తాడేపల్లి గ్యాంగ్‌రేప్.. అదే ప్రాంతంలో ఇటీవల ఐదు నేరాలు, నిందితుల్ని వదిలిపెట్టం: సుచరిత

By Siva Kodati  |  First Published Jun 21, 2021, 1:59 PM IST

తాడేపల్లి కృష్ణాతీరంలో ప్రేమజంటపై దాడి, గ్యాంగ్ రేప్ ఘటనలపై స్పందించారు ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత. ఇవాళ అత్యాచార బాధితులను ఆసుపత్రిలో పరామర్శించిన అనంతరం సుచరిత మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవలే తాడేపల్లి ఘటన జరిగిన ప్రాంతంలోనే 5 నేరాలు జరిగాయని ఆమె తెలిపారు


తాడేపల్లి కృష్ణాతీరంలో ప్రేమజంటపై దాడి, గ్యాంగ్ రేప్ ఘటనలపై స్పందించారు ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత. ఇవాళ అత్యాచార బాధితులను ఆసుపత్రిలో పరామర్శించిన అనంతరం సుచరిత మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవలే తాడేపల్లి ఘటన జరిగిన ప్రాంతంలోనే 5 నేరాలు జరిగాయని ఆమె తెలిపారు. బ్లేడులతో బెదిరించి వారి వద్ద సెల్‌ఫోన్లు లాక్కుంటున్నారని సుచరిత చెప్పారు. నిందితులు ఎవరైనా విడిచిపెట్టమని ఆమె స్పష్టం చేశారు. నాలుగు  పోలీస్ బృందాలను నియమించినట్లు సుచరిత పేర్కొన్నారు. 15 లక్షల మంది దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారని.. మూడు చోట్ల ఫోరెన్సిక్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నామని హోంమంత్రి వెల్లడించారు. 

Also Read:ప్రియుడిని కట్టేసి యువతిపై గ్యాంగ్ రేప్: నిందితుల మాటలు రికార్డు, ఫొటో లభ్యం

Latest Videos

మరోవైపు కృష్ణానదీ తీరంలో యువతిపై అత్యాచార ఘటనపై స్పందించారు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్. మొన్న రాత్రి కృష్ణా నది పరివాహక ప్రాంతంలో యువతి పై జరిగిన ఘటన అత్యంత హేయం, బాధాకరమన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన నిందితులను పట్టుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా ఇప్పటికే కృష్ణ, గుంటూరు జిల్లా ఎస్పీలు, విజయవాడ కమిషనర్ ల కు ఆదేశాలు జారీ చేశామని డీజీపీ తెలిపారు. ఇటువంటి అమానవీయ చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు గౌతం సవాంగ్ స్పష్టం చేశారు.

నేరానికి పాల్పడిన నిందితులు ఎంతటివారైనా ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. మహిళల భద్రత తమ ప్రథమ కర్తవ్యమని ఎన్నో చర్యలు చేపట్టినా, ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. ప్రతి మహిళ దిశ యాప్‌ను ఖచ్చితంగా వాడేలా చర్యలు చేపడతామని డీజీపీ తెలిపారు. మరోవైపు సీతానగరం ప్రాంతంలో బ్లేడ్ బ్యాచ్ హల్ చల్ చేస్తోంది. తాడేపల్లి రౌడీషీటర్ల నుంచి పోలీసులు ఇప్పటికే సమాచారాన్ని సేకరించారు. టవర్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

click me!