Sandeep Lamichhane: నేపాల్ స్టార్ క్రికెటర్ సందీప్‌ లమిచానే కెరీర్ ఖ‌తం.. !

By Mahesh RajamoniFirst Published Jan 11, 2024, 5:00 PM IST
Highlights

Sandeep Lamichhane: నేపాల్ స్టార్ క్రికెటర్‌ సందీప్‌ లమిచానే కెరీర్‌ ముగిసినట్లే ! ఆగస్టు 2022లో ఖాట్మండులోని ఒక హోటల్‌లో 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో లామిచానే ఇప్ప‌టికే దోషిగా తేల్చిన ఖాట్మండు జిల్లా కోర్టు.. తాజాగా అత‌నికి 8 ఏండ్ల జైలు శిక్ష విధించింది.
 

Nepal cricketer Sandeep Lamichhane: ఐపీఎల్ ప్లేయ‌ర్, నేపాల్ స్టార్ క్రికెటర్ సందీప్ లామిచానే కెరీర్ ముగిసినట్లే కనిపిస్తోంది. కెరీర్ సాఫీగా సాగుతున్న టైమ్ లో అత‌ని చేసిన ఒకపాడు ప‌ని కెరీర్ మొత్తాన్ని నాష‌నం చేసింది. లామిచానే అత్యాచారం కేసులో ఖాట్మాండ్ కోర్టు అత‌నికి ఎనిమిదేళ్ల జైలు శిక్షను విధించింది. న్యాయమూర్తి శిశిర్ రాజ్ ధకాల్ సింగిల్ బెంచ్ జైలు శిక్షను ఖరారు చేసింది. అలాగే, ధర్మాసనం అత‌నికి భారీ జరిమానా విధించింది.

లామిచానేను దోషిగా తేల్చిన ఖాట్మండు జిల్లా కోర్టు

Latest Videos

2022 ఆగస్టులో ఖాట్మండులోని ఓ హోటల్లో 17 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో సందీప్ లమిచానేను ఖాట్మండు జిల్లా కోర్టు దోషిగా తేల్చింది. అయితే, ఈ కేసుకు సంబంధించి అత‌ను 2023 జనవరిలో బెయిల్ పై బ‌య‌ట ఉన్నాడు. తాజాగా అత‌నికి కోర్టు ఏనిమిదేండ్ల శిక్ష‌ను ఖ‌రారు చేసింది. ఈ కేసును త్వరితగతిన విచారించాలని కోర్టు ముందు వాద‌న‌లు ఉండ‌టం, అత్యాచార ఆరోపణలు ఉన్నప్పటికీ, లామిచానే బెయిల్ పై ఉన్నప్పుడు నేపాల్ త‌ర‌ఫున ప‌లు టోర్నమెంట్లలో పాల్గొంటూ క్రికెట్ ఆడటం కొనసాగించాడు.

IND v AFG: భారత్-ఆఫ్ఘనిస్తాన్ తొలిమ్యాచ్ కు విరాట్ కోహ్లీ దూరం.. ఎందుకంటే..?

2022 అక్టోబర్ లో అరెస్టు.. బెయిల్ ! 

2022 అక్టోబర్ లో ఓ మైనర్ లైగింక‌దాడికి సంబంధించిన ఆరోపణల‌తో సందీప్ లామిచానేను పోలీసులు అరెస్టు చేశారు. 2023 జనవరిలో ఆయనను కోర్టు విడుదల చేసినప్పటికీ, న్యాయమూర్తి ఢాకాల్ నేతృత్వంలోని తుది విచారణల త‌ర్వాత దోషి తీర్పు వ‌చ్చింది. ఖాట్మండు జిల్లా ప్రభుత్వ అటార్నీ కార్యాలయం జాతీయ శిక్ష (కోడ్) చట్టం, 2017 ప్రకారం లామిచానేకు 12 సంవత్సరాల జైలు శిక్ష విధించాలని కోరింది. అయితే, విచార‌ణ‌ల త‌ర్వాత  ఎనిమిదేళ్ల శిక్ష‌ను కోర్టు విధించింది.

నేపాల్ తరుపున అంతర్జాతీయ క్రికెట్లో 210 వికెట్లు తీసిన సందీప్ లామిచానే..

సందీప్ లమిచానే నేపాల్ తరఫున 51 వన్డే క్రికెట్ మ్యాచ్ ల‌ను ఆడాడు. 18.06 సగటుతో 112 వికెట్లు పడగొట్టాడు. వ‌న్డ్లేల్లో అత‌ని అత్యుత్తమ ప్రదర్శన 6/11. అలాగే, ఎనిమిది సార్లు నాలుగు వికెట్లు కూడా తీసుకున్నాడు. నేపాల్ తరఫున టీ20ల్లో 12.58 స‌గ‌టుతో 98 వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో 9 ప‌రుగులు ఇచ్చిన 5 వికెట్లు తీసుకోవ‌డం అత‌ని కెరీర్ బెస్ట్.  మొత్తంగా సందీప్ లామిచానే త‌న క్రికెట్ కెరీర్ లో 200 ల‌కు పైగా వికెట్లు తీసుకున్నాడు. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) లో కూడా ఆడాడు.

ఇషాన్ కిషన్ ను జట్టు నుంచి తప్పించింది అందుకే... రాహుల్ ద్రవిడ్ కామెంట్స్ వైరల్

 

click me!