Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ లిక్కర్ స్కాం, కవిత అరెస్ట్: ఎవరి వాదన వారిదే

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై  ఈడీ పలు ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను కవిత తోసిపుచ్చారు.

Why a Telangana MLC kavitha was arrested in the Delhi excise policy case lns
Author
First Published Mar 18, 2024, 10:44 AM IST


హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో  కల్వకుంట్ల కవితను  మూడు రోజుల క్రితం  ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.ఈ కేసులో కవితను ఈడీ అధికారులు కస్టడీకి తీసుకున్నారు.  సోమవారం నాడు రెండో రోజు ఈడీ అధికారులు విచారణ నిర్వహిస్తున్నారు.రాజకీయ దురుద్దేశంతోనే కవితను  అరెస్ట్ చేసినట్టుగా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది.

also read:రష్యా అధ్యక్ష ఎన్నికలు: పుతిన్ విజయం

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మనీలాండరింగ్ నిరోధక చ్టటం 2002 కింద  అరెస్ట్ చేసినట్టుగా  ఈడీ అధికారులు  పేర్కొన్నారు.ఢిల్లీ లిక్కర్ స్కాంలో  కవిత  పాత్ర ఉందని ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు.  సౌత్ లాబీలో  కవిత పాత్ర ఉందని  ఈడీ  ఆరోపణలు చేసింది.  

also read:ఈడీ అరెస్ట్: సుప్రీంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే అరెస్టైన మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి తదితరులను దర్యాప్తు అధికారులు విచారించారు.ఈ కేసులో కొందరు  దర్యాప్తు సంస్థలకు అఫ్రూవర్లుగా మారిన విషయం తెలిసిందే. అఫ్రూవర్లు ఇచ్చిన సమాచారం మేరకు  దర్యాప్తు సంస్థలు విచారణ నిర్వహించాయి. అంతేకాదు  గతంలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పలు చోట్ల  దర్యాప్తు సంస్థలు  సోదాలు నిర్వహించాయి.ఈ సోదాల సమయంలో  లభించిన సమాచారం ఆధారంగా  అధికారులు  ఈ కేసును విచారిస్తున్నారు.

also read:హృతిక్ రోషన్ పాటకు జంట డ్యాన్స్: సోషల్ మీడియాలో వైరల్

ఆప్ నేతలకు  రూ. 100 కోట్లను ముడుపులుగా ఇచ్చి  ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని తమకు అనుకూలంగా  మార్చుకున్నారని ఈడీ ఆరోపిస్తుంది. గతంలో కవిత ఉపయోగించిన ఫోన్లు,డాక్యుమెంట్లను కూడ  ధ్వంసం చేశారని కవితపై ఈడీ ఆరోపణలు చేసింది. విచారణకు కూడ  కవిత  సహకరించలేదని  ఈడీ ఆరోపణలు చేసింది.ఈ కారణాలతోనే అరెస్ట్ చేసినట్టుగా  ఈడీ అధికారులు  రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

also read:కూరగాయల తరహలోనే నూడుల్స్ విక్రయం: సోషల్ మీడియాలో వైరలైన వీడియో

ఈ ఆరోపణలను కవిత ఖండిస్తున్నారు. ఈడీ ఆరోపిస్తున్నట్టుగా   ఓ లిక్కర్ సంస్థలో  వాటా ఉన్నట్టుగా  ఆరోపణలను  కవిత తోసిపుచ్చారు.  తొలుత ఢిల్లీ లిక్కర్ స్కాంలో  కవితను సాక్షిగా విచారించారు.ఆ తర్వాత  ఈ కేసులో  కవితను నిందితురాలిగా చేర్చినట్టుగా దర్యాప్తు సంస్థలు పేర్కొన్న విషయం తెలిసిందే. సాక్షిగా ఉన్న కవిత నిందితురాలిగా ఎలా మారిందని  బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. కవిత అరెస్ట్ వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీపై ఆరోపణలు రావడంతో  ఈ పాలసీని  ఆప్ సర్కార్ రద్దు చేసింది. అయితే ఈ పాలసీ  తయారీలో కొందరికి  లబ్ది చేకూరేలా ఆప్ సర్కార్ వ్యవహరించిందని  బీజేపీ ఆరోపణలు చేసింది.  ఈ కేసు విషయమై సీబీఐ దర్యాప్తును ప్రారంభించింది. సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ కూడ రంగంలోకి దిగింది.  

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఇప్పటికే అరెస్ట్ చేశారు. సిసోడియాతో పాటు  ఇతరులను కూడ దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.ఢిల్లీ లిక్కర్ స్కాంలో  కవిత మనీలాండరింగ్ కు పాల్పడిందని ఈడీ ఆరోపిస్తుంది. సౌత్ లాబీలో కవిత కీలకమని  ఈడీ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను కవిత తోసిపుచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios