విశాఖఫట్నంలో ఓ డ్రగ్స్ రాకెట్ ముఠా పోలీసులకు చిక్కింది. ఈ ముఠాలో ఉన్నత విద్యావంతుడైన ఓ విద్యార్థితో పాటు అతడి ప్రేయసి కూడా వుండటం సంచలనంగా మారింది.
విశాఖపట్నం: అతడో ఉన్నత విద్యావంతడు. మెరైన్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన అతడు హాయిగా ఉద్యోగం చేయకుండా అత్యాశకు పోయి డ్రగ్స్ డీలర్ గా మారాడు. విశాఖపట్నంలో ఉన్నత వర్గాలకు చెందిన యువతనే టార్గెట్ గా చేసుకుని మత్తుపదార్థాలను విక్రయిస్తున్నాడు. తాజాగా ఈ విషయం పోలీసులకు తెలియడంతో అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు.
ఇలా విశాఖ పోలీసులు ఓ డ్రగ్స్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని డాబ గార్డెన్స్ లో డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్న టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారంతో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా డ్రగ్స్ తో పాటు నలుగురు ముఠా సభ్యులు పట్టుబడ్డారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఈ డ్రగ్స్ ముఠాకు సంబంధించిన వివరాలను నగర పోలీస్ కమీషనర్ ఆర్కే మీనా మీడియాకు వెల్లడించారు. ఈ డ్రగ్స్ ముఠా బెంగళూరు, గోవాలకు గంజాయిని సరఫరా చేసి అక్కడి నుంచి విశాఖకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తమ విచారణలో తేలిందని వెల్లడించారు. ఇలా తీసుకువచ్చి విక్రయిస్తున్న ఏం.డి.ఎం.ఎ 1 గ్రాం, ఎల్.ఎస్.డి బ్లోట్ 02, గంజా జిప్ లాక్ 20, గంజాయి 2 కేజీలు, అల్ఫాజోమ్ టాబ్లెట్స్ 30 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
read more లోకేశ్ మగాడు...జగన్ మగాడో కాదో నువ్వే తేల్చాలి...: బుద్దా వెంకన్న ఫైర్
ఈ నలుగురి నిందితుల్లో నరేంద్ర అలియాస్ విక్కీ విజయవాడ ప్రాంతానికి చెందిన ఇంజనీరింగ్ పట్టభద్రుడని కమీషనర్ వెల్లడించారు. అతడు తమిళనాడులోని ఆర్ఎల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మధురాయ్ లో మెరైన్ ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసినట్లు తెలిపారు. గతంలో కూడా ఇలాగే విక్కి డ్రగ్స్ సరఫరా కేసులో 9 నెలలు రిమాండ్ లో ఉన్నట్లు కమీషనర్ వివరించారు.
నలుగురి నిందితుల్లో విక్కీ గర్ల్ ఫ్రెండ్ సీతా అలియాస్ సిరి కూడా వున్నట్లు వెల్లడించారు. ఈ నలుగురు నిందితులను టాస్క్ పోర్స్ పోలీసులు రెండవ పట్టణ పోలీసులకు అప్పగించారు.
read more ఇసుక కొరతపై ప్రభుత్వం సీరియస్ యాక్షన్ ప్లాన్... సీఎం జగన్ ఆదేశాలతో కదలిక
ఇటీవలే విజయవాడ నగరంలో కూడా ఇలాగే డ్రగ్స్ ముఠాపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లోని సంపన్న కుటుంబాలకు చెందిన యువతీ యువకులకు డ్రగ్స్ సప్లై చేస్తున్న ఏడుగురు ముఠా సభ్యులను డీసీపీ హర్షవర్ధన్ రాజు సారథ్యంలోని పోలీస్ టీం అరెస్ట్ చేశారు. ఈ డ్రగ్స్ ముఠా నుండి 14 గ్రాముల డ్రగ్స్ ,రెండున్నర కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఈ ముఠా కూడా బెంగళూరులోనే రూ.2000-2500 రూపాయలకు ఈ డ్రగ్స్ కొనుగోలు చేసి రూ.4000 వేల రూపాయలకు విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు బయటపడింది. తాజాగా పట్టుబడిన ముఠా కూడా బెంగళూరు నుండే డ్రగ్స్ ను తీసుకువచ్చారు. దీంతో బెంగళూరు కేంద్రంగా డ్రగ్స్ విక్రయాలు విరివిగా సాగుతున్నట్లు అర్థమవుతోంది.