Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణను దోచుకున్నవారిని వదలం: లిక్కర్ స్కాంపై జగిత్యాల సభలో మోడీ వ్యాఖ్యలు

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకటేనని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విమర్శించారు. 

Narendra Modi Responds on Delhi liquor scam in Jagtial Sabha lns
Author
First Published Mar 18, 2024, 12:43 PM IST

జగిత్యాల:తెలంగాణను దోచుకున్నవారిని విడిచిపెట్టేది లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు.సోమవారంనాడు జగిత్యాలలో నిర్వహించిన బీజేపీ విజయసంకల్ప యాత్రలో  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు.దోపిడీదారులను వదిలిపెట్టబోమని మోడీ విమర్శించారు.ఇది మోడీ గ్యారెంటీ అని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు.

also read:ప్రతి మహిళ శక్తి రూపంలో కన్పిస్తుంది: జగిత్యాల సభలో రాహుల్ వ్యాఖ్యలకు మోడీ కౌంటర్

ఆంగ్లేయులు, రజాకార్లతో పోరాడిన నేల ఇది అని మోడీ గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల ఆశలను కాంగ్రెస్ నాశనం చేసిందని ఆయన విమర్శించారు.తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ ద్రోహం చేసిందని ఆయన ఆరోపించారు.తెలంగాణను కాంగ్రెస్ ఇప్పుడు తన ఏటీఎంగా మార్చుకొందని మోడీ విమర్శించారు.తెలంగాణ డబ్బు ఇప్పుడు ఢిల్లీ చేరుతుందన్నారు.ఒక దోపీడీదారు మరో దోపీడీదారుపై పోరాడలేరని ప్రజలకు తెలుసునన్నారు.బీఆర్ఎస్ చేసిన దోపీడీపై కాంగ్రెస్ మౌనం వహిస్తుందని ఆయన ఆరోపించారు.కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన దోపిడీని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించడం మానేసిందన్నారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఒకరినొకరు కాపాడుకుంటున్నాయని  మోడీ విమర్శించారు.ఈ రెండు పార్టీలు తనను విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయన్నారు.

 

also read:తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ రాజీనామా: తమిళనాడు నుండి ఎన్నికల బరిలోకి?

కుటుంబ పార్టీలు దేశాన్ని దోచుకొనేందుకు రాజకీయాలు చేస్తాయని మోడీ విమర్శించారు. దేశంలో ఏ దోపిడీని పరిశీలించినా దాని వెనుక కుటుంబ పార్టీలే ఉన్నాయని మోడీ  ప్రస్తావించారు.కుటుంబ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ కాళేశ్వరంలో అవినీతి చేసిందని మోడీ విమర్శలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కూడ బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందని మోడీ ఆరోపించారు.

also read:రష్యా అధ్యక్ష ఎన్నికలు: పుతిన్ విజయం

తెలంగాణలో బీజేపీని ఎంతగా గెలిపిస్తారో..తాను అంతగా బలోపేతం అవుతానన్నారు.తెలంగాణలో బీజేపీకి అధికారమిస్తే మరింతగా రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.పసుపు రైతుల కోసం పసుపు బోర్డు తెచ్చిన విషయాన్ని మోడీ గుర్తు చేశారు.తెలంగాణలో లక్ష కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేసిన విషయాన్ని మోడీ ప్రస్తావించారు.

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ పేరు బయటకు వచ్చిందన్నారు. కాంగ్రెస్ కూడ కుటుంబ పార్టీనేనని మోడీ గుర్తు చేశారు.ఇప్పుడు ఆ జాబితాలో కుటుంబ పార్టీ బీఆర్ఎస్ కూడ చేరిందని మోడీ విమర్శించారు.

Follow Us:
Download App:
  • android
  • ios