చాలా కాలంగా ఈ బ్యూటీ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ మెల్విన్ లూయిస్ తో డేటింగ్ లో ఉంది. తరచూ ఇద్దరూ కలిసి తీసుకున్న ఫోటోలను షేర్ చేస్తూ తమ ప్రేమ సంగతులను అభిమానులతో పంచుకునేవారు.
తెలుగులో కళ్యాణ్ రామ్ నటించిన 'కత్తి' సినిమాలో హీరోయిన్ గా నటించిన సనా ఖాన్ ఆ తరువాత 'గగనం' సినిమాలో చిన్న పాత్ర పోషించింది. చాలా కాలంగా ఈ బ్యూటీ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ మెల్విన్ లూయిస్ తో డేటింగ్ లో ఉంది. తరచూ ఇద్దరూ కలిసి తీసుకున్న ఫోటోలను షేర్ చేస్తూ తమ ప్రేమ సంగతులను అభిమానులతో పంచుకునేవారు.
అయితే ఇప్పుడు మెల్విస్ తనను మోసం చేశాడని.. మరొకరితో రిలేషన్ లో ఉన్నాడని మీడియాతో వెల్లడించింది సనా ఖాన్. తను ఎంతో ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి మరో అమ్మాయితో రాసలీలలు కొనసాగిస్తుంటే మోసపోయానని గ్రహించిన సనా మీడియా ముందుకు వచ్చింది.
undefined
పన్నెండేళ్ల కూతురుంది.. ఇప్పుడు రెండో పెళ్లేంటి..? నటిపై అసభ్యకర కామెంట్స్!
మెల్విన్ ని తను ప్రేమిస్తే అతడు మాత్రం తనకు బాధనిచ్చాడని.. ఇప్పటికీ ఈ బాధ నుండి కోలుకోలేకపోతున్నానని.. డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని చెప్పారు. అతడు ఎవరితో ప్రేమలో ఉన్నాడో కూడా తనకు తెలుసునని.. కానీ ఆ అమ్మాయి పేరు బయటపెట్టడం ఇష్టం లేదని అన్నారు.
మెల్విన్ తో తను ప్రేమలో ఉన్నప్పుడు చాలా మంది అతడి గురించి చెబితే నమ్మలేదని.. గుడ్డిగా అతడిని నమ్మి ప్రేమించానని అన్నారు. ఒకరోజు అతడి ఫోన్ చెక్ చేస్తుంటే వెంటనే లాక్కొని మెసేజ్ లు డిలీట్ చేయడం మొదలుపెట్టాడని.. అప్పుడే అతడు తనను మోసం చేస్తున్నాడని అర్ధమైందని చెప్పారు.
శారీరకంగా అతడికి బ్రేకప్ చెప్పినా.. తన మనసంతా ఇంకా అతడే ఉన్నాడని.. పెళ్లి చేసుకోవాలని భావిస్తే ఇప్పుడు తనను ఇలా మోసం చేస్తాడని కలలో కూడా ఊహించలేదని ఎమోషనల్ అయ్యారు.