విటమిన్ డి లోపం వల్ల జుట్టు రాలవచ్చు. కాబట్టి పుట్టగొడుగులు, నారింజ రసం, గుడ్లు, చేపలు వంటివి తినండి.
ఐరన్ లోపం వల్ల కూడా జుట్టు రాలవచ్చు. దీనికోసం పాలకూర, చిక్కుళ్ళు, మాంసం, గింజలు, వంటివి తినండి.
జుట్టు పెరగడానికి బయోటిన్ ఉన్న ఆహారాలు తీసుకోవడం ముఖ్యం. గింజలు, గుడ్లు, పుట్టగొడుగులు, చిలగడదుంప, సాల్మన్ చేప, చిక్కుళ్ళు వంటివి తినండి.
విటమిన్ బి12 లోపం కూడా జుట్టు రాలడానికి కారణం. కాబట్టి పాల ఉత్పత్తులు , మాంసం మీ ఆహారంలో చేర్చుకోండి.
విటమిన్ సి లోపం కూడా జుట్టు రాలడానికి కారణం. కాబట్టి సిట్రస్ పండ్లు, బెర్రీ పండ్లు మీ ఆహారంలో చేర్చుకోండి.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉన్న ఆహారాలు తినడం వల్ల జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. దీనికోసం అవిసె గింజలు, చియా గింజలు, వాల్నట్స్ వంటివి మీ ఆహారంలో చేర్చుకోండి.
జుట్టు రాలడాన్ని ఆపడానికి , జుట్టు పెరుగుదలకు జింక్ సహాయపడుతుంది. గుమ్మడికాయ గింజలు, చిక్కుళ్ళు, పాల ఉత్పత్తులు, గుడ్లు, పాలకూర వంటి వాటిలో జింక్ ఉంటుంది.