యింది. కానీ అనుకోకుండా వీరిద్దరు దూరమయ్యారు.
సహనటుడు రణ్‌వీర్ సింగ్‌తోనూ అనుష్క కొన్నాళ్లు డేటింగ్‌కి వెళ్లిందని బాలీవుడ్‌లో వార్తలు వైరల్ అయ్యాయి. వీరిద్దరు కలిసి పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా పండటంతో రియల్ లైఫ్ కెమిస్ట్రీ విషయంలో బాగుందని వార్తలొచ్చాయి. అనుష్కకి రణ్‌వీర్ బాలీవుడ్‌కి చెందిన తొలి బాయ్ ఫ్రెండ్ కావడం విశేషం. ఏమైందో ఏమో కొన్ని రోజుల్లోనే వీరు దూరమయ్యారు.
రణ్‌వీర్‌ని వదిలేసి రణ్‌బీర్‌ని పట్టుకుంది అనుష్క. ఆయనతో కలిసి సినిమాలు చేయడమే కాదు, బయట కూడా తిరిగారు. కరణ్ జోహార్ పార్టీలతోపాటు ఇతర పార్టీలకు కూడా వీరిద్దరు కలిసి వెళ్ళారు.
ఆ తర్వాత అర్జున్ కపూర్‌తోనూ నైట్ పార్టీలకు వెళ్లింది అనుష్క. దీంతో చాలా సందర్బాల్లో ఫోటోలకు దొరికిపోయారు. కలిసి ఎంజాయ్ చేశారు. చివరకు అర్జున్‌కి కూడా బ్రేకప్ చెప్పి ఇండియన్ క్రికెటర్, టీమిండియా కెప్టెన్ విరాట్ ప్రేమలో పడి ఆయన్ని పెళ్ళి చేసుకుంది.