దిశ చట్టం అమలుకు జగన్ జాగ్రత్తలు: ఇద్దరు ప్రత్యేకాధికారుల నియామకం

By Siva Kodati  |  First Published Jan 2, 2020, 9:25 PM IST

చిన్నారులు, మహిళలపై అత్యాచార ఘటనల్లో వేగవంతమైన విచారణ, కఠిన శిక్షలు విధించేందుకు గాను అసెంబ్లీ ఆమోదించిన దిశ చట్టం అమలు, పర్యవేక్షణకు గాను ఏపీ ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది.


చిన్నారులు, మహిళలపై అత్యాచార ఘటనల్లో వేగవంతమైన విచారణ, కఠిన శిక్షలు విధించేందుకు గాను అసెంబ్లీ ఆమోదించిన దిశ చట్టం అమలు, పర్యవేక్షణకు గాను ఏపీ ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది.

ఐఏఎస్ అధికారి కృతికా శుక్లా, ఐపీఎస్ అధికారిణి దీపికలను అధికారులుగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కామాంధుల చేతిలో దారుణ హత్యకు గురయిన దిశ పేరిట ఓ ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. 

Latest Videos

undefined

Also Read:సత్వర న్యాయం: ఏపీ దిశ చట్టంలోని ముఖ్యాంశాలు ఇవే..

కేంద్ర ప్రభుత్వం చట్టంప్రకారం, నిర్భయ కేసుల్లో  జైలు లేదా మరణదండనను శిక్షగా విధిస్తుంటే తాజాగా రాష్ట్రం ప్రవేశపెట్టిన చట్టం ద్వారా రేప్‌ చేసినవారికి తప్పనిసరిగా మరణదండన విధిస్తారు. 

నిర్భయం చట్టం ప్రకారం 2 నెలల్లో దర్యాప్తు పూర్తి, మరో 2  నెలల్లో శిక్షలు పడాలి. అంటే మొత్తం 4 నెలల్లో దర్యాప్తు, న్యాయ ప్రక్రియ ఈరెండూ పూర్తికావాలి. దీన్ని ఏపీ దిశ చట్టంలో 4 నెలలకు కాదు 21 రోజులకు కుదించారు.  అత్యాచార నేరాల్లో విస్పష్టమైన, తిరుగులేని ఆధారాలు లభించినట్లయితే 21 రోజుల్లోపే నిందితుడికి శిక్ష పడాలి. వారంరోజుల్లో పోలీసు దర్యాప్తు పూర్తికావాలి. 14 రోజుల్లోపే న్యాయప్రక్రియ పూరెయి శిక్షపడాలి. 

అత్యాచార సంఘటనల్లో మాత్రమే కాకుండా పిల్లలపై లైంగిక నేరాలన్నింటికీ కూడా శిక్షల్ని పెంచారు.  కేంద్రం చేసిన ‘‘పోక్సో’’ చట్టం ప్రకారం పిల్లలపై లైంగిక నేరాలు, లైంగిక వేధింపులకు కనీసం 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకూ శిక్ష విధించవచ్చు. కానీ రాష్ట్రంలో ఆ శిక్షను జీవితఖైదుగా మార్చారు. అంటే పిల్లలపై ఇక ఎలాంటి లైంగిక నేరాలుచేసినా జీవితాంతం జైల్లో ఉండటమో, లేక ఉరికంబం ఎక్కడమో శిక్ష అవుతుంది. 

Also Read:దిశ నిందితుల ఎన్‌కౌంటర్: అసెంబ్లీలో జగన్ సంచలన వ్యాఖ్యలు

సోషల్‌మీడియా ద్వారా మహిళలను వేధించడం, వారిపై అసభ్య పోస్టింగులు పెట్టడం లాంటివి చేస్తే ఐపీసీ ప్రకారం ఇప్పటివరకూ శిక్షలు నిర్దిష్టంగా లేవు. ఈ చట్టం ద్వారా మెయిల్స్‌ద్వారా గాని, సోషల్‌ మీడియాద్వారా గాని, డిజిటల్‌ విధానంలోగాని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లయితే మొదటి తప్పుకు 2 ఏళ్లు, ఆతర్వాత తప్పుకు 4 ఏళ్లు శిక్ష విధించేలా ఐపీసీలో 354 (ఇ) అనే కొత్త సెక్షన్‌ను తీసుకు వచ్చారు.
 

click me!