Asianet News TeluguAsianet News Telugu

తలకు బలమైన గాయాలతోనే మృతి: లాస్య నందిత పోస్టుమార్టం నివేదిక

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే  లాస్య నందిత  మృతిపై పోస్టు మార్టం రిపోర్టులో కీలక విషయాలు వెలుగు చూశాయి.

post mortem Report Reveals key information on Lasya Nanditha death lns
Author
First Published Feb 23, 2024, 3:15 PM IST


హైదరాబాద్: తలకు బలమైన గాయాలు కావడం వల్లే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందినట్టుగా  పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక చెబుతుంది.సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ప్రయాణీస్తున్న కారు  శుక్రవారం నాడు తెల్లవారుజామున పటాన్ చెరు సమీపంలో  ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ప్రమాదానికి గురైంది.

also read:రోడ్డు ప్రమాదంలో లాస్యనందిత మృతి: నివాళులర్పించిన కేసీఆర్

ఈ ప్రమాదంలో  లాస్య నందిత  అక్కడికక్కడే మృతి చెందారు.  లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కనే ఉన్న రెయిలింగ్ ను ఢీకొట్టింది. అతి వేగంగా  రెయిలింగ్ ను ఢీకొట్టడంతో  లాస్య నందితకు బలమైన గాయాలై మృతి చెందినట్టుగా  పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక ప్రకారం తెలుస్తుంది. లాస్య నందిత  తై బోన్, రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యాయి.  కాలు కూడ పూర్తిగా విరిగిపోయిందని  పోస్టుమార్టం  రిపోర్టు తెలిపింది. కారులో ప్రయాణీస్తున్న సమయంలో లాస్య నందిత సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం కూడ  ఆమె మృతికి కారణమైందనే అభిప్రాయాన్ని  పోస్టు మార్టం నివేదిక చెబుతుంది.

రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని  ఆసుపత్రికి లాస్య నందితను తరలించారు.  పటాన్ చెరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు  లాస్య నందితను పరీక్షించారు. అయితే అప్పటికే  లాస్య నందిత మృతి చెందినట్టుగా వైద్యులు ప్రకటించారు. లాస్య నందిత మృతదేహన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో  పోస్టు మార్టం నిర్వహించిన తర్వాత  స్వగృహనికి పార్థీవదేహన్ని తరలించారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios