Asianet News TeluguAsianet News Telugu

ఆదిపురుష్ మూవీ పబ్లిక్ టాక్ : డైరెక్షన్ ఫెయిల్, పబ్ జీ గేమ్ ఉన్నట్టుగా ఉంది

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చారిత్రాత్మక చిత్రం ఆదిపురుష్. 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చారిత్రాత్మక చిత్రం ఆదిపురుష్. భారతీయులు ఎంతో భక్తి శ్రద్దలతో ఆరాధించే పుణ్యపురుషుడు శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ నటించిన చిత్రం ఇది. రామాయణం పురాణం ఆధారంగా దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎన్నో వివాదాల మధ్య నలుగుతూ.. అదే విధంగా భారీ అంచనాలతో ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీరాముడిగా ప్రభాస్ నటించగా .. జానకి పాత్రలో కృతి సనన్.. రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు.విజువల్ వండర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా జనాలను ఆకట్టుకుందా లేదా ఈ పబ్లిక్ టాక్ లో తెలుసుకోండి..!