Asianet News TeluguAsianet News Telugu

శంషాబాద్ ఎయిర్ పోర్టులో స్మార్ట్ ట్రాలీలు: నెట్టింట వీడియో వైరల్

టెక్నాలజీని మనిషి అవసరాలను తీర్చడం కోసం ఉపయోగించుకుంటున్నాడు. దేశంలోనే తొలిసారిగా హైద్రాబాద్ ఎయిర్ పోర్టులో ప్రవేశ పెట్టిన  స్మార్ట్ ట్రాలీలపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తూ పోస్టులు పెడుతున్నారు. 

Smart trolleys at Hyderabad Airport go viral, what makes it so special? lns
Author
First Published Feb 21, 2024, 11:14 AM IST

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో స్మార్ట్ ట్రాలీలు  సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ట్రాలీలపై  పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహా స్మార్ట్  ట్రాలీలను పలువురు అభినందిస్తూ సోషల్ మీడియాలో  పోస్టులు పెడుతున్నారు. స్మార్ట్ ట్రాలీలను ప్రవేశ పెట్టిన ఎయిర్ పోర్టు దేశంలోనే తొలి ఎయిర్ పోర్టుగా హైద్రాబాద్ ను  చెబుతున్నారు.

also read:ఆర్టీసీ బస్సు ఫుట్ బోర్డుపై జర్నీ: పట్టుతప్పి కిందపడ్డ మహిళ, ఏమైందంటే?

సోషల్ మీడియా ఎక్స్ వేదికగా  గోయెంకా స్మార్ట్ ట్రాలీ గురించి  వివరిస్తూ  ఓ వీడియోను షేర్ చేశారు.  అభివృద్ది చెందిన దేశాల్లోని విమానాశ్రయాల్లో కూడ ఈ తరహా  స్మార్ట్ ట్రాలీలను తాను చూడలేదని  గోయెంకా వ్యాఖ్యానించారు. హైద్రాబాద్ ఎయిర్ పోర్టులోని  స్మార్ట్ ట్రాలీల పనితీరు గురించి  ఆయన ఈ వీడియోలో పూర్తిగా వివరించారు. 

 

స్మార్ట్ ట్రాలీలతో ప్రయాణీకులకు మరింత మెరుగైన సేవలు అందుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. హైద్రాబాద్ ఎయిర్ పోర్టును  స్మార్ట్ ఎయిర్ పోర్టు సిటీగా మార్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామని  జీఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు లిమిటెడ్ ప్రకటించింది. ఈ ఎయిర్ పోర్టు ద్వారా ప్రయాణం చేసే ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు అందించే ప్రయత్నంలో భాగంగానే  స్మార్ట్  ట్రాలీలను ప్రవేశ పెట్టినట్టుగా నిర్వాహకులు ప్రకటించారు.

also read:జయలలిత 27 కిలోల బంగారం వేలం: ఎందుకో తెలుసా?

హైద్రాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో  ఎయిర్ పోర్టు బ్యాగేజీ ట్రాలీ ప్రాజెక్టును  జీఎంఆర్ సంస్థ ప్రారంభించింది. సుమారు  3 వేల స్మార్ట్ ట్రాలీలను టెక్నాలజీతో అనుసంధానం చేశారు. దీంతో ప్రయాణీకులకు ఈ ట్రాలీల ద్వారా మెరుగైన సౌకర్యం అందనుంది.

also read:చేతిలో చిల్లిగవ్వ లేదు, టీ కోసం డబ్బు సంపాదించారు: నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియో

స్మార్ట్ ట్రాలీ ఎలా పనిచేస్తుంది

 స్టార్ట్ నౌ అనే బటన్ పై క్లిక్ చేయాలి.
ఆ తర్వాత బోర్డింగ్ పాస్ క్యూఆర్ కోడ్ ను  స్కాన్ చేయాలి.ఒకవేళ అది పనిచేయకపోతే  ఫైండ్ యువర్ ఫ్లైట్ బటన్ నొక్కాలి.
ఆ తర్వాత చెక్ ఫ్లైట్స్ ఆఫ్షన్ ను ఎంచుకొని మీ ఫ్లైట్ ను సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మీరు వెళ్లాల్సిన గేట్ నెంబర్ ను సూచిస్తుంది.  అంతేకాదు ప్రయాణీకుల బోర్డింగ్ టైమింగ్ ను కూడ సూచిస్తుంది. అంతేకాదు ఎయిర్ పోర్టులోని సౌకర్యాల గురించి కూడ  స్మార్ట్ ట్రాలీ స్క్రీన్ పై కన్పిస్తుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios