బడ్జెట్ 2024 : పాత, కొత్త పన్ను విధానాల మధ్య తేడాలేంటి.. మీకు ఏది బెస్టో చూడండి...

By SumaBala Bukka  |  First Published Feb 2, 2024, 8:22 AM IST

యేటా టాక్స్ కడుతుంటారు కానీ పాత పన్నువిధానం, కొత్త పన్ను విధానంలో తేడాలు చాలామందికి తెలియవు. డిఫాల్ట్ గా వచ్చిందో, తమ తోటివారు చెప్పిందో..ఫాలో అవుతుంటారు. అలా కాకుండా రెండు విధానాల గురించి తెలిస్తే మరింత ప్రయోజనం పొందవచ్చు.  


గురువారం నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన  మద్యంతర బడ్జెట్ పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి ఊరటను ఇవ్వలేదు. కొత్త పన్ను విధానం ఆదాయ పన్ను చెల్లింపు దారులకు డిఫాల్ట్ ఎంపికగా ఉంటుందని 2023 కేంద్ర బడ్జెట్ సమయంలో నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ క్రమంలోనే టాక్స్ చెల్లింపుల సమయంలో పాత పన్ను విధానాన్ని ఎంపిక చేసుకోకపోయినట్లయితే ఆటోమేటిక్ టీ కొత్త పన్ను విధానానికి ఎంపిక అవుతుంది.

పాత పన్ను విధానంలోకి తిరిగి రావాలనుకున్నా మార్చుకునే వీలు ఉండేది.  ఇక ఇలా పన్ను విధానాన్ని ఎన్నిసార్లు మార్చుకోవచ్చు అనేది.. వారి వృత్తిని బట్టి నిర్ణయిస్తారు. అయితే, మధ్యంతర బడ్జెట్ 2024లో పన్ను చెల్లింపుదారులకు యధాతదాస్థితిగా ఉండడంతో కాస్త నిరుత్సాహానికి గురయ్యారు. నిజానికి ఓల్డ్ టాక్స్ రిజైమ్, న్యూ టాక్స్ రిజైమ్ లలో తేడాలేంటి? దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుంటే అందులోని లాభనష్టాలు ఈజీగా అర్థమవుతాయి. 

Latest Videos

ఓల్డ్ టాక్స్ రిజైమ్ ( పాత  పన్ను విధానం) 
ఈ టాక్స్ డిజైన్ మీ ఆదాయంలో పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ విధానంలో దాదాపుగా 70% తగ్గింపులు, మినహాయింపులు ఉంటాయి. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద  లక్షన్నర వరకు మినహాయింపులకు అనుమతి కూడా ఇస్తుంది. ఇందులోనే 70శాతం తగ్గింపుల ద్వారా కవర్ చేయబడింది. కొత్త పన్ను విధానాన్ని అమలులోకి తీసుకొచ్చినప్పటికీ ఇది ఇంకా అమలులో ఉంది. పన్ను చెల్లింపు దారులు ఈ విధానాన్ని కూడా ఎంచుకోవచ్చు.

బడ్జెట్ 24 : బాలికల ఆరోగ్యానికి నిర్మలమ్మ రక్ష.. 9-14 యేళ్ల అమ్మాయిల ఆరోగ్యంపై స్పెషల్ ఫోకస్..

న్యూ టాక్స్ రిజైమ్ ( కొత్త పన్ను విధానం)
ఈ కొత్త పన్ను విధానాన్ని 2020 బడ్జెట్లో ప్రవేశపెట్టారు. దీంట్లో పాత పన్ను విధానంలో కంటే తక్కువ పన్ను రేట్లు ఉన్నాయి. పన్నులను క్రమబద్ధీకరణం చేయడం కోసమే ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. అయితే దీంట్లో సెక్షన్ 80 జేజేఏ అంటే వ్యాపార ఆదాయానికి అర్హత, 80సీసీడీ (2) కింద మాత్రమే మినహాయింపులు ఉన్నాయి. ఇవి కాకుండా ఎలాంటి తగ్గింపులు,  మినహాయింపులు అందుబాటులో లేవు.

2023లో దీన్ని డిఫాల్ట్ పన్ను విధానంగా మార్చారు. ఈ పన్ను విధానం ప్రకారం ప్రాథమిక మినహాయింపు పరిమితి పెరుగుతుంది. పన్ను రాయితీని ఏడు లక్షలకు పెంచారు. సర్ ఛార్జ్ తగ్గించారు. ప్రాథమికను మినహాయింపును పునరుద్ధరించారు. 

