Asianet News TeluguAsianet News Telugu

వంశీ VS యార్లగడ్డ..గన్నవరంలో గెలిచేదెవరంటే!!

ఓవైపు అంతర్జాతీయ విమానాశ్రయం. మరోవైపు ఐటీపార్కు వంటి ఆధునిక హంగులు అద్దుకున్న అసెంబ్లీ నియోజకవర్గం గన్నవరం. 

ఓవైపు అంతర్జాతీయ విమానాశ్రయం. మరోవైపు ఐటీపార్కు వంటి ఆధునిక హంగులు అద్దుకున్న అసెంబ్లీ నియోజకవర్గం గన్నవరం. అక్కడ డెల్టా షుగర్స్ వంటి పరిశ్రమలకు తోడుగా వేగంగా విస్తరిస్తున్న ఆక్వా సాగు కూడా కనిపిస్తుంది. మెట్టకి, డెల్టాకి మధ్యన అటు విజయవాడ నగర శివార్లు, ఇటు గ్రామీణ కృష్ణా జిల్లా ఆనవాళ్లు కూడా కనిపిస్తాయి.వ్యవసాయాభివృద్ధి ద్వారా పారిశ్రామికంగా అడుగులు వేసి, ఆక్వాలో ముందుకు సాగుతున్న గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయంగానూ ఆసక్తికరంగా ఉంటుంది.ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత గడిచిన మూడు ఎన్నికల్లోనూ హోరా హోరీ పోరు సాగింది

Video Top Stories