Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్‌లోకి: బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన కోనేరు కోనప్ప

బీఆర్ఎస్ కు సిర్పూర్ కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప  రాజీనామా చేశారు.
 

koneru konappa Resigns to BRS,likely to join in Congress on March 14 lns
Author
First Published Mar 13, 2024, 2:12 PM IST


హైదరాబాద్: భారత రాష్ట్ర సమితికి సిర్పూర్ కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే  కోనేరు కోనప్ప బుధవారంనాడు రాజీనామా చేశారు.  ఈ నెల  14న కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కోనేరు కోనప్ప ఇప్పటికే  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ ముఖ్యులతో భేటీ అయిన విషయం తెలిసిందే.

also read:గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష రద్దు: ఏపీ హైకోర్టు కీలక తీర్పు

గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో  బీఆర్ఎస్ ఓటమి పాలైన తర్వాత చోటు చేసుకున్న రాజకీయ  పరిణామాల నేపథ్యంలో  కోనేరు కోనప్ప   బీఆర్ఎస్ ను వీడాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం మేరకు  ఇవాళ  కోనేరు కోనప్ప బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. తన అనుచరులు, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో కలిసి  ఈ నెల  14న కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

also read:ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలకేసులో కీలకమలుపు: విచారణ సిట్ కు అప్పగింత

2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ కాగజ్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి  కోనేరు కోనప్ప విజయం సాధించారు. 2014లో బీఎస్పీ నుండి కోనప్ప విజయం సాధించారు. ఆ తర్వాత  బీఎస్పీని బీఆర్ఎస్ లో విలీనమైన విషయం తెలిసిందే.  

also read:హైద్రాబాద్ లో ఉచిత హలీం ఆఫర్: హోటల్ కు పోటెత్తిన జనం, లాఠీచార్జీ (వీడియో)

2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ కాగజ్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి  కోనేరు కోనప్ప విజయం సాధించారు. 2014లో బీఎస్పీ నుండి కోనప్ప విజయం సాధించారు. ఆ తర్వాత  బీఎస్పీని బీఆర్ఎస్ లో విలీనమైన విషయం తెలిసిందే.  

also read:ఇక నుండి సెప్టెంబర్ 17న హైద్రాబాద్ విమోచన దినోత్సవం: కేంద్రం నోటిఫికేషన్

కోనేరు కోనప్ప గతంలో కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు.ఆ తర్వాత  రాజకీయ పరిణామాల నేపథ్యంలో  కాంగ్రెస్ ను వీడి ఆయన బీఆర్ఎస్ లో చేరారు. తిరిగి ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios