Asianet News TeluguAsianet News Telugu

అభిమానుల మధ్యే ఫ్రెంచ్ ఓపెన్

ఫ్రెంచ్‌ ఓపెన్‌ ను ప్రేక్షకుల మధ్య నిర్వహించటానికి సన్నాహకాలు ప్రారంభించారు నిర్వాహకులు. ఈ నెల 27 నుంచి అక్టోబర్‌ 11 వరకు జరిగే ఈ టెన్నిస్‌ గ్రాండ్‌స్లామ్‌ ఈవెంట్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో మ్యాచ్‌లను ప్రత్యక్షంగా తిలకించేందుకు ప్రేక్షకులను అనుమతించనున్నారు. 

French Open 2020 To Take Place Amidst Spectators in The Stadium
Author
Paris, First Published Sep 9, 2020, 11:34 AM IST

ప్రేక్షకులు లేకుండా, ఖాళీ స్టేడియాలలో ఆటలు చాలా చప్పగా ఉంటాయి. అభిమానుల కోలాహలం, వారి మద్దతు అన్ని ఆడే క్రీడాకారులకు గొప్ప కిక్కును ఇస్తాయి. కానీ ప్రస్తుత కరోనా దెబ్బకు ఖాళీ స్టేడియాల్లోనే క్రీడలను నిర్వహిస్తున్నారు ఆటగాళ్లు ఆడుతున్నారు. 

కరోనా తో సహజీవనం చేయాల్సిందే అనే నిర్ణయానికి ప్రపంచం దాదాపుగా వచ్చేసింది. ఇక ఈ నేపథ్యంలో క్రీడలు కూడా అభిమానుల మధ్య సాగితే ఎలా ఉంటుందని ఇప్పటికే వాదనలు తెరమీదకు వస్తున్నాయి. భౌతిక దూరాన్ని పాటిస్తూ అభిమానులను స్టేడియంలకు అనుమతించాలని ఆలోచనను నిర్వాహకులు తెరమీదకు తీసుకొస్తున్నారు.   

తాజాగా ఫ్రెంచ్‌ ఓపెన్‌ ను ప్రేక్షకుల మధ్య నిర్వహించటానికి సన్నాహకాలు ప్రారంభించారు నిర్వాహకులు. ఈ నెల 27 నుంచి అక్టోబర్‌ 11 వరకు జరిగే ఈ టెన్నిస్‌ గ్రాండ్‌స్లామ్‌ ఈవెంట్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో మ్యాచ్‌లను ప్రత్యక్షంగా తిలకించేందుకు ప్రేక్షకులను అనుమతించనున్నారు. 

ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఫ్రెంచ్‌ టెన్నిస్‌ సమాఖ్య అధ్యక్షుడు బెర్నార్డ్‌ సోమవారం ప్రకటించారు. కరోనా విరామం అనంతరం ప్రేక్షకులతో జరగనున్న తొలి మేజర్‌ స్పోర్ట్స్‌ ఈవెంట్‌గా ఫ్రెంచ్‌ ఓపెన్‌ నిలవనున్నది. 

తాజాగా ఫ్రాన్స్‌ ప్రభుత్వం పారిస్‌ వంటి నగరాల్లో ఐదు వేల మందితో కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వడంతో ఫ్రెంచ్‌ ఓపెన్‌ టోర్నీ ప్రెకషకుల మధ్య నిర్వహించడానికి నిర్వాహకులు సన్నద్ధమయ్యారు. 

స్టేడియం లో ఉన్న సీటింగ్ కెపాసిటీలో 50 నుంచి 60 శాతం మందికి మాత్రమే స్టేడియం లోకి అనుమతించనున్నారు. ఈలెక్కన టోర్నీ జరుగుతున్న రోజుల్లో మ్యాచ్‌ను తిలకించటానికి రోజుకు 20 వేల మంది హాజరయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా టోర్నీకి వేదికయ్యే ప్రదేశాన్ని మూడు జోన్లుగా విభజించారు. మ్యాచ్‌ను చూడటానికి వచ్చిన ప్రేక్షకులు తప్పనిసరిగా మాస్కులను ధరించడంతోపాటుగా భౌతిక దూరాన్ని పాటించాలి.  

వాస్తవానికి ఫ్రెంచ్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ ప్రతి ఏటా మేనెలలో నిర్వహించేవారు. కరోనా వైరస్‌ దెబ్బకు నాలుగు నెలలు ఆలస్యంగా ఈ పోటీలు జరుగుతున్నాయి. ఇక టోర్నీలో ఆడేందుకు వచ్చిన ప్లేయర్లకు ఐదు రోజుల వ్యవధిలో కరోనా పరీక్షలు చేస్తారు. ఆటగాళ్లకు రెండు సార్లు నెగెటివ్‌ అని వస్తేనే వారిని టోర్నీలో ఆడేందుకు అనుమతిస్తామని టోర్నీ డైరెక్టర్‌ తెలిపారు. కరోనా దెబ్బకు ఆర్థికరంగం పడకేసిన ఫ్రెంచ్ ఓపెన్ లో చెల్లించే ప్రైజ్ మనీని పెంచారు నిర్వాహకులు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios