హైదరాబాద్‌నే ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని, ఏపీ రాజధానిని విశాఖపట్నం తరలించే వరకు హైదరాబాద్‌నే ఏపీ రాజధానిగా ఉంచాలని వైసీపీ నేతలు డిమాండ్ చేయడం కలకలం రేపింది. ఇంతకీ మన దేశంలో ఉమ్మడి రాజధాని హైదరాబాద్ మాత్రమే ఉన్నదా? హైదరాబాద్ కాకుండా ఉమ్మడి రాజధానులు ఉన్నాయా?
Hyderabad: హైదరాబాద్ నగరాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా 2014లో ప్రకటించారు. ఏపీ పునర్వ్యవస్థకీరణ చట్టం 2014 ప్రకారం పదేళ్ల పాటు హైదరాబాద్ నగరం రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ఈ గడువు ముగిసినా.. వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధానిని విశాఖపట్నానికి మార్చుకునే వరకు హైదరాబాద్‌నే ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని అన్నారు. ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి.
ఈ నేపథ్యంలోనే మన దేశంలో ఉమ్మడి రాజధానిగానే కేవలం హైదరాబాద్ నగరమే సేవలు అందించిందా? మరేవైనా నగరాలు ఉమ్మడి రాజధానులుగా ఉన్నాయా? ఇందుకు సమాధానం ఉన్నాయనే వస్తుంది. మన దేశంలో చాలా రాష్ట్రాలకు సొంత రాజధానులు ఉన్నాయి. అయితే.. హైదరాబాద్ మాత్రమే ఉమ్మడి రాజధానిగా ఉన్న ఏకైక నగరం కాదు. ఎందుకంటే.. ఛండీగడ్ పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా సేవలు అందిస్తున్నది. ఇది ఉమ్మడి రాజధానే కాదు.. కేంద్ర పాలిత ప్రాంతం కూడా.
Also Read: YS Sharmila: రేవంత్‌తో షర్మిల భేటీ.. వైసీపీలో కలవరం.. భారీ మూల్యం తప్పదా?
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత హైదరాబాద్ నగరమే ఉభయ రాష్ట్రాలకు రాజధానిగా కొనసాగింది. అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తించేవరకు హైదరాబాదే రాజధానిగా ఉండింది. కానీ, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజధాని నగరాన్ని విశాఖపట్నానికి తరలించాలని అనుకుంది.
హైదరాబాద్ నగరాన్ని ఉమ్మడి రాజధానిగానే కొనసాగించాలని తాజాగా వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే.. ఈ విషయాన్ని లోక్ సభలో కూడా లేవనెత్తుతారా? లేక ఒక రాజకీయ వ్యాఖ్యగానే వదిలిపెడుతారా? అనేది తెలియదు.