Asianet News TeluguAsianet News Telugu

ప్రియుడిని కట్టేసి యువతిపై గ్యాంగ్ రేప్: నిందితుల మాటలు రికార్డు, ఫొటో లభ్యం

ప్రియుడిని కట్టేసి యువతిపై దుండగులు సామూహిక అత్యాచారం చేసిన ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దుండగుల మాటలను యువతి తన సెల్ లో రికార్డు చేసినట్లు తెలుస్తోంది.

Tadepalli gang rape case: the incident occured like this
Author
Tadepalli, First Published Jun 21, 2021, 12:37 PM IST

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలో గల సీతానగరం పుష్కరఘాట్ వద్ద ప్రేమికుల జంటపై జరిగిన అఘాయిత్యం కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. ఈ కేసును ఛేదించడానికి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగిన రోజు ప్రేయసీప్రియులు రాత్రి 8.30 గంటలకు పుష్కరఘాట్ కు చేరుకున్నారు. 

బాధితురాలు నర్సుగా పనిచేస్తోంది. తనకు పరిచయం ఏర్పడిన యువకుడితో పరిచయం ప్రేమగా మారింది. తమ ప్రేమ గురించి ఇద్దరు తమ కుటుంబాలకు చెప్పారు. వారు పెళ్లికి అంగీకరించారు. దీంతో ఇరువురు తరుచుగా కలుసుకుంటూ వస్తున్నారు. ఘటన జరిగిన రోజు యువకుడు ప్రేయసికి ఫోన్ చేశాడు. దాంతో డ్యూటీ ముగిసిన వెంటనే బాధితురాలు యువకుడిని కలుసుకుంది. వారిద్దరు పుష్కర ఘాట్ కు చేరుకున్నారు. 

వారిద్దరు మాటల్లో మునిగిపోయారు. అలా సమయం గడిచిపోతూ వచ్చింది. ఆ సమయంలో దుండగులు వారిని చూశారు. యువకుడి కాళ్లూ చేతులూ కట్టేసి యువతిపై సామూహిక అత్యాచారం చేశారు. దానికి ముందు వారు మాటలను యువతి సెల్ లో రికార్డు చేసింది. ఆ రికార్డును పోలీసుులు పరిశీలిస్తున్నారు. 

సమయం గడుస్తున్నా తమ కూతురు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఫోన్ చేస్తే కలువలేదు. చివరకు రాత్రి 11 గంటలకు యువతి ఫోన్ నుంచి కుటుంబ సభ్యులకు ఫోన్ వచ్చింది. ఏడుస్తూ ఆమె వారితో మాట్లాడింది. చివరకు ఆమె ఇంటికి చేరుకుంది. యువతిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో నిందితుల్లో ఒక్కడి ఫొటో పోలీసుల చేతికి చిక్కినట్లు తెలుస్తోంది. 

ఇదిలావుంటే, సీతానగరం పుష్కరఘాట్ వద్ద ప్రేమ జంటపై జరిగిన అఘాయిత్యం కేసులో పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందితుల కోసం కృష్ణా, గుంటూరు జిల్లాల పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రియుడిని చెట్టుకు కట్టేసి నలుగురు దుండగులు యువతిపై సామూహిక అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. 

ప్రకాశం బ్యారేజీ దిగువ భాగాన మహానాడు సమీపంలోని రైల్వే వంతెన కింద నిందితులు యువతిపై సామూహిక అత్యాచారం చేసి నాటు పడవపై విజయవాడ వైపు వెళ్లినట్లు బాధితులు తెలిపారు. అప్పటికే చీకటి పడడంతో నిందితులను గుర్తించడం వారికి కష్టమైందని పోలీసులు చెబుతున్నారు. 

యువతితో పాటు యువకుడిని పోలీసులు తమ వెంట తీసుకుని వెళ్లి రెండు జిల్లాల్లోని అనుమానితులను చూపిస్తున్నారు నిందితులను గుర్తించాలని అతన్ని అడుగుతున్నారు గుంటూరు అర్బన్ అదనపు ఎస్పీ ఈశ్వర రావు, ఉత్తర మండలం డీఎస్పీ దుర్గాప్రసాద్, విజయవాడ టాస్క్ ఫోర్స్ ఏసీపీ రమణమూర్తులతో కూడిన బృందం సంయుక్తంగా ఘటన జరిగిన ప్రాంతాన్ని ఆదివారం సాయంత్రం పరిశీలించారు 

ఎస్ఐలు వినోద్ కుమార్, నారాయణ, బాలకృష్ణ వేర్వేరు బృందాలుగా ఏర్పడి కృష్ణా నది పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు విజయవాడ వ ైపు కృష్ణానదిలో ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని ఎస్సైలు వెంటాడి పట్టుకుని ప్రస్నించారు. వారిని బాధితునికి చూపించారు. అయితే, నేరం చేసింది వారు కాదని అతను చెప్పాడు. 

యువతిపై సామూహిక అత్యాచారం చేసినవారు బ్లేడ్ బ్యాచ్ కు చెందినవారా అనే కోణంలోనే కాకుండా వారు గంజాయి సేవించారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు 

Follow Us:
Download App:
  • android
  • ios