మీ అవసరాలను బట్టి ఈ రెండు విధానాల్లో మార్పులు చేసుకోవచ్చు. మీకు వచ్చే ఆదాయం రకం.. ఈ రెండు రిజైమ్ ల మధ్య ఎన్నిసార్లు మారాలనుకుంటున్నారు అనేదాన్ని బట్టి  మార్చుకోవచ్చు. అదెలా అంటే…

ఉద్యోగస్తులయితే…
నెలనెలా జీతం తీసుకునే ఉద్యోగస్తులు ప్రతి ఆర్థిక సంవత్సరంలో  కొత్త  లేదా  పాత పన్ను విధానాలలో ఏదైనా ఎంచుకోవచ్చు. అదే కొత్త పన్ను విధానం ఎఫ్ వై  23 -24 డిఫాల్ట్ పన్ను విధానం అయితే… తమకు వచ్చే ఆదాయాన్ని బట్టి పాత రీజెమ్ కు వెళ్ళవచ్చు.

వ్యాపారం లేదా ప్రొఫెషనల్ ఇన్కమ్ ఉన్నవాళ్లు,,,
ప్రొఫెషనల్ ఇన్కమ్.. లేదా వ్యాపారాలు చేస్తున్న వాళ్లు కూడా పాత కొత్త విధానాల్లో ఏదైనా ఎంచుకోవచ్చు. అయితే, ఇలాంటివారు ఒకటి కంటే ఎక్కువసార్లు అలా చేయడానికి వీలుకాదు. ఉదాహరణకు 2023 ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యాపారవేత్త  పాత పన్ను విధానం నుంచి కొత్త విధానానికి  మారితే.. మళ్లీ తిరిగి పాత పన్ను విధానానికి మార్చుకోలేరు. కొత్త పన్ను విధానం నుంచి పాత పన్ను విధానానికి మారితే..  తిరిగి మళ్లీ కొత్త పన్ను విధానానికి  మారలేరు.

మరి వీటిని ఎలా ఎంచుకోవాలి?
- ఏటా ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ నింపే క్రమంలో పాత లేదా కొత్త పన్ను విధానాన్ని ఎంచుకొని దానికి మీ అర్హతను..  మీ లాభాలను అంచనా వేసుకోవాలి.
- ఉద్యోగస్తులు అయితే  ఐటిఆర్ ఫాంలో   డైరెక్ట్ గా రిజైమ్ ని టిక్ పెట్టొచ్చు.  దీనివల్ల మిగతా వేరే ఏది అవసరం ఉండదు,
- ఇక వ్యాపారస్తులు.. వృత్తిపరమైన ఆదాయం ఉన్న వ్యక్తులైతే..  పాత పన్ను విధానం నుంచి కొత్త పన్ను విధానానికి… లేదా కొత్త పన్ను విధానాల నుంచి పాత పన్ను విధానానికి  తమ జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే మారే వీలుంటుంది.   అసెస్మెంట్ సంవత్సరంలో జూలై 31 లోపు ఈ ఫారం 10ఐఈని పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఉద్యోగస్తులు దీన్ని ఎలా ఎంపిక చేసుకోవాలంటే..
- ముందుగా ఐటిఆర్ ఫారం ని ఓపెన్ చేయాలి
- ఆ తర్వాత మీకు రెండు విధాల టాక్స్ రిజైమ్స్ కనిపిస్తాయి
- వాటిలో  మీకు ఏది వర్తిస్తుందో ఆ విధానాన్ని ఎంపిక చేసుకోవాలి
- ఆ తర్వాత ఐటిఆర్ లోని మిగిలిన విభాగాలను పూర్తి చేసి సమర్పించాలి

 వ్యాపారులైతే…
- ఫామ్ 10ఐఈ ని డౌన్లోడ్ చేసుకుని… పూర్తిగా నింపాలి
- అసెస్మెంట్ సంవత్సరం జూలై 31 లోపు దీనిని పూర్తి చేసి అప్లోడ్ చేయాలి
.- కొత్త పన్ను విధానం ఎంపిక చేసుకుంటే ఐటిఆర్ ని ఫైల్ చేయాలి.
 

click me!