ఇష్టరాజ్యంగా రుణాల మంజూరు వల్లే యెస్ బ్యాంకు కొంప ముంచింది...

By Sandra Ashok KumarFirst Published Mar 8, 2020, 10:30 AM IST
Highlights

విచక్షణారహితంగా ముందూ వెనుక చూడకుండా ఇష్టరాజ్యంగా రుణాలు మంజూరు చేయడం, నియంత్రణ లేమి, పెట్టుబడుల సమీకరణపై ప్రణాళిక లేకపోవడం వంటి అంశాలు యెస్ బ్యాంకును సంక్షోభంలోకి నెట్టివేశాయి.
 

న్యూఢిల్లీ/ముంబై: ప్రపంచంలోకెల్లా దిగ్గజ బ్యాంకుల్లో ఒకటిగా నిలవాలన్న ఆశయంతో 2005లో యెస్ బ్యాంక్ ప్రారంభమైంది. రాణా కపూర్, అశోక్ కపూర్ సంయుక్తంగా బ్యాంకును స్థాపించారు. అనతికాలంలోనే వేగంగా అభివృద్ధి సాధించింది. అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుల్లో ఒక్కటిగా నిలిచింది.

అయితే ముందూ వెనుకా చూసుకోకుండా పారిశ్రామికవేత్తలకు భారీగా రుణాలను మంజూరు చేయడమే యెస్ బ్యాంకు కొంప ముంచిందన్న ఆరోపణలు విన వస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేని కంపెనీలకు భారీ రుణాలు లభించాయి. బ్యాంకు సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన అశోక్ కపూర్ 2008 ముంబై దాడుల్లో మరణించిన తర్వాత బ్యాంకు ప్రమోటర్‌గా రాణా కపూర్ వ్యవహరించినప్పటి నుంచి బ్యాంకు పతనం మొదలైందని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. 

ఏ ప్రభుత్వ రంగ బ్యాంకులోనూ రుణాలు లభించని కొన్ని సంస్థలకు యెస్ బ్యాంకులో మాత్రం అందాయి. సకాలంలో ఇచ్చిన రుణాలు చెల్లించకపోవడంతో యెస్ బ్యాంకు మొండి బాకీలు (ఎన్పీఎ) 7.4 శాతానికి చేరాయి. 

also read విచారణలో సహాయ నిరాకరణ.. ఈడీ కస్టడీలో రాణా కపూర్...?

యెస్ బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్న సంస్థల్లో కేఫ్ కాఫీ డే, సీజీ పవర్, జెట్ ఎయిర్వేస్, డీహెచ్ఎఫ్ఎల్, ఐఎల్ అండ్ ఎఫ్ఎస్, అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇన్ ఫ్రా, సుభాష్ చంద్ర ఎస్సెల్ గ్రూప్ పెద్దమొత్తంలో రుణాలు తీసుకున్నాయి. 

గత నెల ఒకటో తేదీలోగా వడ్డీని చెల్లించాల్సి ఉంది. కానీ ఆయా సంస్థలు విఫలమయ్యాయి. ఒక్క అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇన్ ఫ్రా ఏకంగా రూ.30 కోట్లు చెల్లించాల్సి ఉన్నా ఆ పని చేయలేదు.

ఇలా పరిస్థితులు అస్తవ్యస్తంగా మారంతో యెస్ బ్యాంకు ఆర్థిక స్థితి క్షీణించింది. కొన్నేళ్లుగా దిగజారుతూ వచ్చింది. ఒకవైపు పెట్టుబడి సేకరించుకోలేకపోవడం, మరోవైపు రుణాల జారీ బ్యాంకు స్థితిని దిగజార్చాయి. పెట్టుబడుల రాక తగ్గిపోగా, పెట్టిన పెట్టుబడుల ఉపసంహరణ పెరిగింది.

యెస్ బ్యాంకులో పాలనా సమస్య అతి పెద్దదిగా ఉంది. కొన్నేళ్లుగా యాజమాన్య నిర్ణయాల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. 2018-19లో బ్యాంకు మొండి బాకీలు రూ.3,277 కోట్లు ఉన్నాయి. ఈ సంగతి ఆర్బీఐ ప్రశ్నిస్తేనేగానీ బయట పడలేదు.

also read కొత్త చట్టాల అమలుతో నేడు 11:30కి తెలంగాణ బడ్జెట్

బ్యాంకు నిర్వహణ, బాలెన్స్ షీట్స్, ద్రవ్య లభ్యతపై నిరంతరం యెస్ బ్యాంకు యాజమాన్యంతో ఆర్బీఐ సంప్రదిస్తూనే ఉంది. బయట నుంచి పెట్టుబడులు సమకూర్చుకుంటున్నట్లు ఆర్బీఐకి తప్పుడు సమాచారం ఇచ్చి పెట్టుబడులు వస్తాయని ఆర్బీఐని నమ్మించింది.

డిపాజిటర్లు కూడా అధిక మొత్తంలో నగదు విత్ డ్రాయల్ చేసుకున్నారు. బ్యాంకు పరిస్థితిని గమనిస్తూ డిపాజిటర్లు తమ సొమ్ము విత్ డ్రా చేసుకున్నారు. గతేడాది సెప్టెంబర్ నాటికి మొత్తం డిపాజిటర్లు రూ.2.09 లక్షల కోట్లు విత్ డ్రా చేసేసుకున్నారు

రోజురోజుకు సంక్షోభంలో చిక్కుకున్న యెస్ బ్యాంకును పునరుద్ధరించేందుకు బ్యాంకు యాజమాన్యం వద్ద ఎలాంటి ప్రణాళికా సిద్ధంగా లేదు. తిరిగి వ్రుద్ధి చెందే అవకాశాలున్నా యాజమాన్యం చొరవ చూపలేదన్న విమర్శలు ఉన్నాయి. 

click me!