Asianet News TeluguAsianet News Telugu

బ్రో మూవీ జెన్యూన్ పబ్లిక్ టాక్ : 'ఎంటర్టైన్మెంట్ కోసం వస్తే సీరియల్ లాగా సాగదీసి ఏడిపించిండు, సినిమా బాగోలేదు

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటించిన మూవీ `బ్రో`. `భీమ్లా నాయక్‌`వంటి హిట్ మూవీ తర్వాత ఆయన్నుంచి వస్తోన్న చిత్రమిది. 

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటించిన మూవీ `బ్రో`. `భీమ్లా నాయక్‌`వంటి హిట్ మూవీ తర్వాత ఆయన్నుంచి వస్తోన్న చిత్రమిది. దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తో వస్తుందీ మూవీ. ఇందులో సాయిధరమ్‌ తేజ్‌ మరో హీరోగా నటిస్తుండటం ఈ చిత్రం స్పెషల్‌. తమిళ దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహించారు. ఆయన తమిళంలో రూపొందించిన `వినోదయ సిత్తం` చిత్రానికిది రీమేక్‌. తెలుగులో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్‌ వారియర్‌ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం నేడు శుక్రవారం(జులై 28)న విడుదలయ్యింది.ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందా లేదా ఈ పబ్లిక్ టాక్ లో తెలుసుకుందాము..!